ఆనంద్‌ మహీంద్రాపై FIR.. ఘటనపై మహీంద్రా సంస్థ అధికారిక ప్రకటన

ఉత్తరప్రదేశ్‌లో మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రాతోపాటు (Anand Mahindra) మరో 12 మందిపై కార్లు భద్రతపై క్రిమినల్‌ కేసు నమోదైంది. దీంతో ఆ సంస్థ కార్ల భద్రతపై సహా ఇతర అంశాలపై సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అయ్యాయి. దీంతో కొన్ని పుకార్లు భారీగా వ్యాప్తిచెందాయి. దీంతో మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ అప్రమత్తం అయింది.

ఈ వ్యవహారంపై అధికారిక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజేష్‌ మిశ్రా ఫిర్యాదు ఆధారంగా ఆనంద్‌ మహీంద్రాతోపాటు మరో 12 మందిపై కాన్పూర్‌లో FIR నమోదైంది. వాహనం భద్రతపై సంస్థ ఇచ్చిన తప్పుడు హామీలు తన కుమారుడి మృతికి కారణమని పేర్కొంటూ రాజేష్‌ మిశ్రా ఫిర్యాదు చేశారు.

FIR against Anand mahindra

రాజేష్‌ మిశ్రా ఫిర్యాదు ఆధారంగా... డిసెంబర్‌ 2020లో మహీంద్రా స్కార్పియో SUVని ( Mahindra Scorpio SUV )కొనుగోలుచేశారు. తన కుమారుడు డాక్టర్‌ అపూర్వ్‌ మిశ్రాకు ఆ SUVని బహుమతిగా ఇచ్చారు. ప్రకటనలు, సోషల్‌ మీడియా పోస్టులు రాజేష్‌ మిశ్రా స్కార్పియో కారు కొనుగోలు నిర్ణయంపై ప్రభావం చూపాయి.

2022 జనవరి 14న డాక్టర్‌ అపూర్వ్‌ మిశ్రా తన స్నేహితులతో కలిసి లక్నో నుంచి కాన్పూర్‌కు తిరిగివస్తుండగా.. వీరు ప్రయాణం చేస్తున్న మహీంద్రా స్కార్పియో SUV డివైడర్‌ను ఢీకొట్టింది. దట్టమైన పొగమంచు కారణంగా వెలుతురు తగ్గిందని ఫలితంగా ఈ ప్రమాదం జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

డివైడర్‌ను ఢీకొట్టిన అనంతరం మహీంద్రా స్కార్పియో చాలాసార్లు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డాక్టర్‌ అపూర్వ్‌ మిశ్రా మరణించాడు. అయితే రాజేష్‌ మిశ్రా ఫిర్యాదు ఆధారంగా.. స్కా్ర్పియోలో ప్రయాణం చేస్తున్న వారంతా సీట్‌బెల్ట్‌లు ధరించారు. అయినా ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోలేదని, ఇది తన కుమారుడి మరణానికి ప్రాథమిక కారణమని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఆరోపణలు, ఎఫ్‌ఐఆర్‌ నమోదుపై మహీంద్రా సంస్థ అధికారిక ప్రకటన చేసింది. మహీంద్రా స్కార్పియో s9 వేరియంట్‌ ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉందని, దాంతోపాటు కారులో ఎటువంటి లోపం లేదని పేర్కొంటూ సంస్థ అధికారికంగా పత్రిక ప్రకటన విడుదల చేసింది. ప్రమాదంలో కారు బోల్తాపడిందని (రోల్‌ఓవర్‌).. అలాంటి సమయంలో ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవని ప్రకటనలో పేర్కొంది. డాక్టర్‌ అపూర్వ్‌ మిశ్రా కుటుంబానికి తమ సంతాపాన్ని వ్యక్తం చేసింది.

రాజేష్ మిశ్రా ఫిర్యాదు, పలు ఆరోపణలపై పుకార్లకు చెక్‌ పెట్టేందుకు మహీంద్రా సంస్థ వేగంగా స్పందించింది. ఘటన సమయంలో కారు పరిస్థితిని తన అధికారిక ప్రకటనలో వివరించింది. రోల్‌ఓవర్‌ కారణంగా ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోలేదని స్పష్టం చేసింది. కారులో ఎటువంటి సమస్య లేదని వెల్లడించింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Wednesday, September 27, 2023, 18:06 [IST]
English summary
Fir against anand mahindra in scorpio accident case here is the mahindra official statement
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+