తొలిసారిగా మెట్రో కోసం డ్రైవర్‌లెస్‌ రైళ్లు.. అధునాతన ఫీచర్లు.. 32 కీలక పరీక్షల అనంతరమే అందుబాటులోకి..!!

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న డ్రైవర్‌లెస్‌ మెట్రో రైలు బెంగళూరు త్వరలో చేరుకోనుంది. చైనాలో తయారు చేయబడిన కొన్ని డ్రైవర్‌లెస్‌ ప్రోటోటైప్‌ కోచ్‌లు చెన్నై పోర్టుకు చేరుకున్నాయి. వీటిని బెంగళూరు మెట్రో (Namma Metro) ఎల్లో లైన్‌లో ట్రయల్‌ రన్‌ కోసం ఉపయోగించనున్నారు.

ఆరు ప్రోటోటైప్‌ కోచ్‌లతో బెంగళూరు మెట్రో ఎల్లో లైన్‌లో ట్రయల్‌ రన్‌ (Bengalore Metro) నిర్వహించనున్నారు. ఎల్లో లైన్‌ 19.15 కి.మీ మేర నిర్మాణం చేపట్టారు. ఈ లైన్‌ ఆర్‌వీ రోడ్‌ నుంచి వయా బొమ్మసండ్ర, జయదేవ్ హాస్పిటల్‌, సిల్క్‌ బోర్డ్‌ జంక్షన్‌ సహా ఎలక్ట్రానిక్‌ నిటీ మీదుగా ప్రయణం చేయవచ్చు.

first Driverless trains for namma metro here are the key details

ఈ డ్రైవర్‌లెస్‌ మెట్రో కోచ్‌లను చైనాకు చెందిన CRRC Nanjing Puzhen Co Ltd సంస్థ తయారు చేసింది. ఈ సంస్థ బెంగళూరు మెట్రో రైల్‌తో రూ.1578 కోట్లతో కోచ్‌ల తయారీనికి ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం 2019 సంవత్సరంలో జరిగింది. ఇందులో భాగంగా 216 మెట్రో కోచ్‌లను బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కు డెలివరీ చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతం చెన్నై పోర్టులో ఉన్న ప్రోటోటైప్ కోచ్‌లు కస్టమ్స్‌ తనిఖీల కోసం ఉంచారు. ఇందుకు 5 రోజుల సమయం తీసుకొనే అవకాశం ఉంది. అనంతరం వీటిని భారీ వాహనాల్లో రోడ్డు మార్గంలో బెంగళూరుకు తరలించనున్నారు. ఇందుకో మరో 3 నుంచి 4 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.

ఫిబ్రవరి 20 కంటే ముందుగానే ఈ డ్రైవర్‌లెస్‌ మెట్రో కోచ్‌లు బెంగళూరుకు చేరుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. బెంగళూరుకు చేరుకున్నాక.. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని హెబ్బగోడి డిపోకు తరలిస్తారు. అక్కడే వీటిని అసెంబ్లింగ్‌ నిర్వహిస్తారు. ఇందుకోసం చైనాకు నుంచి ఇప్పటికే ఇంజనీర్లు బెంగళూరు చేరుకున్నారు.

మెట్రో కోచ్‌లకు సుమారు 32 రకాల వివిధ పరీక్షలు నిర్వహిస్తారు. 8-10 స్టాటిక్‌ టెస్ట్‌లు, 15 పరీక్షలను మెయిన్‌లైన్‌లో నిర్వహిస్తారు. 7-8 ఇంటర్‌పేస్‌ టెస్ట్‌లు, ఇంకా అనేక డైనమిక్‌ టెస్ట్‌లు నిర్వహిస్తారు. రీసెర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌ పర్యవేక్షణలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారని తెలిసింది. ఎల్లో లైన్‌లో సివిల్‌ మరియు ట్రాక్‌ పనులు ఎప్పుడో పూర్తయిన డ్రైవర్‌లెస్‌ ట్రైయిన్ కోచ్‌లు అందుబాటులో లేకపోవడం కారణంగా స్టార్ట్యూటరీ పరీక్షలను నిర్వహించలేదు.

బెంగళూరు మెట్రో డ్రైవర్‌లెస్‌ ట్రైయిన్‌ టెస్టుల ఫలితాలను చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ అధికారి సహా రైల్వే బోర్డుకు పంపాల్సి ఉంటుంది. అక్కడ నుంచి అనుమతులు వచ్చేందుకు 5-6 నెలల సమయం తీసుకొనే అవకాశం ఉంది. డ్రైవర్‌లెస్‌ మెట్రో రైలు అసెంబ్లింగ్‌, టెస్టింగ్‌ను పర్యవేక్షించేందుకు ఇప్పటికే చైనాకు చెందిన ఇంజినీరు 5 మంది బెంగళూరుకు చేరుకున్నారు. ఫిబ్రవరి నెలాఖరులోకా మరో 10 మంది బెంగళూరుకు చేరుకోనున్నారు.

ఒప్పందంలో భాగంగా ఒక కోచ్‌ను రూ.7.31 కోట్ల రూపాయలకే సరఫరా చేస్తామని చైనాకు చెందిన సంస్థ తెలిపింది. దీంతోపాటు ఈ కోచ్‌లు అధునాత ఎలక్ట్రానిక్‌ వ్యవస్థలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. అయితే ఒప్పందంలో భాగంగా స్థానిక సంస్థతో భాగస్వా్మ్యం కుదుర్చుకొనేందుకు చైనాకు చెందిన సంస్థ కష్టపడాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. చివరకి బెంగాల్‌కు చెందిన టిటాగర్‌ వ్యాగన్స్‌ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

మే నాటికి మరో రెండు రైళ్లను అనంతరం ప్రతి నెల రెండు చొప్పున బెంగళూరుకు వచ్చే అవకాశం ఉంది. బెంగళూరు నమ‌్మ మెట్రో ఎల్లో లైన్‌ ప్రారంభించేందుకు కనీసం ఎనిమిది రైళ్లు అవసరమని తెలుస్తోంది. ఈ డ్రైవర్‌లెస్‌ మెట్రోను 90 సెకన్ల ఫ్రీక్వెన్సీతో నడపవచ్చునని తెలుస్తోంది. ఈ కోచ్ పొడవు 21 మీటర్లు మరియు బరువు 32 నుంచి 37 టన్నుల వరకు ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 8, 2024, 12:58 [IST]
English summary
First driverless trains for namma metro here are the key details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+