బుడతడు ఉపయోగించడానికి బుల్లి కారు తయారుచేసిన తండ్రి

జీప్ కంపెనీ తన విల్లీస్ ఆఫ్ రోడర్ కారును భారతదేశంలో చాలా సంవత్సరాలుగా విక్రయిస్తోంది. ఇప్పుడు ఒక చిన్న జీప్ విల్లిస్ కారు యొక్క వీడియో బయటకు వచ్చింది. ఈ విల్లీస్ సాధారణ విల్లిస్ కారు కంటే చాలా చిన్నగా ఉంది. ఈ కారును కేరళకు చెందిన అరుణ్ కుమార్ తయారు చేశారు. ఈ బుల్లి కారు గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

బుడతడు ఉపయోగించడానికి బుల్లి కారు తయారుచేసిన తండ్రి

అరుణ్ కుమార్ తన 10 సంవత్సరాల కొడుకు కోసం ఈ కారును తయారు చేశాడు. అతని పదేళ్ల కుమారుడు కేరళలోని కొల్లం జిల్లాలోని అంచల్ పట్టణంలో నివసిస్తున్నాడు. ఈ కారు నటుడు మోహన్ లాల్ చేత ప్రేరణ పొందింది.

బుడతడు ఉపయోగించడానికి బుల్లి కారు తయారుచేసిన తండ్రి

విల్లిస్ కారు వీడియోను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో షేర్ చేశారు. ఈ చిన్న కారు సోషల్ నెట్ వర్క్ సైట్ లో చక్కర్లు కొడుతోంది. విల్లిస్ కారు ఎలా తయారు చేయబడిందో కూడా ఈ వీడియోలో మనం చూడవచ్చు.

MOST READ:కరోనా ఎఫెక్ట్ : పండ్లు అమ్ముకుంటున్న టాక్సీ & క్యాబ్ డ్రైవర్లు

బుడతడు ఉపయోగించడానికి బుల్లి కారు తయారుచేసిన తండ్రి

ఈ చిన్న జీప్ కారును పూర్తిగా తయారు చేయడానికి ఏడు నుండి ఎనిమిది నెలల సమయం పట్టింది అని అరుణ్ కుమార్ చెప్పారు. తన ఖాళీ సమయంలో కారు నిర్మించబడిందని ఆయన తెలిపారు.

బుడతడు ఉపయోగించడానికి బుల్లి కారు తయారుచేసిన తండ్రి

ఈ కారు బరువు 75 కిలోలు మాత్రమే. కానీ ఈ కారు రెట్టింపు బరువును మోయగల సామర్త్యాన్ని కలిగి ఉంటుంది. ఈ మినీ విల్లిస్ యొక్క చట్రం సాధారణ GA పైపులను ఉపయోగించి అరుణ్ కుమార్ తయారు చేసారు.

MOST READ:24 గంటల్లో 7,413 వాహనాలు సీజ్ చేసిన చెన్నై పోలీసులు, ఎందుకంటే ?

అదనంగా కారు లీఫ్ సస్పెన్షన్ కోసం రాయల్ ఎన్ఫీల్డ్ అనలాగ్ కన్సోల్ మరియు మెటల్ ప్లేట్లను ఉపయోగించింది. ఇవి సైకిల్ సాకెట్ వ్యవస్థ ద్వారా కారు వెనుక ఇరుసులతో అనుసంధానించబడి ఉంటాయి.

బుడతడు ఉపయోగించడానికి బుల్లి కారు తయారుచేసిన తండ్రి

ఈ కారుకు ర్యాక్ మరియు పిలియన్ సీట్లు అందించబడ్డాయి. ఇలాంటి చిన్న కార్లకు మార్కెట్లో స్టెర్లింగ్ వీల్ వ్యవస్థ లేకపోవడానికి కారణంగా అరుణ్ స్టెర్లింగ్ వీల్ స్వయంగా సృష్టించారు. ఈ చిన్న కారుకు నిజమైన జీప్ విల్లిస్ రూపాన్ని ఇవ్వడానికి ఫోల్డబుల్ ఫాబ్రిక్ రూఫ్ అమర్చారు. ఇది చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది చిన్న పిల్లలు ఉపయోగించడానికి అనుకూలంగా తయారు చేయబడింది.

Source: Arunkumar Creativity/YouTube

MOST READ:ముంబైలో కనుమరుగు కానున్న ప్రీమియర్ పద్మిని టాక్సీలు, ఎందుకో తెలుసా ?

Most Read Articles

English summary
This Fully Functional Jeep Willys Miniature Toy Was Built In Just 7 Months. Read in Telugu.
Story first published: Monday, June 29, 2020, 18:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more