ఫియట్ పుంటో ఇవోతో జీవితం మరింత ఆసక్తికరం
ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ ఇండియా ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన అప్‌గ్రేడెడ్ పుంటో కోసం కంపెనీ ఓ సరికొత్త టెలివిజన్ కమర్షియల్‌ను విడుదల చేసింది. ఫియట్ పుంటో ఇవో కారుతో మీ జీవితం మరింత ఆసక్తికరంగా మారుతుందని చెబుతూ కంపెనీ ఈ కమర్షియల్‌ను తయారు చేసింది. మనం కూడా ఆ వీడియోని చూసేద్దాం రండి.
ఇది కూడా చదవండి: ఫియట్ పుంటో టెస్ట్ డ్రైవ్ రివ్యూ
ఈ వీడియో ద్వారా ఫియట్ తమ పుంటో ఇవో కారును కొనుగోలు చేసిన కస్టమర్ల జీవితం సాధారణం కన్నా మరింత ఆసక్తికరంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా, ఈ వీడియోలో తమ పుంటో కారులోని ఫీచర్లను కూడా హైలైట్ చేసింది.
ఫియట్ ఇండియా కేవలం రూ.4.55 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే 'ఫియట్ పుంటో ఇవో' ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. పుంటో ఇవో ఈ సెగ్మెంట్లో కెల్లా తొలిసారిగా రియర్ ఏసి వెంట్స్, ప్రీమియం సాఫ్ట్ టచ్ టూ టోన్ డ్యాష్, యాంబీంట్ లైట్, ఆటో డౌన్ పవర్ విండో (నాలుగు డోర్లకు), డ్యూయెల్ స్టేజ్ డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, స్మార్ట్ వైపర్స్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి విశిష్టమైన ఫీచర్లతో లభిస్తుంది. ఈ కారుపై కంపెనీ మూడేళ్ల రెగ్యులర్ వారంటీని మరియు మరో రెండేళ్ల అదనపు వారంటీని ఆఫర్ చేస్తోంది.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/iL47lXqKj0U?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








