భారత్‌లో అమ్మకానికి రూ.1.25 కోట్ల విలువ చేసే ఫెరారీ బుక్

Ferrari Book
ఈ పుస్తకం ఖరీదు కేవలం 1.25 కోట్లు మాత్రమే. అంత ఖరీదు ఎందుకు, ఏంటి ఇందులో అంత స్పెషల్ అనుకుంటున్నారా..!? నిజంగానే ఇది స్పెషల్ బుక్. విలాసవంతమైన కార్లను తయారుచేయడంలో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్‌ను ప్రపంచవ్యాప్తంగా ఏర్పరుచుకున్న ఇటాలియన్ ఆటో దిగ్గజం ఫెరారీ, తన చరిత్రను తెలిపే అరుదైన చిత్రాలతో "ఎన్జో డయామంటే" అనే ఈ పుస్తకాన్ని రూపొందించింది.

అంతేకాదండోయే.. వేగానికి చిహ్నమైన గుర్రాన్ని (ఫెరారీ లోగో) 30 క్యారెట్ల డైమండ్లతోనూ, 1,500 విశిష్టమైన రాళ్లతో తయారు చేయబడింది. ఈ లోగో పుస్తకం ముఖభాగంలో ఉంటుంది. ఈ పుస్తకం బరువు 37 కిలోలు. ఫెరారీ ఇండియా మరియు ఓపస్ మీడియా గ్రూప్‌లు భారతదేశంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాయి. దేశంలోనే అత్యంత ఖరీదనై పుస్తకాలలో ఇది కూడా ఒకటి.

ఈ పుస్తకం వెల 2,50,000 అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.1.25 కోట్లకు పైగా)గా నిర్ణయించామని కంపెనీ పేర్కొంది. ఇలాంటి పుస్తకాలు ఒక్కో దేశంలో ఒకటి చొప్పును మాత్రమే ఫెరారీ విక్రయిస్తోంది. ఈ ఫెరారీ పుస్తకాన్ని చేతితో తయారు చేసిన ఓ నల్లటి కార్బన్ ఫైబర్ కేస్‌లో అందజేస్తారు. ఇందులో మూడు సంతకాల షీట్లు ఉంటాయి, వీటిపై ప్రస్తుత ఫెరారీ డ్రైవర్ల సంతకంతో పాటుగా, మాజీ ప్రపంచ ఛాంపియన్ల సంతకాలు కూడా ఉంటాయి.

మొత్తం 852 పేజీలున్న ఈ పుస్తకంలో రెండు లక్షల పదాలతో గతంలో ఎప్పుడూ ప్రచురితం కాని 2,000 ఫొటోలను పొందుపరిచారు. ఇప్పటికే ఈ పుస్తకాన్ని సొంతం చేసుకునేందుకు గాను ముగ్గురు భారతీయులు పోటీపడుతున్నారని, మరికొద్ది గంటల్లోనే ఈ పుస్తకాన్ని ఎవరికి విక్రయించే విషయాన్ని వెల్లడిస్తామని ఓపస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్ల్ ఫోలర్ తెలిపారు.

More from DriveSpark

Article Published On: Friday, December 2, 2011, 11:29 [IST]
English summary
Italian luxury carmaker Ferrari has unveiled its latest edition book 'Enzo Diamante' in India. This is one of the most expensive books in India, which worth a $ 2,50,000 (over Rs 1.25 crore). This book weighs 37 kg, has a 30-carat diamond studded Ferrari horse (Logo) with about 1,500 selected stones.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+