ప్రపంచంలో కెల్లా అతివేగంగా స్కూటర్ నడిపే 'కుక్క'
చిన్నప్పుడు మనం సుమతీ శతకాల్లో కుక్కబుద్ధి గురించి ఓ పథ్యం (కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి) చదువుకున్నాం గుర్తుందా..? బంగారు సింహాసనంపై కుక్కను కూర్చోబెట్టినప్పటికీ దాని బుద్ధి ఎలాగ మారదో, అలాగే అల్పుడికి ఎంత గౌరవం చేసిన తన నీచత్వమును వదలడు అనేది ఆ పథ్య తాత్పర్యం. ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్పుకోవాల్సివచ్చిందో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
ఈ పథ్యంలో చెప్పినట్లుగా, కుక్కను తీసుకొచ్చి బంగారు సింహాసనంపై కూర్చోబెడితే ఏం చేస్తుందో తెలియదు గానీ, ఈ ఫొటోలో కనిపింటే కుక్కను మాత్రం చిన్న పిల్లల స్కూటర్‌పై లేదా సైకిల్‌పై చూర్చోబెడితే మాత్రం చకచకా తొక్కేస్తుంది. అంతేకాదండోయ్.. ఇది ప్రపంచంలో కెల్లా అతి వేగంగా స్కూటర్ నడిపే కుక్కగా కూడా రికార్డు సృష్టించింది. ఈ కుక్కపేరు నోర్మన్.
ది ఫాస్టెస్ట్ డాగ్ ఆన్ స్కూటర్‌గా పేరు దక్కించుకున్న ఈ కుక్క గారి గురించి మరిన్ని విశేషాలను క్రింది ఫొటో ఫీచర్‍లో పరిశీలిద్దాం రండి.

ఊరు, పేరేంటి?
ఈ ఫొటోలో కనిపిస్తున్న కుక్క పేరు నోర్మన్. దీని వయస్సు మూడేళ్లు మాత్రమే. ఇదొక ఫ్రెంచ్ షీప్ డాగ్. (గొర్రె మాదిరిగా వళ్లంతా బొచ్చు ఉంటుంది కాబట్టి దీనిని షీప్ డాగ్ అంటారు)

ఘనత ఏంటి?
సాధారణంగా కుక్క రెండు కాళ్లపై నిలుచుకోవటమే పెద్ద వింత. అలాంటిది ఈ నోర్మన్ కుక్క ముందు రెండు కాళ్లతో స్టీరింగ్‌ను (హ్యాండిల్)ను కంట్రోల్ చేస్తూ, వెనుక రెండు కాళ్లతో సైకిల్/స్కూటర్‌ను నడుపుతుంది.

ఫాస్టెస్ట్ డాగ్ ఆన్ స్కూటర్
నోర్మన్ సైకిల్/స్కూటర్‌పై కేవలం 30 సెకండ్లలోనే 30 మీటర్ల వేగాన్ని పూర్తి చేసిన ప్రపంచంలో కెల్లా అతి వేగంగా సైకిల్ నడిపే కుక్కగా రికార్డు సృష్టించింది.

గిన్నిస్ బుక్‌లోకి ఆహ్వానం
నోర్మన్ రికార్డు చూసి నోరెళ్లబెట్టిన గిన్నిస్ బుక్ అధికారులు, ఈ రికార్డును అధికారికంగా గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డులలో నమోదు చేసేందుకు నోర్మన్‌ను ఆహ్వానించారు.
నోర్మన్ సైక్లింగ్ వీడియో
నోర్మన్ కుక్క గారు సైకిల్ తొక్కే విధానాన్ని ఈ వీడియోలో తిలకించవచ్చు.

సెలబ్రిటీ డాగ్
నోర్మన్ సాధించిన రికార్డుతో ఇది సెలబ్రిటీ డాగ్‌గా మారిపోయింది. అనేక టెలివిజన్ ఛానెళ్లలో ఈ కుక్క గురించి వార్తలు ప్రసారం చేశారు.

వెబ్‌సైట్, ఫేస్‌బుక్ అకౌంట్
నోర్మన్ కుక్క గారి కోసం అఫీషియల్ వెబ్‌సైట్ కూడా ఉంది. అంతేకాదండోయ్.. ఈయన గారి కోసం ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో కూడా ఓ పేజీని ఓపెన్ చేశారు.

స్కూటర్‌పై
చిన్న పిల్లల స్కూటర్ నడుపుతున్న నోర్మన్.

స్కూటర్‌పై
ముందు రెండు కాళ్లను స్టీరింగ్‌పై ఉంచి, వెనుక రెండు కాళ్లలో ఒకదానిని స్కూటర్‌పై ఉంచి మరొక కాలుతో స్కూటర్‌ను నెట్టుకుంటూ కేవలం 30 సెకండ్ల వ్యవధిలోనే 30 మీటర్ల దూరాన్ని చుట్టింది ఈ నోర్మన్.


Click it and Unblock the Notifications








