ఫస్ట్ టైమ్ కార్ డ్రైవ్ చేయడానికి సిద్దమైన కుమార్తెతో తండ్రి ఫన్నీ [వీడియో]

ప్రతి మనిషిలోనూ జ్ఞాపకాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఒక మనిషి లేకున్నా ఆ మనిషి జ్ఞాపకాలు మాత్రం మనం ఉన్నంతవరకు ఉంటాయి. అంతే కాకుండా మనం స్కూలుకెళ్లిన మొదటి రోజు గాని, లేదా కాలేజికెళ్లిన మొదటి రోజు వంటివి జీవితాంతం మనకు గుర్తుండిపోతాయి. ఇవన్నీ మనసులోతుల్లో నిలిచిపోయి ఉంటాయి.

ఫస్ట్ టైమ్ కార్ డ్రైవ్ చేయడానికి సిద్దమైన కుమార్తె; క్రాష్ టెస్ట్ డ్రెస్ వేసుకుని కారెక్కిన తండ్రి

అమ్మాయిల విషయానికి వస్తే, ప్రతి అమ్మాయి జీవితంలో దాదాపు ఆమె తండ్రే మొదటి హీరో, కావున ప్రతి అమ్మాయికి ఎక్కువగా వారి తండ్రితో చాలా అనుబంధం ఉంటుంది. ఇటీవల ఒక వీడియో బయటపడింది. ఈ వీడియోలో ఒక అమ్మాయి తాను మొదట సారి కార్ డ్రైవ్ చేయడానికి తన తండ్రి కోసం వేచి ఉంటుంది. ఈ సమయంలో ఆ అమ్మాయి తండ్రి చేసిన పని నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.

ఫస్ట్ టైమ్ కార్ డ్రైవ్ చేయడానికి సిద్దమైన కుమార్తె; క్రాష్ టెస్ట్ డ్రెస్ వేసుకుని కారెక్కిన తండ్రి

ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే, ఒక అమ్మాయి మొదటిసారి కారు నడుపుతున్నప్పుడు, ఆమె తండ్రి తనకు క్రాష్ టెస్ట్ లో ఉపయోగించుకునే డమ్మీ బొమ్మ మాదిరిగా ఉండే దుస్తులు వేసుకుని కనిపిస్తాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ గా మారింది.

MOST READ:దిశా పటాని & టైగర్ ష్రాఫ్‌పై ఎఫ్‌ఐఆర్‌ బుక్ చేసిన ముంబై పోలీసులు.. కారణం ఇదే

ఫస్ట్ టైమ్ కార్ డ్రైవ్ చేయడానికి సిద్దమైన కుమార్తె; క్రాష్ టెస్ట్ డ్రెస్ వేసుకుని కారెక్కిన తండ్రి

ఆ అమ్మాయి డ్రైవర్ సీట్లో ఉంటే, ఆమె తండ్రి ప్యాసింజర్ సీట్లో ఆ డమ్మీ డ్రెస్ వేసుకుని కూర్చున్నాడు. ఇలాంటి డ్రెస్ క్రాష్ టెస్ట్ లో ఉపయోగించే మాదిరిగా ఉంటుంది. వీటి ద్వారానే క్రాష్ టెస్ట్ లో కారు ఎంత సురక్షితమైనదో తెలుస్తుంది. అంతే కాకుండా ఈ టెస్టులో కార్లు దెబ్బతింటాయి, దీన్ని బట్టి వాటి భద్రతా ప్రమాణాలను నిర్దారిస్తారు.

ఫస్ట్ టైమ్ కార్ డ్రైవ్ చేయడానికి సిద్దమైన కుమార్తె; క్రాష్ టెస్ట్ డ్రెస్ వేసుకుని కారెక్కిన తండ్రి

ఈ క్రాష్ టెస్ట్ లో ఉపయోగించిన డమ్మీ మాదిరిగానే అమ్మాయి తండ్రి దుస్తులు ధరించాడు. ఈ వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో ఫన్నీ అని కొంతమంది వ్యాఖ్యానించారు. మరికొందరు ఈ వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆమె తండ్రి ఈ విధంగా ప్రవర్తించినందుకు తన కుమార్తెకు క్షమాపణ చెప్పాలని తండ్రిని కోరారు.

MOST READ:శభాష్ పోలీస్; లాక్‌డౌన్‌లో బయటకు వచ్చిన రాజకీయ నాయకుడికి రూ. 11,000 జరిమానా

ఆ అమ్మాయి చేసిన ఈ చర్య ఆమెలో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తుందని కొందరు వ్యాఖ్యానించారు. ప్రతి తండ్రి తమ పిల్లల్లో విశ్వాసాన్ని పెంచేలా ప్రవర్తించాలని చెప్పారు. ఈ వీడియో చూసిన వారిలో చాలామంది దీన్ని కామెడీగా చూసారు. మరికొందరు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశారు.

ఫస్ట్ టైమ్ కార్ డ్రైవ్ చేయడానికి సిద్దమైన కుమార్తె; క్రాష్ టెస్ట్ డ్రెస్ వేసుకుని కారెక్కిన తండ్రి

గ్లోబల్ ఎన్‌సిఎపి నుండి సేఫ్టీ రేటింగ్ పొందడానికి కార్లకు క్రాష్ పరీక్షలు చాలా ప్రధానమైనవి. భారతదేశంలో టాటా నెక్సాన్, టాటా ఆల్ట్రోజ్ మరియు మహీంద్రా ఎక్స్‌యువి 300 వంటి కార్లు గ్లోబల్ ఎన్‌సిఎపి నుండి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ కైవసం చేసుకున్నాయి. ఇవన్నీ చాలా సురక్షితమైనవని గ్లోబల్ ఎన్‌సిఎపి అధికారికంగా ప్రకటించింది.

MOST READ:అందమైన మహిళ చీరకట్టుతో వోల్వో బస్ డ్రైవ్ చేస్తే..? సూపర్ కదూ.. వీడియో చూడండి

Most Read Articles

English summary
Father Dresses Like Crash Test Dummy For Daughter's First Time Car Drive. Read in Telugu.
Story first published: Thursday, June 3, 2021, 17:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X