స్పెయిన్‌లో వెలసిన ఫెరారీ థీమ్ పార్క్

ఫెరారీ అభిమానుల కోసం స్పెయిన్‌లో ఓ కొత్త థీమ్ పార్క్ హోటల్ వెలియనుంది. విదేశీ యాత్రికులకు పూర్తిస్థాయిని ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చేలా ఈ ఫెరారీ థీమ్ పార్క్‌ను డిజైన్ చేస్తున్నారు. ఇటాలియన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫెరారీ స్పెయిన్ దేశంలో ఈ ఫెరారీ థీమ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తోంది.

ఇప్పటికే ఇటలీ, దుబాయ్ దేశాల్లో ఫెరారీ థీమ్ పార్క్‌లు ఉన్నాయి. ఈ రెండు దేశాలకు వెళ్లలేని వారు స్పెయిన్ వెళ్లి ఈ ఫెరారీ థీమ్ పార్క్ అందాలను ఆస్వాదించవచ్చు. ఇటలీలోని ఫెరారీ మ్యూజియం మరియు దుబాయ్‌లోని తొలి ఫెరారీ థీమ్ పార్క్‌లు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీని దక్కించుకున్నాయి.

మరి స్పెయిన్‌లో కొత్తగా ఏర్పాటవుతున్న ఈ ఫెరారీ థీమ్ పార్క్‌లోని విశేషాలను ఈ కథనంలో చూద్దాం రండి!

స్పెయిన్‌లో ఫెరారీ థీమ్ పార్క్ ఏర్పాటు!

ఫెరారీ థీమ్ పార్క్‌లో బిల్డింగ్ డిజైన్ నుంచి అందులోని రైడ్స్ వరకూ అన్ని కూడా అణువణువునా ఫెరారీ థీమ్‌ను తలపిస్తాయి.

స్పెయిన్‌లో ఫెరారీ థీమ్ పార్క్ ఏర్పాటు!

చిన్న పిల్లలే కాకుండా పెద్దవాళ్లు సైతం తమ వయస్సును మర్చిపోయి ఆహ్లాదంగా ఎంజాయ్ చేయటానికి ఫెరారీ థీమ్ పార్క్ ఓ చక్కటి ప్రదేశం.

స్పెయిన్‌లో ఫెరారీ థీమ్ పార్క్ ఏర్పాటు!

మొత్తం పద్దెనిమిదిన్నర ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఫెరారీ థీమ్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. బార్సెలోనా నగర శివార్లలో ఈ ఫెరీరీ థీమ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

స్పెయిన్‌లో ఫెరారీ థీమ్ పార్క్ ఏర్పాటు!

పోర్ట్ అవెన్యూ రిసోర్ట్ ఆధ్వర్యంలో దీనిని నిర్మించనున్నారు. గతంలో డ్యుకాటి ఓనర్ అయిన పోర్ట్ అవెన్యూ, 2012లో మూడొంతుల ఆస్టన్ మార్టిన్ వాటాలను కొనుగోలు చేసింది.

స్పెయిన్‌లో ఫెరారీ థీమ్ పార్క్ ఏర్పాటు!

స్పెయిన్‌లో ఫెరారీ థీమ్ పార్క్ కోసం 100 మిలియన్ యూరోల పెట్టుబడిని వెచ్చించనున్నారు.

స్పెయిన్‌లో ఫెరారీ థీమ్ పార్క్ ఏర్పాటు!

ఫెరారీ థీమ్ పార్క్‌లో ఫెరారీ థీమ్‌తో కూడిన ఓ ఫైవ్ స్టార్ హోటల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం రేస్ సిమ్యులేటర్లతో కూడిన 250 గదులు ఉంటాయి.

స్పెయిన్‌లో ఫెరారీ థీమ్ పార్క్ 2016 నాటికి ప్రారంభం కావచ్చని అంచనా. ఈలోపుగా ఈ వీడియోని వీక్షిద్దాం రండి.

More from DriveSpark

Article Published On: Saturday, March 15, 2014, 12:52 [IST]
English summary
If you're planning a vacation out of India and if you're a Ferrari fan there is some good news. Put your plan on hold for a while and wait for some time as the Italian supercar maker is going to open its doors to a new theme park in Spain.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+