వేలంలో రూ.231 కోట్లు పలికిన అరుదైన ఫెరారీ 250 జిటిఓ
వింటేజ్ (పురాతన కాలపు) కార్లంటే కొందరికీ భలే ఇష్టం, అందులోను ఫెరారీ వంటి అత్యంత అరుదైన పురాతన కార్లంటే ఇక వారి అభిమానానికి అవధులు ఉండవు. ఎంత ఖర్చయినా సరే అలాంటి ఓ అరుదైన క్లాసిక్ కారును సొంతం చేసుకోవాలని భావిస్తారు.
ఇటాలియన్ కార్ కంపెనీ ఫెరారీ 1962 నుంచి 1964 మధ్య కాలంలో తయారు చేసిన అత్యంత అరుదైన ఫెరారీ 250 జిటిఓ కారు తాజాగా వేలానికి వచ్చింది. మూడేళ్లు మాత్రమే ఉత్పత్తిలో ఉన్న ఈ కారును కేవలం 39 యూనిట్లు మాత్రమే తయారు చేశారు.
ఫెరారీ ఈ కారును ప్రత్యేకించి మోటార్ రేస్‌ల కోసం తయారు చేసేది. అందుకే దీని ఉత్పత్తి చాలా పరిమితంగా ఉండేది. ఇటీవల జరిగిన ఓ వేలంలో ఈ పురాతన ఫెరారీ 250 జిటిఓ రేస్ కార్ ఏకంగా 231 కోట్ల రూపాయల వెల పలికింది.
మరి ఈ పురాతన 1963 ఫెరారీ 250 జిటిఓ రేస్ కార్ ఇంత అధిక వెల పలకడానికి కారణం, అలాగే ఇందులో ఉన్న అంతటి గొప్ప విశిష్టతలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

తర్వాతి స్లైడ్‌లలో ఫెరారీ 250 జిటిఓ స్పోర్ట్స్ కారుకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోండి.

ఈ 1963 ఫెరారీ 250 జిటిఓ రేస్ కారు 1962-1964 మధ్య కాలంలో ఉత్పత్తిన కేవలం 39 కార్లలో ఒకటి. రేసింగ్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అప్పట్లో ఈ కార్లను తయారు చేశారు.

గతంలో ఇంత అధిక ధర పలికి రికార్డు సృష్టించిన కారు కూడా ఫెరారీ 250 జిటిఓ రేస్ కారే. ఆ కారును అప్పట్లో స్టెర్లింగ్ మోస్ నడిపారు. వేలంలో ఆ కారు ధర 35 మిలియన్ డాలర్లు పలికింది.

ఈ ఫెరారీ 250 జిటిఓ కార్లను గియోట్టో బిజారినీ నేతృత్వంలోని బృందం సృష్టించింది. ఈ రేసింగ్ కార్లను రోడ్ వెర్షన్ 250 జిటి ఎస్‌డబ్ల్యూబి మోడల్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేశారు.

ఫెరారీ 250 జిటిఓ రేస్ కారులో 300 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసే వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇదే ఇంజన్‌ను 250 టెస్టా రోస్సాస్ కారులో కూడా ఉపయోగించారు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి ఉండే ఈ కారు గరిష్టంగా గంటకు 280 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది.

ఫెరారీ 250 జిటిఓ కార్లకు అభిమానులు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించడాన్ని చూసిన నిపుణులు, వీటిని మోనాలీసా కార్లని పిలుస్తున్నారు.

వాస్తవానికి 1950-60 కాలానికి చెందిన అరుదైన, క్లాసిక్ ఫెరారీ కార్ల వెల ఏడాదికేడాది సగటున 15 శాతానికి పైగా పెరుగుతోంది.

ఇలాంటి ఓ క్లాసిక్ ఫెరారీ కారుకు ఎంత మొత్తంలో అయినా చెల్లింపు చేయగల సామర్థ్యం కలిగిన ధనికులు ఉన్నారని, అయితే ఇలాంటి లావాదేవీలన్నీ ప్రైవేట్‌గా జరిపోతుంటాయి కాబట్టి, ఇందులో చాలా వరకు వెలుగులోకి రావని నిపుణులు అంటున్నారు.


Click it and Unblock the Notifications








