ఫెరారీ కారులో షారుక్ ఖాన్.. భారత్‌లో ఇది చాలా స్పెషల్ - ఎందుకంటే?
ఇటీవల అంబానీ ఇంట జరిగిన ప్రీ-వెడ్డింగ్ కార్యక్రమానికి ప్రపంచ నలుమూలల నుంచి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. మూడు రోజులు అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో పాల్గొన్న షారుక్ ఖాన్ ఖరీదైన కారులో కనిపించారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ప్రపంచ ధనవంతులలో ఒకరు, భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ చిన్న కొడుకు 'అనంత్ అంబానీ, రాధిక మర్చంట్'ల ప్రీ వెడ్డింగ్ కార్యక్రమానికి బిల్ గేట్స్ నుంచి రామ్ చరణ్ వరకు చాలామంది ప్రముఖులు హాజరయ్యాయి. అంబానీ ఆహ్వానంతో సెలబ్రిటీలు చాలా వరకు ఖరీదైన కార్లలో జామ్‌నగర్‌కు వెళ్లారు. అయితే షారుక్ ఖాన్ ఫెరారీ కంపెనీకి చెందిన 'పురోసాంగ్యూ' కారులో కనిపించారు.

నిజానికి షారుక్ ఖాన్ కనిపించిన ఇటాలియన్ సూపర్ కారు ఫెరారీ పురోసాంగ్యూ ఎస్‌యూవీ అంబానీకి చెందినదని సమాచారం, కానీ ఇది ఎంతవరకు నిజమన్నది స్పష్టంగా తెలియదు. ఎందుకంటే ఈ కారును రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా లేదు. కానీ చాలామంది ఇది అంబానీకి చెందిన కారు అని భావిస్తున్నారు. ఇది విమానాశ్రయంలో కనిపించింది. ఆ సమయంలో ఒక డ్రైవర్ మరియు షారుక్ ఆ కారులో ఉండటం చూడవచ్చు.
ఫెరారీ పురోసాంగ్యూ (Ferrari Purosangue)
ఫెరారీ కంపెనీకి చెందిన పురోసాంగ్యూ విషయానికి వస్తే.. ఇది భారతదేశంలో విడుదలైన కంపెనీ యొక్క లేటెస్ట్ కారు అని తెలుస్తోంది. ఇది ప్రత్యేకించి కుటుంబ అవసరాల కోసం రూపొందించినట్లు సమాచారం. నాలుగు డోర్స్ కలిగిన ఈ కారు వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో 373 లీటర్ బూట్ స్పేస్ కూడా లభిస్తుంది. ఇక్కడ కనిపించే కారు రోసో ఫోర్టోఫినో (రెడ్) షేడ్‌లో చూడచక్కగా ఉంది.

ఫెరారీ పురోసాంగ్యూ అనేది బ్రాండ్ యొక్క ఎస్‌యూవీ. ఇది మార్కెట్లో లంబోర్ఘిని, ఆస్టన్ మార్టిన్ డీబీఎక్స్ వంటి కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో ప్రత్యేకంగా అమర్చిన డోర్స్ చూడవచ్చు. ఇందులో లెదర్ సీట్లు, ఎలక్ట్రోక్రోమిక్ గ్లాస్ రూఫ్, ఎయిర్ వెంట్స్ మరెన్నో ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.
ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 6.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 725 పీఎస్ పవర్ మరియు 716 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పర్ఫామెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ కారు ధర రూ. 10.5 కోట్లు (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. ధర పరంగా ఇది దాని ప్రత్యర్థుల కంటే ఖరీదైనదిగా తెలుస్తోంది.
ఫెరారీ పురోసాంగ్యూ కారు ఓనర్ ఎవరనే విషయం మీద స్పష్టత లేదు, కానీ ఇటీవల బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బూపేష్ రెడ్డి బ్లాక్ కలర్ పురోసాంగ్యూ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో వంటివి నెట్టింట్లో వైరల్ అయ్యాయి. బహుశా ఇదే భారతదేశంలో మొదటి ఫెరారీ పురోసాంగ్యూ అని, బూపేష్ రెడ్డి మొదటి ఓనర్ అని తెలుస్తోంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








