Viral Video తన కూతురిని టచ్ చేశాడని విమానంలో యువకుడితో తండ్రి గొడవ.. నెటిజన్ల కామెంట్స్ వైరల్..
ఇటీవల విమాన ప్రయాణంలో ప్రయాణికులు విభిన్న రకాల అనుభవాలను ఎదుర్కొంటున్నారు. బస్సు, ట్రైన్ జర్నీలతో పోలిస్తే విమాన ప్రయాణం చాలా డీసెంట్‌గా, హుందాగా ఉంటుంది. కానీ ఇటీవల విమాన ప్రయాణాల్లో సైతం పలు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అసభ్యకర చేష్టలు, గొడవలు ఇతర ప్రయాణికులకు వెగటు పుట్టిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
విమాన ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణికులు నియమనిబంధనలకు కట్టుబడాల్సి ఉంటుంది. వాటికి విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విమానంలో ప్రయాణించే వారికి సిబ్బంది భద్రత పర్యవేక్షణ, స్క్రీనింగ్ చేస్తుంటారు. కానీ ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రయాణికులకు భద్రత కల్పించడంలో విమానయాన సంస్థలు విఫలమవడంపై ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో సైతం చర్చ జరిగింది. దక్షిణ కొరియాకు చెందిన ఏషియానా ఎయిర్‌లైన్స్ విమానం సమయానికి ల్యాండ్ కావడం లేదని చెప్పడంతో.. ఓ ప్రయాణికుడు మధ్యలోనే విమానం తలుపులు తెరిచాడు. దీంతో పలువురు శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రి పాలయ్యారు.
ఇటీవల ఎయిరిండియా విమానంలో వరుసగా చోటుచేసుకున్న ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. గతేడాది ఓ ప్రయాణికుడు వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసి, వార్తల్లోకెక్కగా, ఇటీవల అదే సంస్థకు చెందిన విమానంలో మరో ప్రయాణికుడు ఫ్లోర్‌పై మల, మూత్ర విసర్జన చేసి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించాడు. ఈ ఘటనలకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తాజాగా మళ్లీ రెండు విమానయాన సంస్థల్లో వింత ఘటనలు చోటు చేసుకున్నాయి. భారత్‌కు చెందిన విస్తారా, ఇంటర్నేషనల్ సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానాల్లో జరిగిన గొడవ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విస్తారా ఫ్లైట్‌లో తన కూతురిని ఓ యువకుడు తాకాడని మండిపడుతూ ఆ అమ్మాయి తండ్రి అతడిని కొట్టడానికి ప్రయత్నించిన వీడియో వైరల్ అవుతోంది.
తల్లిదండ్రులిద్దరూ విమానంలో కుడివైపు కూర్చోగా, కూతురు ఎడమవైపు సీటులో కూర్చున్నారు. ఆమె పక్కనే మరో యువకుడు కూర్చున్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. కానీ అక్కడ ఏం జరిగిందనేది తెలీదు. వీడియోలో గొడవను బట్టి చూస్తే.. ఆ యువకుడు యువతిని తాకినట్లు తండ్రి ఆరోపిస్తున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు.
ఆ యువకుడు యువతిని తాకకూడని చోట తాకాడని, లేకుంటే ఆమె తండ్రికి అంత కోపం ఎందుకు వస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒక్కోసారి అనుకోకుండా చేయి తగిలే అవకాశమూ ఉండవచ్చని పలువురు స్పందించారు. అయితే వాస్తవాలు తెలుసుకుని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇలాంటి ఘటనలు భారత్‌లోనే కాకుండా విదేశీ విమానాల్లో కూడా సర్వసాధారణం. రెండో సంఘటన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో జరిగింది. అక్కడ ఒక వ్యక్తి చిన్న బాబుపై సహనం కోల్పోయిన ఆగ్రహానికి గురైన ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విమానంలో ఏడుస్తున్న చిన్నారిని చూసి కోపంతో ఉన్న వ్యక్తి.. సహనం కోల్పోయి దీంతో విమాన సిబ్బందితో గొడవ పెట్టుకున్నాడు. అతడి ప్రవర్తనతో ఇతర ప్రయాణికులు విస్తుపోయారు. ఈ సంఘటనలు ప్రయాణీకుల ప్రవర్తన మరియు విమానాల్లో భద్రతా చర్యల ఆవశ్యకత గురించి ఆందోళనలను లేవనెత్తుతున్నాయి.


Click it and Unblock the Notifications








