హాంగ్‌కాంగ్ రోడ్లపై పరుగులు తీస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు

By Ravi

ఈ ఫొటోలో కనిపిస్తున్న బస్సు ఆషామాషీ బస్సు కాదు. ఇది మన సిటీ బస్సుల మాదిరిగా రోడ్డుపై పొగలు కక్కుతూ వెళ్లదు. ఇది పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైనది. ఇది ఎలక్ట్రిక్ బస్సు, బ్యాటరీ పవర్‌తో నడుస్తుంది. హాంగ్‌కాంగ్‌కు చెందిన విద్యుత్ కంపెనీ సిఎల్‍‌పి ఈ బస్సును పరిచయం చేసింది. హాంగ్‌కాంగ్‌లోనే ఇది తొలి ఎలక్ట్రిక్ బస్సు కావటం విశేషం. పర్యావరణానికి హాని కలిగించని ఈ బస్సులను తమ సిబ్బంది కోసం వినియోగిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఈ బస్సులో 49 సీట్లు ఉంటాయి. కేవలం సిఎల్‌పి సంస్థ కోసమే కాకుండా, ఇతర సంస్థల కోసం కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇదే రేంజ్‌లో ఓ డీజిల్ బస్సును కొనుగోలు చేయటానికి ఎంత ఖర్చు అవుతుందో అంతే ఖర్చు ఈ ఎలక్ట్రిక్ బస్సును కొనుగోలు చేయటానికి అవుతుంది. ఈ కోచ్‌ను షాంగ్‌డాంగ్ ప్రావీన్స్‌లో నిర్మించారు. సిఎల్‌పి వద్ద ఇప్పటికే దాదాపు 6 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి.

ఈ ఎలక్ట్రిక్ బస్సును 3 గంటలు ఛార్జ్ చేస్తే 250 నుంచి 300 కిలమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ కోచ్‌ను అల్యూమినియం అల్లాయ్‌తో తయారు చేశారు. ఇది డీజిల్ కోచ్‌ల కన్నా 15 శాతం తేలికగా ఉంటుంది. ఈ కోచ్ జీవిత కాలం 17 ఏళ్లు, బ్యాటరీ జీవిత కాలం ఐదు నుంచి ఆరేళ్లు. ఇది గరిష్టంగా గంటకు 80 కిలోమీట్రల వేగంతో పరుగులు తీస్తుంది. ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ బస్సులు మన రాష్ట్రంలో కూడా అందుబాటులోకి వస్తే ఎంత బాగుంటుందో కదా..?

హాంగ్‌కాంగ్‌లో ఎలక్ట్రిక్ బస్సు

హాంగ్‌కాంగ్‌కు చెందిన ప్రముఖ విద్యుత్ ఉత్పత్తి సంస్థ సిఎల్‍‌పి ఈ ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ బస్సును పరిచయం చేసింది.

తొలి ఎలక్ట్రిక్ బస్సు

హాంగ్‌కాంగ్‌లోనే ఇది తొలి ఎలక్ట్రిక్ బస్సు కావటం విశేషం. పర్యావరణానికి హాని కలిగించని ఈ బస్సులను తమ సిబ్బంది కోసం వినియోగిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

49 సీట్లు

ఈ బస్సులో 49 సీట్లు ఉంటాయి. కేవలం సిఎల్‌పి సంస్థ కోసమే కాకుండా, ఇతర సంస్థల కోసం కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి.

రేంజ్

ఈ ఎలక్ట్రిక్ బస్సును 3 గంటలు ఛార్జ్ చేస్తే 250 నుంచి 300 కిలమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

లైట్ వెయిట్ బాడీ

ఈ కోచ్‌ను అల్యూమినియం అల్లాయ్‌తో తయారు చేశారు. ఇది డీజిల్ కోచ్‌ల కన్నా 15 శాతం తేలికగా ఉంటుంది.

కోచ్, బ్యాటరీ జీవితకాలం

ఈ కోచ్ జీవిత కాలం 17 ఏళ్లు, బ్యాటరీ జీవిత కాలం ఐదు నుంచి ఆరేళ్లు. ఇది గరిష్టంగా గంటకు 80 కిలోమీట్రల వేగంతో పరుగులు తీస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 4, 2013, 10:38 [IST]
English summary
Hong Kong gets it's first electric coach bus. Hong kong based CLP Power Ltd. has unveiled this electric coach for the first time in Hong Kong. Check out, electric bus through pictures.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+