18 ఏళ్ల కొడుక్కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన తండ్రి.. షాకవుతున్న నెటిజన్లు (వీడియో)
పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు పిల్లలకు గిఫ్ట్స్ ఇవ్వడం కొత్తేమీ కాదు. గిఫ్ట్స్ అనేవి తల్లిదండ్రుల స్థోమత మీద ఆధారపడి ఉంటుంది. కొందరు వారి పిల్లలకు బైక్ గిఫ్ట్ ఇస్తే.. మరికొందరు కార్లను గిఫ్ట్‌గా ఇస్తారు. ఇటీవల ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఇటీవల వెలుగులోకి వచ్చిన సంఘటనలో ఒక తండ్రి.. తన కొడుకు 18వ పుట్టిన రోజు సందర్భంగా ఖరీదైన 'లంబోర్ఘిని హురాకాన్ ఎస్టీఓ' (Lamborghini Huracan STO) కారును గిఫ్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇప్పటికే ఎంతోమంది వీక్షకుల మనసు దోచింది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి వ్యాపారవేత్త అయిన వివేక్ కుమార్ రుంగ్తా తన కొడుకు తరుష్ రుంగ్తాకు.. లంబోర్ఘిని హురాకాన్ ఎస్టీఓ కారును బర్త్డే గిఫ్ట్‌గా ఇచ్చారు తరుష్ రుంగ్తాకు లంబోర్ఘిని కారు అంటే చాలా ఇష్టమని, ఈ కారణంగానే ఆ తండ్రి తన కొడుకుని ఆ కారునే పుట్టిన రోజు కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను తరుష్ రుంగ్తాకు తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశాడు.
ఈ వీడియోలో గమనించినట్లయితే.. తరుష్ మరియు అతని తండ్రి యూఏఈలోని లంబోర్ఘిని డీలర్‌షిప్‌లోకి వెళ్లడం చూడవచ్చు. ఆ ఇద్దరితో పాటు వారి కుటుంబ సభ్యులు మరియు డీలర్‌షిప్ సిబ్బంది కూడా ఉన్నారు. ఇప్పటికే ఆ కారు కొనుగోలు చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. వారు డీలర్‌షిప్‌లోని కేక్ కట్ చేయడంతో వీడియో పూర్తవుతుంది.

వీడియోను తరుష్ రుంగ్తా షేర్ చేస్తూ.. నా 18వ పుట్టిన రోజుకు నాకు ఇష్టమైన కారును గిఫ్ట్‌గా నా తండ్రి వివేక్ కుమార్ రుంగ్తా ఇచ్చారు. మీ ప్రేమ మరియు సపోర్ట్ నాకు ప్రతి దానిని సూచిస్తుందని పేరొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కొత్త కారు కొనుగోలు చేసిన తరువాత తరుష్ రుంగ్తాకు పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇది ఎంతోమంది వీక్షకులను చాలా ఆకర్శించింది.
లంబోర్ఘిని హురాకన్ ఎస్టీఓ (Lamborghini Huracan STO)
ప్రపంచ మార్కెట్లో లాంబోర్గిని కార్లకు మంచి డిమాండ్ ఉంది. గతంతో పోలిస్తే.. భారతదేశంలో కూడా ఈ బ్రాండ్ కార్లను కొనుగోలు చేస్తున్నవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. 2021లో దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన ఈ కారు సాధారణ హురాకాన్ కంటే భిన్నంగా ఉంటుంది. ఈ హురాకన్ ఎస్టీఓ కారు ట్రోఫియో ఈవో రేస్ కారు మీద ఆధారపోయేది ఉంటుంది. ఇది బ్రాండ్ యొక్క అత్యంత ఖరీదైన మరియు వేగవతమైన కారు.
భారతదేశంలో లంబోర్ఘిని హురాకాన్ ఎస్టీఓ కారు ధర రూ. 4.99 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ సూపర్ కారు 5.2 లీటర్ వీ10 ఇంజిన్ కలిగి 640 పీఎస్ పవర్ మరియు 565 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు పనితీరు పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికే ఈ కారుని భూపేష్ రెడ్డి కొనుగోలు చేశారు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








