ఫోర్డ్ వివాదపూరిత ప్రకటన; ఉన్నతాధికారుల సస్పెండ్

By Ravi

అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియా కోసం ప్రకటనలు తయారు చేసే గ్లోబల్ అడ్వర్టైజ్‌మెంట్ కంపెనీ జెడబ్ల్యూటి ఫిగో కోసం రూపొందించిన వివాదాస్పద ప్రకటనలు ప్రపంచ వ్యాప్తంగా దుమారాన్ని లేపాయి. ఇందులో మాజీ ఇటలీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోనీతో కొందరు ప్రముఖ సెలబ్రిటీలను కించపరచే విధంగా జెడబ్ల్యూటి కంపెనీ ప్రకటనలు రూపొందించిన సంగతి తెలిసినదే.

ఈ ప్రకటనలపై సర్వత్రా నిరసనలు వెల్లవెత్తుడంతో అటు ఫోర్డ్ ఇటు జెడబ్ల్యూటి రెండు కంపెనీలు బహిరంగ క్షమాపణలు తెలుపుకున్నాయి. కాగా.. తాజాగా జెడబ్ల్యూటి ఇండియా తమ ఛీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ పార్ట్‌నర్ అయిన బాబీ పవార్‌ను విధుల్లో నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు ఫోర్డ్ ఇండియా కూడా తమ సంస్థలోని ఓ ఉన్నతాధికారి విజయ్ సింహా వెల్లంకిని కూడా విధుల్లో నుంచి తొలగించాలని యోచిస్తోంది.

Ford Figo Add

భారత మార్కెట్లో అందిస్తున్న ఫోర్డ్ ఇండియా అందిస్తున్న ఫిగో హ్యాచ్‌బ్యాక్ ప్రమోషన్ రూపొందించిన ఓ ప్రకటనతో ఈ దుమారం తలెత్తింది. ఫిగో బూట్ స్పేస్‌ను హైలైట్ చేస్తూ ఈ ప్రకటనలుంటాయి. ఇందులోని ఓ ప్రకటనలో ఇటాలియన్ మాజీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోనీ డ్రైవింగ్ సీట్లో ఉండగా, నోరు, చేతులు కట్టిపడేసిన ముగ్గురు సెక్సీ అమ్మాయిలను బూట్ స్పేస్‌లో ఉన్నట్లుగా ఉంది.

మరొక ప్రకటనలో అమెరికన్ సెలబ్రిటీ ప్యారిస్ హిల్టన్ ముందు సీట్లో కూర్చొని ఉండగా, మరొక సెలబ్రిటీ కిమ్ కర్దాషియాన్ మరియ ఆమె ఇద్దరు చెల్లెళ్లను నోరు, చేతులు కట్టిపడేసి బూట్ స్పేస్‌లో ఉంచారు. మూడవ ప్రకటనలో రేసింగ్ దిగ్గజం మైఖేల్ షుముఖర్ డ్రైవర్ సీట్లో కూర్చొని ఉండగా, ఇదే రేసింగ్ రంగానికి చెందిన ఎఫ్1 డ్రైవర్స్ సెబాస్టియన్ వెట్టెల్, ఫెర్నాండో అలోన్సో, లెవిస్ హామిల్టన్‌లను కూడా నోటికి ప్లాస్టర్స్ వేసి, కాళ్లు చేతులు కట్టిపడేసి ఉంటారు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 27, 2013, 18:11 [IST]
English summary
New York headquartered Global Advertising agency of Ford 'JWT' has made a controversial advertisement for Figo. Amidst international uproar over the Ads, JWT India has gone a step ahead and has sacked its chief creative officer and managing partner, Mr Bobby Pawar.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+