రండి.. ఫియట్ కెఫేలో వేడి వేడి కాఫీ తాగొద్దాం..!!

Fiat Caffe
మార్కెట్లో ఏదైనా ఉత్పత్తి విజయవంతం కావాలంటే మార్కెటింగ్ ప్రణాళికలు ఎంతో అవసరం. ఈ సిద్ధాంతాన్నే నమ్ముకున్న ఫియట్ ఓ కొత్త పద్ధతిలో తన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఫియట్ ఇటీవలే న్యూఢిల్లీలో కాఫీ, టీలను విక్రయించే ఓ కెఫేను ప్రారంభించింది. గ్లాసులో వేడి వేడి కాఫీ, అహ్లాదకరమైన సంగీతం, చుట్టు పక్కల ఫియట్ కార్లు.

ఇంకేముంది, ఎంతటి వారైనా ఈ ప్రశాంతమైన వాతావరణానికి తలొగ్గి ఎవ్వరైనా ఫియట్ కార్లపై ఓ లుక్కేయాల్సిందే. అంతేకాకుండా, ఈ కెఫేలో ఫియట్ ఆటోమొబైల్ చరిత్రను తెలియజెప్పే ఫోటోలు, మోడల్ కార్లను కూడా గమనించవచ్చు. ఇంకా, ప్రస్తుతం ఫియట్ ఇండియా మార్కెట్లో అందిస్తున్న పుంటో హ్యాచ్‌బ్యాక్, లీనియా సెడాన్‌లను ఇక్కడ ప్రదర్శనకు ఉంచడమే కాకుండా, టెస్ట్ డ్రైవ్‌లను కూడా ఆఫర్ చేస్తుంది.

ఫియట్ కెఫేలో వివిధ రకాలు కాఫీ, టీ, స్నాక్స్, డిసెర్ట్స్ లభిస్తాయి. వీటి ధరలు, ఇతర వివరాలను ఫియట్‌కెఫే అధికారిక వెబ్‌సైట్‌లో పొందవచ్చు. న్యూఢిల్లీలోని టోల్‌స్టాయ్ మార్గ్‌లో ఫియట్ కెఫేను ఏర్పాటు చేశారు. ఇండియాలో మనకు ఫియట్ కెఫే కొత్త కావచ్చు కానీ, ప్రపంచ వ్యాప్తంగా ఫియట్‌కు ఇలాంటి కెఫేలు చాలానే ఉన్నాయి. ఈ కెఫేలలో ఫెరారీ, లాన్సియా, ఆల్ఫా రోమియో, మాసేరటి వంటి బ్రాండ్‌లు ప్రదర్శించబడుతాయి.

More from DriveSpark

Article Published On: Friday, January 20, 2012, 16:45 [IST]
English summary
Carmakers are now trying to woo car buyers of all ages with varied marketing methods. The latest concept that has been imported from Europe is the cafe or lounge. Carmakers are establishing branded lounges to high light their cars as well as provide a boost to their images. Mercedes-Benz has already opened its lounge at Delhi.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+