అడ్డంకులెన్నున్నా.. ఇట్టే సాగిపోతోంది! భారతదేశపు ఫస్ట్ సెల్ఫ్ డ్రైవింగ్ బొలెరో (వీడియో)

ప్రపంచంలోని చాలా దేశాలు సెల్ఫ్ డ్రైవింగ్ (అటానమస్) కార్ల మీద దృష్టిపెడుతున్నాయి. ఇప్పటికి టెస్లా మాత్రమే ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ప్రవేశపెట్టింది. భారతదేశంలో ఈ టెక్నాలజీ అందుబాటులో రావడానికి ముందే రోడ్డుపై ఇటీవల ఓ సెల్ఫ్ డ్రైవింగ్ కారు కనిపించింది.

భారతదేశంలో ADAS సిస్టం సాయంతో డ్రైవింగును మరింత సులభతరం చేయడానికి మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ మరియు టాటా వంటి కంపెనీలు కార్లను తయారు చేసి విడుదల చేస్తున్నాయి. అంతే కాకుండా అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ మీద పనిచేస్తున్న కొన్ని స్టార్టప్‌లు ఉన్నాయి. కాగా ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియోలో మహీంద్రా బొలెరో సెల్ఫ్ డ్రైవింగ్ కారుగా మారింది.

First Autonomous Driving Technology Mahindra Bolero

వీడియోలో మీరు గమనించినట్లయితే.. డ్రైవర్ అవసరం లేకుండా ఓ కారు రోడ్డుపై ముందుకు సాగుతోంది. ఈ ఘటన ఇండియాలోని సబర్బన్ ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ కారుకు అనేక సెన్సార్లు, కెమెరాలు మరియు రాడార్ వంటి వాటిని అమర్చి ఉండటం కూడా చూడవచ్చు. కారును టెస్ట్ చేస్తున్న సమయంలో రోడ్డుపైన అనేక అడ్డంకులు ఉండటం కూడా చూడవచ్చు.

టెస్టింగ్ సమయంలో కారును ఎవరూ డ్రైవ్ చేయలేదు, కానీ ఒక వ్యక్తి మాత్రం భద్రతల దృష్ట్యా డ్రైవర్ సీటులో కూర్చుని ఉన్నారు. డ్రైవర్ అవసరం లేకుండానే కారు రోడ్డుపై అడ్డంకులను, అవరోధాలను దాటి సజావుగా ముందుకు సాగుతోంది. ఈ కారు రోడ్డుకు ఎడమవైపున మాత్రమే వెళ్లడం చూడవచ్చు. పాదాచారులను.. వాహనానికి రాంగ్ సైడ్ వస్తున్న వాహనాలను కూడా ఇది జాగ్రత్తగా పరిశీలించి కదులుతోంది.

First Autonomous Driving Technology Mahindra Bolero

మహీంద్రా బొలెరో తన ఏదైనా అడ్డొచ్చినప్పుడు వేగాన్ని తగ్గించుకుంటుంది.. అంతే కాకుండా రోడ్డుకు ఇరువైపులా ఉన్న వాహనాలకు మధ్యలో ప్రయాణిస్తుంది. మార్గాన్ని ఈ కారు చాలా ఖచ్చితంగా అనుసరిస్తూ ముందుకు సాగుతోంది. వాహనం చుట్టూ ఉంచిన సెన్సార్లు రోడ్డుపైన వచ్చే వాహనాలను గుర్తిస్తున్నాయి. తద్వారా ప్రమాదం జరగకుండా ముందుకు సాగుతోంది. వీడియో మొత్తం మీద అనేక అడ్డంకులను అధిగమించడం మనకు కనిపిస్తుంది.

భారతదేశంలో మేడ్ ఇన్ ఇండియా కారు మీద ఓ కంపెనీ అటానమస్ సిస్టం కోసం ప్రయోగాలు చేయడం ఇదే మొదటి సారి. ఇలాంటి టెక్నాలజీల మీద ఇండియాలో RoshAI వంటి సంస్థలు పనిచేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే తప్పకుండా ఇండియాలో కూడా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు రావడానికి మరెన్నో రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.

First Autonomous Driving Technology Mahindra Bolero

అనుకున్నవన్నీ సవ్యంగా జరిగి అటానమస్ కార్లు మన దేశంలో కూడా వినియోగంలోకి వస్తే.. అది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఎందుకంటే అమెరికా కంపెనీ టెస్లాకు ఇండియన్ అటానమస్ కార్లు ప్రత్యర్థులుగా నిలబడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వీడియోలో కనిపించే సంఘటన కేవలం టెస్టింగ్ మాత్రమే.. ఇలాంటి కార్లు ఎప్పుడు మార్కెట్లోకి వస్తాయి అనే దానికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడి కాలేదు.

మహీంద్రా బొలెరో

భారతీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క పాపులర్ కారు బొలెరో. ఇది ఒకప్పటి నుంచి దేశీయ విఫణిలో ఉత్తమ అమ్మకాలను పొందుతూ అమ్మకాల్లో దూసుకువెళుతోంది. కంపెనీ బొలెరో నియో పేరుతో కూడా ఓ కారును మార్కెట్లో లాంచ్ చేసింది. ఇవన్నీ గమనిస్తే ఇండియన్ మార్కెట్లో బొలెరో కారులు ఎంత ఆదరణ ఉందనేది ఇట్టే తెలిసిపోతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, March 14, 2024, 15:00 [IST]
English summary
First autonomous driving bolero car in india viral video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+