దిశా పటాని & టైగర్ ష్రాఫ్‌పై ఎఫ్‌ఐఆర్‌ బుక్ చేసిన ముంబై పోలీసులు.. కారణం ఇదే

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ మహమ్మారి వల్ల ఎంతో మంది ప్రజలు మరణించారు. ఇప్పటికి కూడా రోజుకి 1 లక్షకు పైగా ప్రజలు ఈ కరోనా భారిన పడుతున్నారు. ఈ కరోనా వైరస్ యొక్క నివారణ కోసం భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన నిర్ణయాలను అమలుచేసింది. ఇందులో భాగంగానే దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ విధించబడింది.

దిశా పటాని & టైగర్ ష్రాఫ్‌పై ఎఫ్‌ఐఆర్‌ బుక్ చేసిన ముంబై పోలీసులు.. కారణం ఇదే

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ సమయంలో ఎవరూ అనవసరంగా బయటకు రాకూడనే నిబంధన ఉంది. ఈ నిబంధనను ఉల్లఘించిన వారు ఎంతటి వారైనా, వారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటి 'దిశా పటాని మరియు నటుడు టైగర్ ష్రాఫ్' కరోనా సమయంలో కారణం లేకుండా బయటకు రావడంతో వారిపై కేసు నమోదుచేయడం జరిగింది.

దిశా పటాని & టైగర్ ష్రాఫ్‌పై ఎఫ్‌ఐఆర్‌ బుక్ చేసిన ముంబై పోలీసులు.. కారణం ఇదే

దిశా పటాని మరియు టైగర్ ష్రాఫ్ ఇద్దరూ సరైన కారణం లేకుండా ముంబైలోని బాంద్రా ప్రాంతంలో తిరుగుతున్నట్లు పోలీసులు నివేదికలో తెలిపారు. కోవిడ్-19 ఆంక్షలను పాటించలేదని ఆరోపిస్తూ దిషా పటాని, టైగర్ ష్రాఫ్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు.

MOST READ:శభాష్ పోలీస్; లాక్‌డౌన్‌లో బయటకు వచ్చిన రాజకీయ నాయకుడికి రూ. 11,000 జరిమానా

దిశా పటాని & టైగర్ ష్రాఫ్‌పై ఎఫ్‌ఐఆర్‌ బుక్ చేసిన ముంబై పోలీసులు.. కారణం ఇదే

ముంబైలోని బ్యాండ్‌స్టాండ్ ప్రొమెనేడ్‌లో వద్ద మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎటువంటి సరైన కారణం లేకుండా వీరిద్దరూ గుర్తించబడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వ నివేదికల ప్రకారం 2021 జూన్ 15 వరకు రాష్ట్ర స్థాయిలో లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఈ సమయంలో అత్యవసర సమయంలో మాత్రమే బయటకు రావాలని అక్కడి ప్రభుత్వం సూచించింది.

దిశా పటాని & టైగర్ ష్రాఫ్‌పై ఎఫ్‌ఐఆర్‌ బుక్ చేసిన ముంబై పోలీసులు.. కారణం ఇదే

కరోనా లాక్ డౌన్ యొక్క నిర్దిష్ట సమయంలో మాత్రమే బయటకు రావడానికి అర్హులు. అయితే ఈ ఇద్దరి నటులు మధ్యాహ్నం 2 గంటల తరువాత బయటకు వచ్చారు. కరోనా లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఘించినందుకు వీరిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు మీడియా నివేదికలో పేర్కొంది.

MOST READ:స్వయంగా ఎలక్ట్రిక్ బైక్‌ తయారు చేయాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే

దిశా పటాని & టైగర్ ష్రాఫ్‌పై ఎఫ్‌ఐఆర్‌ బుక్ చేసిన ముంబై పోలీసులు.. కారణం ఇదే

కరోనా లాక్ డౌన్ లో పట్టుబడ్డ ఈ ఇద్దరిపై ముంబై పోలీసులు చర్యలు తీసుకుంటామని ట్విట్టర్‌లో సమాచారం ఇచ్చారు. పోలీసులు ఈ సమయంలో దిషా పటాని, టైగర్ ష్రాఫ్‌పై ఐపిసి సెక్షన్ 188 మరియు సెక్షన్ 34 కింద కేసు నమోదు చేశారు.

దిశా పటాని & టైగర్ ష్రాఫ్‌పై ఎఫ్‌ఐఆర్‌ బుక్ చేసిన ముంబై పోలీసులు.. కారణం ఇదే

పోలీసులు ముంబై ప్రజలను ఉద్దేశించి, కరోనా మహమ్మారిపై పోరాడుతున్న సమయంలో అనాదరూ తప్పకుండా సహకరించాలని, అనవసరంగా బయటకు రాకూడని విజ్ఞప్తి చేశారు. ' దిషా మరియు టైగర్ తమ కారులో తమ పరిసరాల చుట్టూ తిరుగుతున్నారని, కొంతమంది పోలీసులు తమ తనిఖీలో గుర్తించారు.

MOST READ:అందమైన మహిళ చీరకట్టుతో వోల్వో బస్ డ్రైవ్ చేస్తే..? సూపర్ కదూ.. వీడియో చూడండి

దిశా పటాని & టైగర్ ష్రాఫ్‌పై ఎఫ్‌ఐఆర్‌ బుక్ చేసిన ముంబై పోలీసులు.. కారణం ఇదే

కరోనా లాక్ డౌన్ లో నిబంధనలు ఉల్లంఘించినవారు ఎంతటివారైనా వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఒక రాజకీయనాయకునిపై కూడా పోలీసులు చర్యలు తీసుకుంటూ అతనికి ఏకంగా 11,000 రూపాయలు జరిమానా విధించారు.దీనికి సంబంధించిన సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
FIR Registered Against Disha Patani And Tiger Shroff For Violating Corona Curfew Details. Read in Telugu.
Story first published: Thursday, June 3, 2021, 15:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X