Green Driving Tips కారు డ్రైవింగ్ చేస్తుంటారా... ఇవాళ్టి నుంచి ఈ చిట్కాలు పాటించండి
ఇవాళ మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా చాలా మంది తమ సోషల్ మీడియా అకౌంట్లలో రకరకాల పోస్టులు పెడుతుంటారు. అందుకు బదులుగా డ్రైవింగ్ అలవాట్లలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో మనవంతు పాత్ర పోషించవచ్చు. ఈ కింది చిట్కాలు పాటించడం ద్వారా ఇందులో భాగస్వామ్యం కావచ్చు.
రోడ్డుపైన ఉన్న సిగ్నల్ వద్ద సహా ఇంకా ఏ సందర్భంలోనైనా కారును నిలపాల్సి వస్తే, ఇంజిన్‌ను ఐడియల్‌గా ఉంచడం మానుకోండి. కారును కాసేపు ఆపాల్సి వస్తే ఇంజిన్‌ను కూడా ఆపండి. ఫలితంగా ఇంధన సామర్థ్యం మెరుగుపడుతుంది. మరియు వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. అందువల్ల ఏదైనా సందర్భంలో కారును నిలపాల్సి వస్తే ఇంజిన్‌ను కూడా ఆపివేయడం అలవాటు చేసుకోండి.

కర్భన ఉద్గారాలను తగ్గించడం సహా ఇంధన సామర్థ్యం మెరుగుపరుచుకొనేందుకు ఉత్తమ విధానాల్లో థొరెటల్ పెడల్‌ను సరిగా వినియోగించడం. ప్రస్తుతం అనేక ఆధునిక కార్లు ECO మోడ్‌ను కలిగి ఉంటున్నాయి.

టైర్లలో ఉన్న గాలి శాతం (టైర్ ప్రెజర్) కూడా ఇంధన సామర్థ్యం మరియు టైర్ల జీవిత కాలంపై అధిక ప్రభావం చూపుతుంది. అందువల్ల క్రమం తప్పకుండా వాహనాల టైర్లలో గాలి శాతాన్ని చెక్ చేయించుకోవాలి. అవసరం అనుకుంటే టైర్లలో వెంటనే గాలిని నింపాలి. ఇలా క్రమం తప్పకుండా చేయించుకోవాలి.

ఇంధన సామర్థ్యంలో గేర్ల వినియోగం కూడా అధిక ప్రభావం చూపుతుంది. ఎక్కువ సార్లు గేర్లు మార్చడం వల్ల ఇంధనం వేగంగా ఖర్చు అవుతుంది, ఫలితంగా వాతావరణ కాలుష్యానికి కారణం అవుతుంది. కారు 2000rpm లో ప్రయాణం చేస్తునప్పుడు గేర్ల మార్పు ఇంధన సామర్థ్యం మరియు కర్భన ఉద్గారాలను తగ్గిస్తుంది.

కార్లలో AC వినియోగం కూడా ఇంధన సామర్థ్యం మరియు కర్భన ఉద్గారాల విడుదలపై అధిక ప్రభావం చూపిస్తుంది. కారు లోపల భాగం ఎక్కువగా చల్లగా ఉండాలని సెట్టింగ్‌లను అందుకు అనుగుణంగా మార్చుతుంటారు. దీంతో ఇంధన సామర్థ్యం తగ్గిపోతుంది మరియు కర్భన ఉద్గారాలు విడుదల కూడా అధికం అవుతుంది. అందువల్ల కారు ACని సరైన సెట్టింగ్‌లో ఉంచడం వల్ల ఇంధన సామర్థ్యం మెరుగవుతుంది మరియు వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది.
పైన చెప్పిన చిట్కాలు పాటించడం వల్ల ఇంధన సామర్థ్యం మెరుగుపరచుకోవడం తద్వారా ఉద్గారాల విడుదలను కూడా గణనీయంగా కట్టడి చేయవచ్చు. మరియు ఇంధనానికి అయ్యే ఖర్చుకు కూడా తగ్గించుకోవచ్చు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇవాళ్టి నుంచైనా ఈ చిట్కాలు పాటించండి. మరియు కాలుష్య నియంత్రలో మీవంతు పాత్ర సమర్థంగా పోషించండి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








