డ్రైవింగ్ లైసెన్స్ పొందిన భారతదేశపు మొదటి మరగుజ్జు మనిషి, ఇతడే

భారతదేశం అన్ని రంగాల్లోనూ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నప్పటికీ దేశంలో ఉన్న చాలామంది శారీరక వికలాంగులు వాహనాలను నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ పొందలేకపోతున్నారు. శారీరక వికలాంగులు తమ డ్రైవింగ్ లైసెన్స్ పొందటం అనేది ఇప్పటికీ చాలా కష్టమైనపని గానే ఉంది. అయితే ఇటీవల ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

డ్రైవింగ్ లైసెన్స్ పొందిన భారతదేశపు మొదటి మరగుజ్జు మనిషి, ఇతడే

నివేదికల ప్రకారం, హైదరాబాద్‌కు చెందిన గట్టిపల్లి శివపాల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన దేశంలోనే తొలి మరుగుజ్జు మనిషిగా నిలిచాడు. కేవలం మూడు అడుగుల ఎత్తు ఉన్న గట్టిపల్లి శివపాల్ (42) దాదాపు అన్ని అవకాశాలను అధిగమించాడు. తన జిల్లా కరీంనగర్‌లో డిగ్రీ పూర్తి చేసి మొదటి మరగుజ్జు మనిషిగా కూడా గుర్తింపు పొందాడు. శివపాల్ 2004 లో డిగ్రీ పూర్తి చేశాడు.

డ్రైవింగ్ లైసెన్స్ పొందిన భారతదేశపు మొదటి మరగుజ్జు మనిషి, ఇతడే

ANI తో మాట్లాడిన గట్టిపల్లి శివపాల్ తన అనుభవాన్ని తెలియజేశారు. నా పొట్టితనాన్ని చూసి ప్రజలు నన్ను ఆటపట్టించేవారు మరియు ఈ రోజు నేను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు మరెన్నో నామినేట్ అయ్యాను. చాలా మంది యువకులు డ్రైవింగ్ శిక్షణ కోసం నా వద్దకు వస్తున్నారు, అని కూడా అతడు చెప్పాడు. అంతే కాకుండా తాను వచ్చే ఏడాది శారీరక వికలాంగుల కోసం డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.

ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్న శివపాల్‌ 2000 లో హైదరాబాద్‌కు వచ్చినట్లు కూడా తెలిపాడు. నగరంలో తనను తాను నిలబెట్టుకోవడానికి ఉద్యోగం కోసం తాను పడుతున్న కష్టాన్ని వివరించిన శివపాల్, తాను మొదట్లో ఒక సినిమా మరియు డైలీ సోప్‌లో నటించానని చెప్పాడు. కానీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలవలేదు.

డ్రైవింగ్ లైసెన్స్ పొందిన భారతదేశపు మొదటి మరగుజ్జు మనిషి, ఇతడే

నాకున్న వైకల్యం కారణంగా ఎవరూ ఉద్యోగం ఇవ్వడానికి ముందుకురాలేదు. అయితే ఒక స్నేహితుడి ద్వారా నేను ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాను, ఇప్పుడు నేను గత 20 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను. నేను క్యాబ్ బుక్ చేసినప్పుడల్లా ట్రిప్ క్యాన్సిల్ చేసేవారు. నేను నా భార్యతో కలిసి బయటకు వెళ్లినప్పుడు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసేవారు. అప్పుడే కారు కొని నడపాలని నిర్ణయించుకున్నానని అని చెప్పాడు.

డ్రైవింగ్ లైసెన్స్ పొందిన భారతదేశపు మొదటి మరగుజ్జు మనిషి, ఇతడే

డ్రైవ్ చేయడానికి ఉత్సాహంగా ఉన్న శివపాల్ ఇంటర్నెట్‌లో సర్చ్ చేయగా, యుఎస్‌లోని ఒక వ్యక్తి అప్‌లోడ్ చేసిన వీడియోను కనుగొన్నాడు. సీటు మరియు ఇతర పరికరాలను వాటి ఎత్తుకు పెంచడానికి కారులో అవసరమైన మార్పుల గురించి తెలుసుకున్నాడు. కారును సవరించిన తర్వాత, శివపాల్ స్నేహితుడి వద్ద కారు నడపడం నేర్చుకున్నాడు. అయితే, డ్రైవర్ ఎత్తుపై రవాణా శాఖ కొన్ని మార్గదర్శకాలను కలిగి ఉన్నందున, లైసెన్స్ పొందడం మరొక సవాలుగా మారింది. ఈ కారణంగానే డ్రైవింగ్ లైసెన్స్ పొందటం అనేది మళ్ళీ ఒక సమస్యగా మారింది.

డ్రైవింగ్ లైసెన్స్ పొందిన భారతదేశపు మొదటి మరగుజ్జు మనిషి, ఇతడే

అధికారులకు విజ్ఞప్తి చేయడంతో మూడు నెలల పాటు లెర్నర్ లైసెన్స్ పొందానని, ఆ తర్వాత పక్కనే కూర్చున్న అధికారితో సరైన డ్రైవింగ్ టెస్ట్ చేయించుకున్నానని శివపాల్ తెలిపారు. ప్రతి ఒక్కరిలో కొన్ని లోపాలు ఉంటాయని, అయితే మీలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే ముఖ్యమైనదని ఆయన అన్నారు.

భారతదేశంలో శారీరక వికలాంగులు తమ డ్రైవింగ్ లైసెన్స్ పొందే మార్గం ఇప్పటికీ దాదాపు అసాధ్యం. అయితే ప్రస్తుతం మన శివపాల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందటం వల్ల ఇలాంటి వారు కూడా డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు, కావున ఇలాంటి వారిలో ఇప్పుడు ఒక కొత్త ఉత్తేజం ఏర్పడింది. ఇది నిజంగా చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

డ్రైవింగ్ లైసెన్స్ పొందిన భారతదేశపు మొదటి మరగుజ్జు మనిషి, ఇతడే

భారతదేశంలో ప్రజారహాదారులపైన వాహనాలు నడపడానికి తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి. అప్పుడే రోడ్డుపై వాహనాలను నడపడానికి అర్హులు. కావున తప్పకుండా వాహన వినియోగదారులు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి.

దేశంలో రోజు రోజుకి ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరంగా మారుతున్నాయి. కావున తప్పకుండా ట్రాఫిక్ నియమాలను పాటించాలి. అప్పడే దేశంలో రోడ్డు ప్రమాదాలను నివారించగలము. మోటార్ వాహన చట్టం ప్రకారం వాహనాలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా తప్పకుండా కలిగి ఉండాలి.

Most Read Articles

English summary
First dwarf men from hyderabad to get driving license in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X