పొగ చూసి వాహనం ఇంజిన్ సమస్యలను అంచనా వేయొచ్చు.. తెల్లని పొగ ఎందుకొస్తుందో తెలుసా?
కారు ఇంజిన్ మానవ శరీరంలోని గుండెతో చాలా మంది పోల్చుతారు. అయితే ఇంజిన్‌లో ఒక్కసారి సమస్య తలెత్తితే మరమ్మతులు మరియు నిర్వహణ ఖర్చులు అధికంగా ఉంటాయి. అయితే కారు ఇంజిన్ పరిస్థితిని కొన్ని పద్ధతుల ద్వారా ముందుగానే సులభంగా గుర్తించవచ్చు. ఆ సమయంలోనే మరమ్మతులు చేయించడం వల్ల డబ్బు భారీగా ఆదా అవుతుంది మరియు కారు కూడా చాలా కాలం మన్నిక వస్తుంది.
ఇంజిన్ పరిస్థితిని ఎగ్జాస్ట్ నుంచి వచ్చే పొగ రంగు ఆధారంగా గుర్తించవచ్చు. ఇందులో చాలా రకాలున్నాయి. నీలం, నలుపు, తెలుపు సహా మరిన్ని పొగ రంగులతో ఇంజిన్‌లోని సమస్యలను అంచనా వేయవచ్చు. ఫలితంగా వెంటనే మరమ్మతులు చేయడం ద్వారా డబ్బు ఆదా చేసుకోవచ్చు.

నీలం రంగు పొగ : కంబష్షన్ ఛాంబర్‌లో చమురు దహనం కావడాన్ని నీలం రంగు పొగ సూచించింది. పిస్టన్ రింగ్‌లు, సరైనవికాని వాల్వ్ సీల్స్ లేదా సరిగా పనిచేయని క్రాంక్‌కేస్ వెంటిలేషన్ వల్ల ఎగ్జాస్ట్ పైప్ నుంచి నీలం రంగు పొగ వస్తుంది.
తెల్లని పొగ : కంబష్షన్ ఛాంబర్‌లో కూలెంట్ లేదా నీరు ఉనికి ఉంటే తెల్లని పొగ వస్తుంది. బ్లోన్ హెడ్ రబ్బర్ గ్యాస్కెట్ (రబ్బరు పట్టీ), పగిలిన సిలెండర్ హెడ్ లేదా డ్యామేజ్ అయిన ఇన్‌టేక్ మేనిఫోల్డ్ గ్యాస్కెట్ కారణంగా తెల్లని పొగ వస్తుంది.

నల్లని పొగ : ఇంధనం- గాలి మిశ్రమం ఎక్కువగా ఉంటే నల్లని పొగ వెలువడుతుంది. ప్యూయల్ ఇంజెక్టర్, ఆక్సిజన్ సెన్సార్, ఎయిర్ ఫిల్టర్.. ఈ మూడు సరైన పని తీరు కనబరచకుంటే వాహనం ఎగ్జాస్ట్ పైప్ నుంచి నల్లని పొగ వెలువడుతుంది.
పొగ అధికంగా రావడం : ఎగ్జాస్ట్ నుంచి పొగ అధికంగా కొన్నిసార్లు వస్తుంది. అయితే ఎక్కువ సమయం పొగ అదే మాదిరిగా వస్తుంటే నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం

అసాధారణ వాసన : ఇంజిన్‌లోని లోపలి సమస్యలు కారణంగా ఎగ్జాస్ట్ నుంచి అసాధారణమైన వాసనలు వస్తుంటాయి. ఉదాహరణకు కూలెంట్ లీకేజీ కారణంగా స్వీట్ వాసన వస్తుంది. అదే క్యాటలిస్టిక్ కన్వర్టర్ లీకేజీ కారణంగా కుళ్లిన గుడ్డు తరహా వాసన వచ్చే అవకాశం ఉంది. అదే ఇంధనం లేదా ఇతర లూబ్రికెంట్లు దహనం కారణంగా ప్లాస్టిక్ కాలుతున్న వాహన వస్తుంది.
బ్యాక్ ఫైరింగ్ : ఇగ్నిషన్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం అంటే స్పార్క్ ప్లగ్ లేదా ఇగ్నిషన్ కాయిల్ సరిగా పనిచేయకపోవడం వల్ల బ్యాక్ ఫైరింగ్ జరుగుతుంది.
ఎగ్జాస్ట్ ప్రెజర్ తగ్గిపోవడం : క్యాటలిస్టిక్ కన్వర్టర్ బ్లాక్ కావడం లేదా ఎగ్జాస్ట్ వ్యవస్థకు ఏదైనా అడ్డుపడడం వల్ల ఎగ్జాస్ట్ ప్రెజర్ తగ్గుతుంది. ఈ రెండు కూడా ఇంజిన్ పనితీరుపై ప్రభావం చూపుతాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








