వర్షాకాలంలో కారు డ్రైవింగ్ చేస్తుంటారా.. ఒక్కసారైనా ఇవి తనిఖీ చేశారా?
సాధారణంగా కార్లు నిర్వహణ కొంచెం కష్టం అదే వర్షాకాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో కారు డ్రైవింగ్ కూడా కొంచెం కష్టం. ఎందుకంటే రోడ్లు కొంచెం జారిపోయే ప్రభావాన్ని కలిగి ఉంటాయి మరియు వర్షం కురుస్తున్న సమయంలో విజబిలిటి కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ కాలంలో కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎటువంటి అవస్థలు పడకుండా ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం.
వర్షాకాలంలో సాధారణంగా రోడ్లుపై వర్షపు నీరు చేరడం వల్ల వాహనాల టైర్లకు గ్రిప్ తగ్గుతుంది. ఎక్కడైనా అకస్మాత్తుగా బ్రేక్ వేసినప్పుడు జారిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల కారు టైర్లను ఓసారి చెక్ చేసుకోవడం ఉత్తమం. టైర్లలో గాలి లేదా టైర్ల నాణ్యతను ఓసారి సరిచూసుకోవడం వల్ల రోడ్లపైన అవస్థలు పడకుండా ఉంటాం.

ఎప్పుడు కూడా కారు టైర్ పైనున్న ట్రెడ్ డెప్త్ 2మిమీ కంటే ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి. ఫలితంగా రోడ్లపై గరిష్ఠ ట్రాక్షన్‌ను వాహనాలు పొందుతాయి. అదే డెప్త్ 2 మిమీ కంటే తక్కువగా ఉంటే కొత్త టైర్లను అమర్చుకోవడం చాలా మంచిది.

వర్షాకాలంలో ముఖ్యంగా కారు బ్రేక్‌లను తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో రోడ్లు ఎక్కువగా జారిపోయే స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల అధికంగా బ్రేక్‌లను వినియోగించే అవకాశం ఉంటుంది. బ్రేకులు సరిగా లేకుంటే బ్రేక్ ప్యాడ్, బ్రేక్ రోటార్లను మార్చుకోవాలి. ఫలితంగా బ్రేక్‌ల పనితీరును మెరుగుపడుతుంది.

ఈ వర్షాకాలంలో కారు వైపర్ బ్లేడ్‌లను మార్చుకోవడం చాలా ఉత్తమం. ఫలితంగా వర్షం కురుస్తున్న సమయంలో మంచి విజబిలిటీని అందిస్తాయి. పాత వైపర్ బ్లేడ్‌లు కొన్ని పరిస్థితుల వల్ల మెరుగైన పనితీరు కనబరచలేకపోవచ్చు. అందువల్ల వైపర్ బ్లేడ్ పనితీరును తనిఖీ చేసుకొని, అవసరం ఉంటే వెంటనే కొత్తవి అమర్చుకోండి.

కార్లకు లీక్‌లు లేదా ఏదైనా భాగంలో తుప్పు పట్టి ఉంటే వెంటనే వాటిని మరమ్మతు చేయించుకోండి. ఎందుకంటే లీక్‌లు కారణంగా కారులోని ఎలక్ట్రానికి పరికరాలు సహా ఇతర ఉపకరణాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరియు వర్షాకాలంలో ఎక్కువ తేమ మరియు వర్షపు నీరు వల్ల ఏదైనా ప్రాంతంలో కొంచెం తుప్పు పట్టినా.. క్రమంగా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.

వర్షాకాలంలో కారు బ్యాటరీని తనిఖీ చేయించుకోవాలని చాలా మంది నిపుణులు సలహా ఇస్తుంటారు. వర్షాకాలంలోని చల్లని పరిస్థితుల కారణంగా కారు బ్యాటరీ పనితీరుపై ప్రభావం పడకుండా చూసుకోవాలని చెబుతున్నారు. లీకేజీలు ఇతర సమస్యలుంటే మరమ్మతు చేయించుకోవాలని సూచిస్తున్నారు. బ్యాటరీ బోల్డులు సరిగా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








