సంగీతాన్ని వినిపిస్తున్న ఫెరారీ కార్ సైలెన్సర్
కర్ణ కఠోరమైన శబ్ధాలను వినిపించే సూపర్ కార్ల సైలెన్సర్లు, చెవులకు ఇంపైన సంగీతాన్ని వినిపిస్తే ఎలా ఉంటాయ్.. చిత్రంగా ఉంది కదూ..! ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న ఫెరారీ ఫార్ములా వన్ కార్ సైలెన్సర్ చక్కటి సంగీతాన్ని వినిపిస్తుంది. అదెలా అంటే..
ఇటలీలోని మెడెనాకి చెందిన ఐజూట్ వర్క్‌షాప్, ఫార్ములా వన్ కార్ భాగాల నుంచి తయారు చేసిన ఐఫోన్ మరియు ఐపాడ్ డాకింగ్ స్టేషన్లను (స్పీకర్లు) మరియు స్పీకర్ ఆడియో సిస్టమ్‌లను ఆఫర్ చేస్తుంది.

ఇందులో భాగంగానే, 1978 కాస్‌వర్త్ డిఎఫ్‌వి, 2006 రెనో ఆర్ఎస్26 మరియు 2007 ఫెరారీ 056 వంటి ఎఫ్1 కార్లను సేకరించిన విడిభాగాలతో ఈ రకం స్పీకర్లను తయారు చేస్తోంది. 8, 10, 12 సిలిండర్ మోడళ్లలో ఐజూట్ స్పీకర్లను ఆఫర్ చేస్తుంది.
ఈ స్పీకర్ల ధరలు 500 యూరోల నుంచి ప్రారంభమవుతాయి. ఈ స్పీకర్ సిస్టమ్‌లకు బెటర్ కాంప్లిమెంట్‌గా ఐజూట్ కంపెనీ ఓ ప్రత్యేక మ్యూజిక్ ప్లేయింగ్ అప్లికేషన్‌ను కూడా అందిస్తోంది. క్రింది వీడియోలో ఫెరారీ ఫార్ములా వన్ కార్ సెలెన్సర్‌తో తయారు చేసిన ఐఫోన్ డాకింగ్ సిస్టమ్ పనితీరును వీక్షించండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/8wazpgN-Kbw?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








