మైఖేల్ షుమాకర్ త్వరగా కోలుకోవాలని అభిమానుల ప్రార్థన
నేడు (జనవరి 3, 2014) ఫార్ములా వన్ దిగ్గజం మైఖేల్ షుమాకర్ జన్మదినోత్సవం. నేటితో షుమాకర్ 45వ వసంతంలోకి ప్రవేశించాడు. ప్రస్తుతం మైఖేల్ షుమాకర్ గడచిన ఆదివారం జరిగిన స్కీయింగ్ యాక్సిడెంట్‌లో తలకు బలమైన గాయం కావటంతో ఆస్పత్రిలో కోమాలో ఉన్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, ఆయన త్వరగా కోలుకోవాలని ఫెరారీ అభిమానులు నిశ్శబ్ధ ప్రార్థనలు చేశారు.
మెర్సిడెస్ బెంజ్ టీమ్‌తో మూడేళ్ల అనుబంధం తర్వాత షుమాకర్ తన కెరీర్‌కు గుడ్‌బై చెప్పినప్పటికీ, ఫెరారీతో ఆయనకున్న బంధం మాత్రం మర్చిపోలేనిది. జర్మనీకి చెందిన మైఖేల్ షుమాకర్, ఇటలీకి చెందిన ఫెరారీ జట్టుతో చాలా కాలం పనిచేశారు. స్కుడెరియా ఫెరారీ కోసం ఆయన 1996 నుంచి 2006 వరకు రేస్ చేశారు. ఈ కారుతో ఆయన 72 గ్రాండ్ ప్రిలు గెలిచాడు షుమాకర్.

మైఖేల్ షుమాకర్ ప్యాషన్, కమిట్‌మెంట్, డెడికేషన్ల వలన అతను ఫెరారీ కుటుంబంలో ఎల్లప్పటికీ భాగమయ్యేలా చేశాయని, ఆయతో గడిపిన క్షణాలను మర్చిపోలేనివని ఫెరారీ తమ సైట్‌లో పేర్కొంది. ప్రస్తుతం షుమాకర్ చికిత్స జరుగుతున్న ఫ్రాన్స్‌లోని గ్రెనోబల్ యూనివర్సిటీ హాస్పిటల్ వద్ద 'సైలెంట్ అండ్ రెస్పెక్టఫుల్ ఈవెంట్' పేరిట ఫెరారీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఫెరారీ అభిమానులు షుమాకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు.
వరుసగా ఏడు సార్లు ఫార్ములా వన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న మైఖేల్ షుమాకర్ గడచిన ఆదివారం నాడు ఫ్రెంచ్ ఆల్పాస్‌లో మంచుపై స్కేటింగ్ చేస్తుండగా ప్రమాదవశత్తు క్రింద పోడిపోవటంతో, అతని తలకు బలమైన గాయం తగిలింది. ప్రస్తుతం షుమాకర్ కోమాలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. షుమాకర్ త్వరగా కోలుకోవాలని మనం కూడా ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం.


Click it and Unblock the Notifications








