56 ఏళ్లు పూర్తి చేసుకున్న ఫియట్ 500 సిటీ కార్
ఫియట్ 500.. ఈ చిన్న కారు గురించి మన భారతీయులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. ఫియట్ ఈ చిన్న కారుని భారత మార్కెట్లో ప్రవేశపెట్టినప్పటికీ, అది ఇక్కడి మార్కెట్లో అంత విజయాన్ని సాధించలేకపోయింది. ఇందుకు ప్రధాన కారణం, ఫియట్‌కు మన దేశంలో సరైన డీలర్‌షిప్ నెట్‌వర్క్ లేకపోవటమే. అంతేకాకుండా, ఫియట్ 500 కారును పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటంతో దీని ధర కూడా ఇక్కడి మార్కెట్లో అధికంగా ఉండేది. అందుకే ప్రస్తుతం ఫియట్ ఈ కారును భారత్‌లో విక్రయించడాన్ని నిలిపివేసింది.
ఫియట్ 500 కారు మన మార్కెట్లో సక్సెస్ సాధించకపోయినప్పటికీ, గ్లోబల్ మార్కెట్లలో మాత్రం మంచి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. సరే అదంతా అటుంచి ఒక్కసారి ఫియట్ 500 చరిత్రను గమనిస్తే, జులై 4, 1957లో ఫియట్ తొలిసారిగా 500 కారును విడుదల చేసింది. ఫియట్ 500కు ఇప్పుడు 56 ఏళ్లు. అప్పట్లో ఈ కారులో 479సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు (ఇంజన్ వెనుకవైపు ఉండేది). 2.9 మీటర్ల పొడవు మాత్రమే ఉండే ఈ కారు మొత్తం బరువు కేవలం 500 కిలోలు మాత్రమే.
సుమారు 18 ఏళ్ల పాటు ఫియట్ ఈ కారును విజయవంతంగా ఉత్పత్తి చేసింది. 1975లో ఫియట్ 500 ఉత్పత్తిని తాత్కాలికంగా కంపెనీ నిలిపివేసింది. అప్పట్లో బెస్ట్ సిటీ కారుగా పేరు దక్కించుకున్న ఫియట్ 500 కారును మొదటిసారి ఉత్పత్తి నిలిపివేసే సమయం నాటికి 38.9 లక్షల కార్లను కంపెనీ తయారు చేసింది. ఫియట్ ఉత్పత్తి ప్రారంభమై సరిగ్గా 50 ఏళ్లు పూర్తయిన తర్వాత కంపెనీ ఇందులో 21వ సెంచరీ ఎడిషన్ 500ను మార్కెట్లో విడుదల చేసింది. మరి ఈ బుజ్జి కారుకి మనం కూడా హ్యాపీ బర్త్‌డే తెలుపుదామా..?

ఫియట్ 500 @ 56 ఏళ్లు
1957 మోడల్ ఫియట్ 500 సిటీ కార్

ఫియట్ 500 @ 56 ఏళ్లు
1957 ఫియట్ 500 చిన్న కారుతో ఫోజిస్తున్న మోడల్

ఫియట్ 500
ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో లభిస్తున్న ఫియట్ 500

ఫియట్ 500
ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో లభిస్తున్న ఫియట్ 500

ఫియట్ 500
ప్రస్తుత వెర్షన్ ఫియట్ 500 ఇంటీరియర్స్

ఫియట్ 500
ప్రస్తుత వెర్షన్ ఫియట్ 500


Click it and Unblock the Notifications








