ఫెమినా మిస్ ఇండియా 2011 విజేతలకు స్కొడా ఫ్యాబియా కార్లు

పాంటలూన్స్ ఫెమినా మిస్ ఇండియా 2011కు అధికారిక కార్ పార్టనర్‌గా వ్యవహరిస్తున్న స్కొడా (ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్) ఈ పోటీలో నెగ్గిన విజేతలకు ప్రిమీయం హ్యాచ్‌బ్యాక్ వేరియంట్ ఫ్యాబియా కారును గిఫ్ట్‌గా ఇవ్వనుంది.
ఈ షోలో కనిష్టా ధనకర్ పాంటలూన్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2011 కిరీటాన్ని దక్కించుకోగా.. అంకితా షోరే మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2011 కిరీటాన్ని, అలాగే హస్లీన్ కౌర్ మిస్ ఇండియా ఎర్త్ 2011 కిరీటాలను సొంతం చేసుకున్నారు.
ఇక స్కొడా ఫ్యాబియా విషయానికి వస్తే.. భారత మార్కెట్లో ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. 1.2 లీటర్ డీజిల్, 1.2 లీటర్ పెట్రోల్ ఆపషన్లతో క్లాసిక్, ఆంబీన్టే, ఎలిగాన్స్ వేరియంట్లలో ఇది లభిస్తుంది. ఫ్యాబియా కారు సేఫ్టీకి పెట్టింది పేరు.


Click it and Unblock the Notifications








