అలెర్ట్.. అలెర్ట్: ఆ వాహనాలకు దారి ఇవ్వలేదో, రూ. 10,000 ఫైన్

సాధారణంగా మనం ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట అత్యవసర వాహనాలు సరైన సమయంలో చేరవలసిన ప్రదేశాలకు చేరకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో చూస్తూనే ఉన్నాం. ఈ ఆలస్యానికి కారణం భారీగా ఉన్న ట్రాఫిక్ కారణం అయితే, మరొకటి రోడ్డుపైన ప్రయాణించే చాలా మంది వాహననారులు ఇటువంటి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోవడం కూడా ఒక కారణమే.

దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు అత్యవసర వాహనాలకు దారి ఇవ్వని వాహనదారులపైనా కఠినంగా శిక్షలు విధిస్తున్నారు. అంతే కాకూండా ఇప్పుడు గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు అత్యవసర వాహనాలకు భారీ మొత్తంలో జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

అలెర్ట్.. అలెర్ట్: ఆ వాహనాలకు దారి ఇవ్వలేదో, రూ. 10,000 ఫైన్

ఎమర్జెన్సీ వాహనాలైన (అత్యవసర వాహనాలైన) అంబులెన్స్, ఫైర్ ఇంజన్ వంటి వాటికి దారి ఇవ్వకపోతే గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు దానికి కారణమైన వాహనదారుల వద్ద నుంచి ఇప్పుడు ఏకంగా రూ. 10,000 జరిమానా వసూలు చేస్తారు. 1988లోని సెక్షన్ 194E మోటారు వాహన చట్టం ప్రకారం.. ట్రాఫిక్ పోలీసులు ఈ జరిమానా విధించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు తన ట్విట్టర్ హ్యాండిల్‌ ద్వారా ప్రకటించారు.

అలెర్ట్.. అలెర్ట్: ఆ వాహనాలకు దారి ఇవ్వలేదో, రూ. 10,000 ఫైన్

అది మాత్రమే కాకుండా రోడ్డుపైన ఎమర్జెన్సీ వాహనాలు వచ్చినప్పుడు అన్ని వాహనాలు ఎడమవైపుకు వెళ్లాలని పోలీసులు సూచించారు. అత్యవసర వాహనాలకు దారి ఇవ్వడం అనేది కనీస మానవ ధర్మం. అత్యవసర వాహనానికి దారి ఇవ్వకపోవడం ఎక్కడైనా ఏ దేశంలో అయినా పెద్ద నేరం. ఇప్పుడు ఈ నియమాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వారికి రూ. 10,000 జరిమానా విధించబడుతుంది. వాహనదారులు దీనిని తప్పకుండా గుర్తుంచుకోవాలి.

అలెర్ట్.. అలెర్ట్: ఆ వాహనాలకు దారి ఇవ్వలేదో, రూ. 10,000 ఫైన్

భారతదేశంలో ఇప్పటికే మోటార్ వాహన చట్టం చాలా కఠినంగా అమలులో ఉంది. అయినప్పటికీ కొంతమంది ప్రజలు వీటిని ఉల్లంగిస్తున్నారు. దీనిపైన పోలీసులు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ భారీ మొత్తంలో జరిమానా విధించడం వల్ల గురుగ్రామ్‌ వంటి ప్రాంతాల్లో అత్యవసర వాహనాలు సులభంగా గమ్యం చేరుకోవడానికి అనుమతిస్తుంది.

అలెర్ట్.. అలెర్ట్: ఆ వాహనాలకు దారి ఇవ్వలేదో, రూ. 10,000 ఫైన్

ఎమర్జెన్సీ వాహనాలైన అంబులెన్స్ ఎల్లప్పుడూ అత్యవసర వైద్య సహాయం అందించడానికి రోగులను తరిస్తూ ఉంటుంది. అటువంటి వాహనాలు నిముషం ఆలస్యంగా వైద్యశాలకు చేరినా అందులోని రోగి ప్రాణాలే కోల్పోయే అవకాశం ఉంది. కావున ప్రజా రహదారులపైనా మనం ప్రయాణించేటప్పుడు కనీస మానవత్వంతో వాటికి దారిని కల్పించాలి. అప్పుడే ఒక ప్రాణం కాపాడినవారము అవుతాము.

