హైబ్రిడ్ సూపర్‌యాచ్‌ను ఎప్పుడైనా చూశారా?
మీరు ఇప్పటి వరకూ రెగ్యులర్ ఇంజన్ (పెట్రోల్ లేదా డీజిల్) మరియు ఎలక్ట్రిక్ మోటార్ (బ్యాటరీ)తో నడిచే హైబ్రిడ్ కార్లు, హైబ్రిడ్ ద్విచక్ర వాహనాలను చూసుంటారు. కానీ, మీరు ఎప్పుడైనా హైబ్రిడ్ బోట్‌ను చూశారా..? ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్నది అలాంటిదే.
ఫియడ్‌షిప్ అనే డచ్ బోట్ తయారీ కంపెనీ తాజాగా ఓ సరికొత్త హైబ్రిడ్ సూపర్‌యాచ్‌ను తయారు చేసింది. దీని పేరు సవన్నాహ్. ఇది ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి ఫుల్లీ ఆపరేషనల్ హైబ్రిడ్ లగ్జరీ బోట్.
సవన్నాహ్ లగ్జరీ యాచ్‌ను తయారు చేయటానికి 1000 మంది కార్మికులు నాలుగేళ్ల పాటు పనిచేశారు. ఇందులో రెగ్యులర్ కంబస్టియన్ ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తి బోట్ క్రింది భాగం (హల్)లో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను చార్జ్ చేస్తుంది.

ఈ బోటులో మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. వీటి సాయంతో బోట్‌ను పూర్తిగా డీజిల్‌తో లేదా బ్యాటరీ పవర్‌తో కానీ నడపొచ్చు. లేదంటే, రెండు పవర్ సోర్స్‌ల (డీజిల్ ప్లస్ బ్యాటరీ పవర్)ను ఉపయోగించి హైబ్రిడ్ మోడ్‌లో నడపొచ్చు.
ఈ సెగ్మెంట్లోని ఇతర బోట్‌లతో పోల్చుకుంటే సవన్నాహ్ యాచ్ 30 శాతం అధిక మైలేజీనిస్తుందని కంపెనీ చెబుతోంది.
ఈ బోట్‌లోని మరికొన్ని విశిష్టతలు
- అండర్‌వాటర్ రివ్యూయింగ్ లాంజ్
- ఓపెన్-ఆఫ్ట్ డిజైన్
- 29 అడుగులు డెక్ లెవల్ పూల్
- గ్యారాజ్
- 4 గెస్ట్ రూమ్స్
- విఐపి సూట్ విత్ బాల్కనీ
- సినిమా థియేటర్
- స్పెషల్ డిజైన్డ్ ఆఫ్ట్
- పెద్ద ప్రొపెల్లర్స్
- స్లిమ్ హల్


Click it and Unblock the Notifications








