YouTube

సరదా తీర్చిన పెళ్లి వేడుక ఫోటోలు.. ఏం జరిగిందంటే?

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మరిచిపోలేని, మధురమైన అనుభూతి. ఈ కారణంగానే ఈ వేడుక మాత్రం చాలా ఆడంబరంగా మరియు అట్టహాసంగా చాలా కొత్తగా ఉండటానికి ప్రయత్నించినవారు ఎందరెందరో. ఈ విధంగా పెళ్లి వేడుక కొత్తగా ఉండాలని అలోచించి చివరికి వారే ఇబ్బందుల్లో పడతారు.

ఇలాంటి సంఘటనలు ఇది వరకే చాలా తెలుసుకున్నాం. ఇదే తరహాలో ఇప్పుడు మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

సరదా తీర్చిన పెళ్లి వేడుక ఫోటోలు.. ఏం జరిగిందంటే?

నివేదికల ప్రకారం మహారాష్ట్రలోని పూణేకి చెందిన 23 సంవత్సరాల 'సుభాంగి శాంతారామ్ జరాండే' ఇటీవల ఎంతో వైభవంగా వివాహం చేసుకుంది. అయితే సాధారణంగా ఎవరైనా పెళ్లి మండపానికి కారులో వెళ్లడం ఆనవాయితీ, అయితే సుభాంగి పట్టలేని ఆనందంతో కారు నుంచి దిగి కారు బోనెట్ పైకి ఎక్కి ఫోటోలకు ఫోజులిచ్చింది.

సరదా తీర్చిన పెళ్లి వేడుక ఫోటోలు.. ఏం జరిగిందంటే?

వీరు మహీంద్రా స్కార్పియోలో పూణే-సాస్వాద్ మార్గంలోని ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్నారు. పెళ్లి కుమార్తె వేషంలో ఉన్న ఈమె కారు బోనెట్ పై ఉన్న వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె కారు బోనెట్ మీద కూర్చున్న దృశ్యాన్ని బైక్ మీద ఒక వ్యక్తి రికార్డ్ చేసాడు.

సరదా తీర్చిన పెళ్లి వేడుక ఫోటోలు.. ఏం జరిగిందంటే?

పెళ్లి సందడి కోసం జరిగిన ఈ తతంగం సోషల్ మీడియాలో కాస్త వైరల్ అవ్వగానే, మోటారు వాహన చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను పూణే పోలీసులు వధువు మరియు ఆమె బంధువులపై కేసు నమోదు చేశారు. అంతే కాకూండా వీరిపై కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కూడా నమోదు చేయబడింది.

సరదా తీర్చిన పెళ్లి వేడుక ఫోటోలు.. ఏం జరిగిందంటే?

దేశంలో కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికి కూడా కొన్ని కరోనా నివారణ చర్యలు పాటించాలి, ఇందులో సామజిక దూరం మరియు పేస్ మాస్క్ వంటివి తప్పకుండా ధరించాలి. అయితే ఇక్కడ వధువుతో సహా ఎవరూ ఫేస్ మాస్క్ ధరించలేదు. పెళ్లి వేడుకను చిరస్మరణీయంగా గుర్తుంచుకోవలసిన ఈ సంఘంగా వారిని ఇబ్బందుల్లోకి నెట్టింది.

సరదా తీర్చిన పెళ్లి వేడుక ఫోటోలు.. ఏం జరిగిందంటే?

పెళ్లి కుమార్తెకు మరుపురాని ఈ రోజు చివరకు హాస్యాస్పదంగా మారింది. బైక్‌పై కూర్చుని సన్నివేశాలను చిత్రీకరిస్తున్న వ్యక్తిపై కూడా పూణే పోలీసులు కేసు నమోదు చేశారు. సాధారణంగా ఇవన్నీ అనుకోని ప్రమాదాలకు దారి తీస్తాయి. తద్వారా ప్రాణాపాయం కూడా జరగవచ్చు.

ఈ సంఘటన గురించి పూణేలోని లోని కల్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, సెక్షన్ 269 (డిసీజ్ ట్రాన్స్మిషన్ రిస్క్), సెక్షన్ 188 (అంటువ్యాధి సమయంలో ప్రభుత్వ ప్రకటనకు అవిధేయత), సెక్షన్ 279 (వెహికల్ స్టంట్), సెక్షన్ 107 (నేరానికి ప్రేరేపించడం), సెక్షన్ 336 (విపత్తు) వంటి కేసులు నమోదయ్యాయి.

సరదా తీర్చిన పెళ్లి వేడుక ఫోటోలు.. ఏం జరిగిందంటే?

పోలీసులు వీరిపై కేసు నమోదు చేసినప్పటికీ, ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. అయితే త్వరలో చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. భారతదేశంలో వెహికల్ స్టంట్స్ చేయడం మరియు పాల్గొనడం నేరం. ప్రమాదకరంగా డ్రైవింగ్ చేయడం వంటివి కూడా నేరం. ఇటువంటి చర్యలకు పాల్పడిన వ్యక్తులపై తప్పకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. వాహనదారులు వీటిని దృష్టిలో ఉంచుకుని నడుచుకోవాలి.

Most Read Articles

English summary
Bride Reaches Marriage On The Bonnet Of Mahindra Scorpio. Read in Telugu.
Story first published: Thursday, July 15, 2021, 9:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X