అలెర్ట్.. అలెర్ట్: ఆ వాహనాలకు దారి ఇవ్వలేదో, రూ. 10,000 ఫైన్

అయితే అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో ప్రతి ఒక్కరూ ఈ నియమాన్ని తప్పకుండా అనుసరిస్తారు. అయితే మనదేశంలో చాలామంది ప్రజలు లేన్ డ్రైవింగ్‌ వంటివి కూడా పాటించడం లేదు. మీరు రోడ్డుపైన ప్రయాణిస్తున్నప్పుడు రియర్‌వ్యూ మిర్రర్‌లో ఎమర్జెన్సీ వాహనం వస్తున్నట్లు మీరు గుర్తిస్తే ఆ వెహికిల్‌కు దారి ఇవ్వాలని గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అలెర్ట్.. అలెర్ట్: ఆ వాహనాలకు దారి ఇవ్వలేదో, రూ. 10,000 ఫైన్

గత సంవత్సరం కర్ణాటక రాష్ట్రంలో ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ఒక కారు డ్రైవర్ కావాలనే అంబులెన్స్ కి దారి ఇవ్వలేదు. దీనిని గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ కారు డ్రైవర్ అప్పుడు మారుతీ సుజుకి ఎర్టిగా డ్రైవ్ చేస్తున్నాడు. అంతే కాకుండా అతడు ఉద్దేశ్యపూర్వకంగానే హైవేపై అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదని తెలిపాడు. ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లాలోని తొక్కొట్టు నుంచి పంప్ వెల్ వరకు ఉన్న 66వ నెంబరు జాతీయ రహదారిపై జరిగింది.

అలెర్ట్.. అలెర్ట్: ఆ వాహనాలకు దారి ఇవ్వలేదో, రూ. 10,000 ఫైన్

దీనికి కారణమైన వ్యక్తి 31 సంవత్సరాల వయసున్న 'చరణ్' గా గుర్తించారు. అతడు యానిమేషన్ పరిశ్రమలో పనిచేస్తున్నట్లు పోలీసుల విచారంలో తెలుసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం మొత్తం అంబులెన్స్ ముందు ప్యాసింజర్ సీటులో కూర్చున్న వ్యక్తి వీడియో తీసాడు. ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియావైలో తెగ వైరల్ అయ్యింది.

అలెర్ట్.. అలెర్ట్: ఆ వాహనాలకు దారి ఇవ్వలేదో, రూ. 10,000 ఫైన్

ఆ సమయంలో అంబులెన్స్ రోగిని కనచూర్ ఆసుపత్రి నుండి మంగళూరుకు తీసుకువెళ్తున్నట్లు తెలిసింది. మంగళూరు పోలీస్ స్టేషన్ అధికారి ట్రాఫిక్ సౌత్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వైరల్ అయిన వీడియో ఆధారంగా అతన్ని అరెస్ట్ చేశారు. అయితే పబ్లిక్ రోడ్డుపైన రాష్ డ్రైవింగ్ చేసే వారిపైన ఇండియాన్ పీనల్ కోడ్ సెక్షన్ 279 మరియు మోటారు వాహనాల చట్టం, 1988 యొక్క 194 (ఇ) కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. కావున వాహన వినియోగదారులు తప్పకుండా దీనిని గుర్తించాలి.

అలెర్ట్.. అలెర్ట్: ఆ వాహనాలకు దారి ఇవ్వలేదో, రూ. 10,000 ఫైన్

ఫోటో తీసి పెట్టు & ప్రైజ్ మనీ కొట్టు:

రోడ్లపైన నో పార్కింగ్ ప్రదేశంలో అక్రమంగా పార్కింగ్ చేసిన వాహనాలకు గుర్తించి దానిని ఫోటో తీసి సంబంధిత అధికారులకు పంపినట్లైతే వారికి రూ. 500 రివార్డ్ అందుతుంది. దీనికి సంబంధించిన ధికారిక సమాచారం కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

అలెర్ట్.. అలెర్ట్: ఆ వాహనాలకు దారి ఇవ్వలేదో, రూ. 10,000 ఫైన్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతదేశంలో ఇప్పటికి కూడా చాలామంది అత్యవసర వాహనాలకు దారి కల్పించడం లేదు. ఇది మనం కూడా చాలా సార్లు చూసి ఉంటాము. అయితే ఇప్పుడు పోలీసులు తీసుకువచ్చిన ఈ కొత్త జరిమానా తప్పకుండా వాహనదారులలో మార్పును తీసుకువస్తుందని ఆశిస్తున్నాము. కేవలం ఈ విధానం గురుగ్రామ్ లో మాత్రమే కాకుండా దేశం మొత్తం తీసుకువస్తే తప్పకుండా మార్పు వస్తుందని ఆశించవచ్చు.

Most Read Articles

English summary
Fine of rs 10000 if you do not give way to emergency vehicles details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X