కూతురి కోసం మినీ బుల్లెట్‌ బైక్‌ను తయారుచేసిన తండ్రి.. ఎంత ఈజీగా నడుపుతున్నారో, వీడియో వైరల్‌

మోడిఫైడ్‌ వాహనాలను తరచూ చూస్తూనే ఉంటున్నాం. ఇటీవల ఓ యువకుడు తన టయోటా ఫార్చ్యూనర్‌ కారులో అధునాతన టాయిలెట్‌ను నిర్మించాడు. మరో యూ ట్యూబర్‌ తన కారులో చిన్నపాటి బెడ్‌ రూమ్‌నే ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఓ వ్లాగర్‌ ఏకంగా చిన్నపాటి బుల్లెట్‌ బైక్‌నే తయారుచేశాడు. అది కూడా తన కూతురు కోసం..

దేశీయ మార్కెట్లో పలు ఆటోమొబైల్‌ వర్క్‌షాపుల్లో కార్లు లేదా బైక్‌లను తమకు నచ్చినట్లుగా కొందరు మోడిఫై చేయిస్తుంటారు. అందుకు సంబంధించి పలు వీడియోలను యూట్యూబ్‌ల్లో చూస్తున్నాం. అయితే సాధారణంగా చిన్న పిల్లల కోసం కార్ల బొమ్మలు, బైక్‌ బొమ్మలు చాలా ఉన్నాయి. వాటి ద్వారా పిల్లలు ఇంట్లో ఆడుకుంటూ ఎంజాయ్‌ చేస్తారు.

Father-Built-Mini-Royal-Enfield-Bullet-Bike

కానీ ఇక్కడ ఓ తండ్రి తన పదేళ్ల కూతురు కోసం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ బైక్‌(Mini Bullet Bike)ను పోలి ఉండే మినీ బైక్‌ను రూపొందించారు. అంతే కాకుండా దానిని రోడ్డుపైకి రైడ్‌కు తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. మరో విశేషం ఏమిటంటే.. ఈ బైక్‌ను అతను తన సొంత గ్యారేజీలోనే నిర్మించారు.

హోండా యాక్టివా నుంచి తీసుకున్న ఇంజిన్‌ను వ్లాగర్‌.. ఈ మినీ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ బైక్‌లో ఉపయోగించినట్లు తెలిపారు. ఈ బైక్‌కు రోడ్డుపై స్పందన ఎలా ఉందో తెలుసుకోవడానికి రోడ్డుపైకి తీసుకొచ్చారు. వ్లాగర్‌ తన ఇంటి చుట్టూ ఉన్న ఇరుకైన రోడ్లపై ఈ బైక్‌ నడుపుతూ మెయిన్‌ రోడ్డుపైకి వెళ్లారు.

Father-Built-Mini-Royal-Enfield-Bullet-Bike

అనంతరం మరో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై తన స్నేహితుడితో కలిసి ఈ రెండు బైక్‌లపై ఢిల్లీలో సందడిగా రోడ్లపైకి వచ్చారు. వ్లాగర్‌ రూపొందించిన ఈ మినీ బైక్‌ చాలా మందిని ఆకర్షించింది. ఆ మినీ బైక్‌ గురించి తెలుసుకోవడానికి చాలా మంది అతని చుట్టూ చేరారు. ఇదెలా సాధ్యమని అతనిని అడిగి తెలుసుకోవడాన్ని వీడియోలో చూడవచ్చు.

ట్రాఫిక్‌లోనూ అతనూ ఆ మినీ రాయల్‌ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ బైక్‌ను సులభంగా రైడ్‌ చేస్తుండగా.. ట్రాఫిక్‌ పోలీసులు అతడిని గుర్తించారు. దీంతో ఆ వ్యక్తి పోలీసుల వద్ద ఆ మినీ బైక్‌ను ఆపి.. ఎలా ఉందని వారి అభిప్రాయాన్ని అడుగుతారు. కాగా అతడి క్రియేటివిటీకి సైతం ట్రాఫిక్‌ అధికారులు ఫిదా అయ్యారు. అతడిని అభినందించారు.

Father-Built-Mini-Royal-Enfield-Bullet-Bike

తన 10 ఏళ్ల కుమార్తె కోసం తన గ్యారేజీలోనే ఈ మినీ బైక్‌ను రూపొందించినట్లు పోలీసులకు వివరించారు. రోడ్డుపై ఈ బైక్‌ను ఈజీగా రైడ్‌ చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ మినీ బైక్‌ను తన కూతురు నివాస ప్రాంతంలో మాత్రమే ఉపయోగిస్తుందని.. ఈ బైక్‌ రోడ్లపైకి రాదని ట్రాఫిక్‌ పోలీసులకు హామీ ఇచ్చాడు.

కానీ ఇలా చేయడం చట్ట విరుద్ధమని గ్రహించాలి. ఇలాంటి కస్టమ్‌ బిల్ట్‌ బైక్‌లో రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఉండదు. ఇలాంటి బైక్‌పై రోడ్డుపై రైడ్‌ చేయడం చట్ట విరుద్ధం. అయితే అతను ఇలా చేయడం ద్వారా రోడ్డుపై ఈ బైక్‌ ట్రాఫిక్‌ పోలీసుల దృష్టికి వెళ్లింది.
అయితే ఈ క్రమంలో మినీ బైక్‌ను తనిఖీ చేసిన పోలీసులు.. సరైన రిజిస్ట్రేషన్ నంబర్‌ లేకుండా

రోడ్డుపైకి రాకూడదని రైడర్‌కు సూచించారు. అనంతరం స్పెసిఫికేషన్ల గురించి ఆరా తీయగా.. ఆ మినీ బైక్‌లో యాక్టివా నుంచి 110-సీసీ ఇంజిన్, ఏవియేటర్ నుంచి డిస్క్ బ్రేక్‌లు, మరొక బైక్ నుంచి సస్పెన్షన్‌ని ఉపయోగించినట్లు చెప్పారు.

ఆ మినీ బైక్‌కు పింక్ పెయింట్ ఫినిషింగ్‌ వేయడంతో.. తన కుమార్తె ఆ బైక్‌కు "పింకీ" అని పేరు పెట్టిందని వ్లాగర్‌ తెలిపారు. ఈ బైక్‌ స్పీడ్‌ లిమిట్‌ గంటకు 20 కి.మీ అని వెల్లడించారు. ఏదైమైనా కూతురిపై ప్రేమతో క్రియేటివిటీతో ఇలాంటి మినీ బైక్‌ను రూపొందించినందుకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, November 22, 2023, 12:27 [IST]
English summary
Father built mini royal enfield bullet bike for his daughter video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+