కొత్త స్కూటర్‌లో దూరిన పాము.. బయటకు తీసేందుకు స్కూటర్‌ను పార్టుపార్టులుగా విడదీసిన వైనం..
ద్విచక్ర వాహనాల్లో పాములు దూరిన ఘటనలు తరచూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. పబ్లిక్ ప్రాంతాల్లో సైతం ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆ సమయాల్లో చాకచక్యంగా వ్వవహరిస్తూ స్నేక్ క్యాచర్ సహాయంతో పామును బయటికి తీస్తారు. కానీ ఇక్కడ పామును బయటకు తీయడం కోసం స్కూటర్ మొత్తాన్ని విడదీసిన ఘటన చోటుచేసుకుంది.
స్కూటర్‌లో పాము ప్రవేశించడంతో స్కూటర్‌ను మొత్తం విడదీసిన ఘటన తమిళనాడులోని దిండిగల్‌లో చోటుచేసుకుంది. కొత్త స్కూటర్ కొనుగోలుదారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్‌టీఓ కార్యాలయానికి స్కూటర్‌లో పాము ఉందని గ్రహించడంతో అగ్ని మాపక శాఖ బండిని పార్టులు పార్టులుగా విడదీసి పామును బయటకు దీసింది. దాని గురించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..

దిండిగల్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయం ఉంది. సాధారణంగా, కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత, వాహనదారులు తమ వాహనాన్ని RTO కార్యాలయానికి తీసుకువచ్చి అక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకుంటారు. ఈ నేపథ్యంలో అక్కడ ఓ వింత సంఘటన చోటుచేసుకుంది.
కాగా దిండిగల్ ఆర్టీఓ కార్యాలయం వద్ద రిజిస్ట్రేషన్ నంబర్ కొనుగోలు చేసేందుకు వాహనాలన్నీ బారులు తీరాయి. ఈ క్రమంలో ఆర్టీఓ కార్యాలయ మైదానంలో కొత్త వాహనాలు నిలిపిన ప్రదేశంలో కొండచిలువ వచ్చింది. ఇది చూసి అక్కడున్న వారు కేకలు వేసి పరుగులు తీశారు.

అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలోని పొదల్లో దాక్కున్న పాము కోసం వెతికి పట్టుకున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అంతకు ముందుగానే అక్కడ మరో పాము ఉంది. దీంతో తొలుత దాక్కున్న మరో పాము భయపడి బయటకు పరుగులు తీసింది.
అది చూసిన ఓ మహిళ మళ్లీ కేకలు వేయడంతో.. పాము కొత్త బైక్‌లు పార్క్ చేసిన చోటికి పరుగులు తీసింది. అక్కడ ప్రాణ రక్షణ కోసం స్కూటర్ లోపలికి చేరింది. ఇది గమనించిన అగ్నిమాపక సిబ్బంది స్కూటర్‌లోకి ప్రవేశించిన పామును ఎలాగైవా పట్టుకోవాలని ప్రయత్నించింది.

స్కూటర్‌లో దాక్కున్న పామును బయటకు తీసేందుకు అగ్నిమాపక శాఖ శతవిధాలుగా ప్రయత్నించింది. కానీ పాము వారికి చిక్కలేదు. దీంతో సిబ్బంది ఓ నిర్ణయానికి వచ్చారు. పామును పట్టుకునేందుకు స్కూటర్‌ను విడదీయక తప్పదని భావించారు. కొత్త స్కూటర్‌ను వేర్వేరు భాగాలుగా విడదీసి పామును పట్టుకున్నారు. ఈ పామును పట్టుకునేందుకు దాదాపు రెండు గంటల పాటు శ్రమించారు. స్కూటర్‌లో ప్రవేశించిన నాలుగు అడుగుల పొడవున్న త్రాచుపాముగా గుర్తించారు.
పామును పట్టుకోవడంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే స్కూటర్ యజమాని సంగతేంటి.? పామును పట్టుకోవాలంటే కొత్త స్కూటర్‌ను పార్టుల వారీగా విడదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షాకాలంలో పాములు తరచూ బయటకు వస్తాయి. మీ వాహనాల సమీపంలో ఉంటే అవి అందులోకి ప్రవేశించే అవకాశం ఉంది.
అందుకే మీ వాహనాలను ఒకే చోట ఎక్కువసేపు పార్క్ చేస్తే, బండిని వెనక్కి తీసుకునేటప్పుడు, ఒకసారి అన్ని ప్రదేశాలను తనిఖీ చేసుకోవాలి. పాములు బైక్‌లోకి వస్తే వాటిని కనుగొనడం చాలా కష్టం. అంతే కాకుండా పాములు ఎక్కడ ఉన్నాయో మీకు తెలిస్తే మీరు అక్కడ పార్కింగ్ చేయకుండా ఉండాలి. పాములు బైక్ లోపలికి వస్తే, వాటిని పార్టులుగా విడదీయడం తప్ప వేరే మార్గం లేదని గ్రహించాలి.


Click it and Unblock the Notifications








