రోడ్డుపై అదుపు తప్పిన ఫెరారీ ఎఫ్430, ఫ్రంట్ నుజ్జు
సూపర్‌కార్లు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి, కానీ వాటి వెనుక దాగున్న ప్రమాదం మాత్రం మనకు కనిపించదు. సూపర్‌కార్లను నడిపేటప్పుడు ఎంతో మెళకువగా వ్యవహరించాలి. ప్రత్యేకించి సింగిల్ రోడ్స్ లేదా మలుపులు ఎక్కువగా ఉండే రోడ్లపై అప్రమత్తంగా డ్రైవ్ చేయాలి. లేదంటే వాహనంపై కంట్రోల్ తప్పి, ఇదిగో ఈ వీడియోలో చూపినట్లుగా ప్రమాదం జరగవచ్చు.
ఈ వీడియోలో ఓ ఫెరారీ ఎఫ్430 డ్రైవర్ మలుపులు ఎక్కువగా ఉండే రోడ్డుపై వేగంగా డ్రైవ్ చేస్తూ, అదుపు తప్పి రోడ్డు పక్కనే రెయిలింగ్‌ను ఢీకొట్టాడు. దీంతో కారు ముందు భాగం ముక్కలైంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు కానీ, రోడ్డుపై ఇతరులకు కానీ ఎలాంటి హాని జరగలేదు. మితిమీరిన వేగం, డ్రైవింగ్ పట్ల అవగాహన లేకపోవటమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
ఫెరారీ ఎఫ్430 స్పోర్ట్స్ కారులో 4.3 లీటర్, వి8 మిడ్-ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ నుంచి వచ్చే శక్తి వెనుక చక్రాలకు బదిలీ అవుతుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఎఫ్1 ఎలక్ట్రోహైడ్రాలిక్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. దీనిని అల్కోవా అల్యూమినియం చాస్సిస్‌పై తయారు చేశారు, అప్పట్లో ఇది అత్యంత ధృఢమైన చాసిస్.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/a52Zt5_9rrY?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








