Just In
- 13 min ago
మార్చి 2న హ్యుందాయ్ బేయోన్ క్రాసోవర్ ఆవిష్కరణ - వివరాలు
- 22 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
- 1 hr ago
కొత్త 2021 స్విఫ్ట్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన మారుతి సుజుకి
Don't Miss
- Sports
స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని ఇంగ్లండ్‌ను కాకుండా.. పిచ్‌ను విమర్శించడం ఏంటి: గ్రేమ్ స్వాన్
- Finance
తగ్గనున్న విమాన ఛార్జీలు- డీజీసీఏ కీలక అనుమతి- ఆ సేవలు ఇక విడివిడిగానే
- Movies
సీనియర్ డైరెక్టర్‌తో అను ఇమ్మాన్యుయేల్ అఫైర్.. డేటింగ్ జోష్‌లో ఉన్న దర్శకుడు ఎవరంటే!
- News
Sunny Leone: మేడమ్ మొగుడికే స్పాట్ పెట్టాడు, కారు నెంబర్ తో త్రీడి సినిమా, పీయూష్ !
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జరిమానా విధించాడని పోలీస్ స్టేషన్‌కే కరెంట్ కట్.. ఎక్కడో తెలుసా..!
పోలీస్ స్టేషన్లకు ఎలక్ట్రిక్ సప్లై కట్ చేసినందుకు గాను తెలంగాణ స్టేట్ సదరన్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగి రమేష్ అరెస్టయ్యాడు. పోలీస్ స్టేషన్ కి కరెంట్ ఎందుకు కట్ చేసాడు, పోలీసులు అతనిని ఎదుకు అరెస్ట్ చేశారన్న విషయాన్నీ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

నివేదికల ప్రకారం రమేష్ అనే వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించడంతో కోపోద్రేకుడైన అతడు ఏకంగా పోలీస్ స్టేషన్ కి కరెంట్ కట్ చేసాడు. ఈ సంఘటన తరువాత రమేష్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రమేష్ బైక్‌ను ఒక బాలుడు రైడ్ చేసాడు. సాధారణంగా వాహన చట్టం ప్రకారం మైనర్లు బైక్ నడపడానికి అనర్హుడు. ఈ కారణంగా రమేష్ కి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.

అతనికి జరిమానా విధించిన వెంటనే రమేష్ ఘటనా స్థలానికి వెళ్లి విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ట్రాఫిక్ ఉల్లంఘన యొక్క తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ట్రాఫిక్ పోలీసులకు అతనికి జరిమానా విధించారు. ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించడంతో పోలీసులపై కోపం పెంచుకున్నాడు.
MOST READ:రాష్ట్రపతిచే సత్కరించబడిన సాధారణ జంట.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

సంఘటన స్థలం నుండి వెళ్లిన రమేష్, పోలీస్ స్టేషన్లకు కరెంట్ కట్ చేయాలనీ నిర్ణయించుకున్నాడు. దీని ప్రకారం, జుడిమట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్టేషన్లకు కరెంట్ కట్ చేసాడు. కరెంట్ కట్ అవ్వడం వల్ల పోలీస్ స్టేషన్ లో కొంత ఇబ్బందికార వాతావరణం ఏర్పడింది.

ఇంతటితో ఉండకుండా ట్రాఫిక్ పోలీసులకు మరింత ఇబ్బంది కలిగించాలని నిర్ణయించుకుని, రమేష్ తన బైక్‌ను ట్రాఫిక్ పోలీసులు ఆపి ఉంచిన ప్రదేశానికి తీసుకెళ్లి ట్రాఫిక్ సిగ్నల్ యొక్క విద్యుత్ సరఫరాను కూడా కట్ చేసాడు. దీంతో ట్రాఫిక్ సిగ్నల్ 2 గంటలకు మించి పనిచేయలేదు. ఈ సంఘటన తర్వాత పోలీసులు విద్యుత్ విభాగాన్ని సంప్రదించారు.
MOST READ:ఫాస్ట్‌ట్యాగ్ మినిమమ్ బ్యాలెన్స్‌పై క్లారిటీ ఇచ్చిన NHAI

విద్యుత్ శాఖ సంబంధిత అధికారులు వచ్చిన కొద్ది గంటలకే పోలీస్ స్టేషన్లకు కరెంట్ వచ్చింది. ట్రాఫిక్ సిగ్నల్ కి కూడా కరెంట్ సప్లై చేయబడింది. విద్యుత్తు అంతరాయానికి కారణమేమిటో మొదట్లో స్పష్టంగా తెలియలేదు. అయితే దర్యాప్తు అనంతరం రమేష్ ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నివేదికల ప్రకారం కోర్టు నిందితుడు రమేష్‌ను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. 2019 లో ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి సంఘటన జరిగింది. హెల్మెట్ ధరించనందుకు పోలీసులు ఎలక్ట్రిక్ బోర్డ్ లైన్‌మన్‌కు రూ. 500 జరిమానా విధించారు.
MOST READ:హోండా యాక్టివా 6జి కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఆఫర్లు & వివరాలు

పోలీసులు జరిమానా విధించారనే ఆగ్రహంతో, లైన్‌మ్యాన్ పోలీస్ స్టేషన్‌కు విద్యుత్తును కత్తిరించాడు. ఇది కూడా అప్పుడు ఒక సమస్యగా మారింది. ఏది ఏమైనా వాహనదారులు ఈవిధంగా చేయడం తప్పు, విధుల్లో ఉన్న పోలీసులు చట్టపరమైన చరియలు తీసుకున్నప్పుడు వారిపై ఈ విధంగా కక్ష సాధింపు చర్య చేయడం ఏ మాత్రం సమంజసం కాదు.