షెఫ్ఫర్ నుంచి ఫెరారీ పెన్ కలెక్షన్.. ఇప్పుడు ఇండియాలో
మరికొద్ది రోజుల్లో థర్డ్ ఎడిషన్ ఇండియన్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేస్ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఫెరారీ అఫీషియల్ లైసెన్స్డ్ ప్రోడక్ట్స్ మేకర్ షెఫ్ఫర్ భారత్‌లో తమ స్కుడెరియా ఫెరారీ కలెక్షన్‌లో భాగంగా, రైటింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పెన్స్)ను భారత్‌లో విడుదల చేసింది.
షెఫ్ఫర్ రైటింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ కలెక్షన్‌లో ఫెరారీ విఎఫ్ఎమ్, ఫెరారీ 100, ఫెరారీ 300, ఫెరారీ 500 పెన్నులు ఉన్నాయి. ఇందులో ఫౌంటైన్ పెన్నులతో పాటుగా, రోల్ బాల్ మరియు బాల్ పాయింట్ పెన్నులు కూడా ఉన్నాయి. షెఫ్ఫర్ ఫౌంటైన్ పెన్నులు స్టెయిన్‌లెస్ స్టీల్ షెఫ్ఫర్ నిబ్‌తో లభిస్తాయి.
ప్రతి కలెక్షన్ కూడా అధిక స్థాయి నాణ్యతను కలిగి ఉండి, అణవనువునా ఫెరారీ డిఎన్ఏను ప్రతిభింభింపజేస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ పెన్నులన్నీ ఫెరారీ ఫేవరేట్ కలర్ అయిన రెడ్ కలర్‌లో లభిస్తాయి. ఫెరారీ ఫౌంటైన్ పెన్ (ఫెరారీ 300 9503) ధర రూ.5,000 నుంచి ప్రారంభమవుతుంది. మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

షెఫ్ఫర్ ప్రోడక్ట్
ఫెరారీ అఫీషియల్ లైసెన్స్డ్ ప్రోడక్ట్స్ మేకర్ అయిన షెఫ్ఫర్ ఈ రైటింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పెన్స్)ను భారత్‌లో విడుదల చేసింది.

అన్ని మోడల్స్
షెఫ్ఫర్ రైటింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ కలెక్షన్‌లో ఫెరారీ విఎఫ్ఎమ్, ఫెరారీ 100, ఫెరారీ 300, ఫెరారీ 500 పెన్నులు ఉన్నాయి.

ఫౌంటైన్ పెన్
షెఫ్ఫర్ ఫౌంటైన్ పెన్నులు స్టెయిన్‌లెస్ స్టీల్ షెఫ్ఫర్ నిబ్‌తో లభిస్తాయి.

బాల్ పెన్స్
ఈ కలెక్షన్లో ఫౌంటైన్ పెన్నులతో పాటుగా, రోల్ బాల్ మరియు బాల్ పాయింట్ పెన్నులు కూడా ఉన్నాయి.

ధర
ఫెరారీ ఫౌంటైన్ పెన్ (ఫెరారీ 300 9503) ధర రూ.5,000 నుంచి ప్రారంభమవుతుంది.

ఆన్‌లైన్ నుంచి కొనుగోలు
ఈ ఫెరారీ పెన్ కలెక్షన్ సొంతం చేసుకోవాలనుకునే వారు www.williampenn.net వెబ్‌సైట్‌ను సందర్శించండి.


Click it and Unblock the Notifications








