నల్లమల అడవుల్లో ఉన్న వేలాడే రైలు వంతెన గురించి ఆసక్తికరమైన నిజాలు

భారతీయులకు రైలును పరిచయం చేసిన ఆంగ్లేయులు, వారి పాలనలో ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు చేపట్టారు. అందులో ఒకటి నల్లమల కీకారణ్యంలో ఉన్న వేలాడే రైలు వంతెన.

By N Kumar

భారతీయులకు రైలును పరిచయం చేసిన ఆంగ్లేయులు, వారి పాలనలో ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు చేపట్టారు. అందులో ఒకటి నల్లమల కీకారణ్యంలో ఉన్న వేలాడే రైలు వంతెన. మానవ మనుగడుకు అసాధ్యమైన ఈ మహారణ్యంలో సుమారుగా మూడు సంవత్సరాల పాటు ఎలాంటి యంత్ర సహాయం లేకుండా ఓ వంతెన నిర్మాణం పూర్తి చేసినట్లు రైల్వే చరిత్ర చెబుతోంది.

నల్లమల అడవుల్లో దొరబావి వంతెనగా పిలువబడే ఈ వేలాడే రైలు వంతెన గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవాళ్టి ఆఫ్ బీట్ శీర్షికలో మీ కోసం...

నల్లమల అడవుల్లో ఉన్న వేలాడే రైలు వంతెన గురించి ఆసక్తికరమైన నిజాలు

దొరబావి వంతెన .. బహుశా ఆంధ్ర ప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రాలకి ఈ వంతెన గురించి తెలిసి ఉండకపోవచ్చు. కానీ బ్రిటీష్ వారికి ఈ వంతెన ఎంతో ప్రతిష్టాత్మకం. అప్పట్లో పనిచేసిన రైల్వే కూలీలకు ఈ పేరువింటే హడల్. మరి ఈ వంతెన ఆషామాషీ వంతెన కాదు. ఊగే వంతెన.

నల్లమల అడవుల్లో ఉన్న వేలాడే రైలు వంతెన గురించి ఆసక్తికరమైన నిజాలు

దొరబావి వంతెన కు ఆ పేరెలా వచ్చింది ?

ఆంగ్లేయులు వంతెన నిర్మాణానికి అవసరమైన కూలీలను వెంటబెట్టుకొని నల్లమల అడవులలోకి వెళ్ళారు. ఈ నిర్మాణానికి మూడేళ్ళు పడుతుంది అని ఇంజనీర్లు చెప్పడంతో, మద్రాస్ ప్రావిడెన్సి గవర్నర్ వారిని ఇక్కడ ఉండటానికి అనుమతి ఇచ్చారు. ఇక్కడే గుడారాలు, టెంట్లు వేసుకొని రైలు వంతెన నిర్మాణ పనులు మొదలుపెట్టారు. తాగునీటి అవసరాల కోసం బావిని కూడా త్రవ్వించారు. కూలీలు అప్పట్లో ఆంగ్లేయులను దొరలు అని పిలిచేవారు. వారు తవ్వించిన బావి కనుక దొరబావి అని, రైల్వే వంతెన స్థలాన్ని 'దొరబావి వంతెన' గా పిలవడంతో అదే పేరు నిలబడిపోయింది.

నల్లమల అడవుల్లో ఉన్న వేలాడే రైలు వంతెన గురించి ఆసక్తికరమైన నిజాలు

ఈ వంతెన ఎక్కడ ఉంది

దొరబావి వంతెన ఆంధ్ర, తెలంగాణ భూభాగంలో ఉన్న నల్లమల అడవులలో కలదు. నంద్యాల నుండి గిద్దలూరు వెళ్ళే మార్గంలో బొగద టన్నెల్ వద్ద ఇది కనిపిస్తుంది. నంద్యాల నుండి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇది నంద్యాల రైల్వే స్టేషన్ నుండి 30 కి.మీ ల దూరంలో ఉన్నది(రైల్వే ఆధారాల ప్రకారం). 'దిగువమిట్ట' గ్రామం వద్దకు చేరుకొని కూడా బ్రిడ్జి వద్దకు చేరుకోవచ్చు.

నల్లమల అడవుల్లో ఉన్న వేలాడే రైలు వంతెన గురించి ఆసక్తికరమైన నిజాలు

భారీ ఇనుప దిమ్మెలతో

నల్లమల అడవులలో నిర్మించిన ఈ భారీ వంతెనను ఎటువంటి యంత్రాలు, సాంకేతికత ఉపయోగించకుండా .. కేవలం కూలీల భుజబలం, కండ బలంతోనే భారీ ఇనుపదిమ్మెలను ఒక్కొక్కటిగా చేర్చుతూ ఈ నిర్మాణాన్ని పూర్తిచేశారు. కిలోమీటర్ పొడవున్న ఈ వంతెనను నిర్మించటానికి మూడేళ్ళ సమయం పట్టింది.

నల్లమల అడవుల్లో ఉన్న వేలాడే రైలు వంతెన గురించి ఆసక్తికరమైన నిజాలు

నల్లమల కీకారణ్యంలో

నల్లమల అడవులు అంటే అందరికీ గుర్తుకొచ్చేవి దుర్భేద్యమైన వృక్ష, జంతు సంపద. పులులు, ఏనుగులు, సింహాలు మరియు ఇతర క్రూరమృగాలకు ఇది ఆవాసం. అలాంటి ఈ ప్రదేశంలో మూడు సంవత్సరాల పాటు నివాసం ఉండి ఈ రైల్వే వంతెనను నిర్మించారంటే ఆశ్చర్యం కలిగించకమానదు.

నల్లమల అడవుల్లో ఉన్న వేలాడే రైలు వంతెన గురించి ఆసక్తికరమైన నిజాలు

గోవా-మచిలీపట్నం రైల్వే లైను

గోవా నుండి మచిలీపట్నం వరకు సరకు రవాణా కోసం మీటర్ గేజ్ రైల్వే లైన్ ఏర్పాటుచేయాలని బ్రిటీష్ ప్రభుత్వం 1862 వ సంవత్సరంలో ఒక సర్వే చేపట్టింది.

నల్లమల అడవుల్లో ఉన్న వేలాడే రైలు వంతెన గురించి ఆసక్తికరమైన నిజాలు

నల్లమలలో మొదటి రైల్వే లైను

సర్వే పూర్తయిన తర్వాత 1867 నాటికి గుంతకల్లు వరకు రైలు మార్గం వేశారు. అటుపిమ్మట నల్లమల అడవులలో లోయలను కలుపుతూ రైల్వే వంతెన ఏర్పాటుచేయాలని ఆంగ్లేయులు అనుకున్నారు. చలమ, బొగద రైల్వే స్టేషన్ సమీపంలో సముద్రమట్టానికి 260 అడుగుల ఎత్తులో ఈ బ్రిడ్జిని నిర్మించటానికి శ్రీకారం చుట్టారు.

నల్లమల అడవుల్లో ఉన్న వేలాడే రైలు వంతెన గురించి ఆసక్తికరమైన నిజాలు

బ్రిటన్ నుండి తెప్పించిన విడి భాగాలతో

బ్రిటన్‌‌లోని బర్మింగ్ హామ్ ఉక్కు కర్మాగారం నుండి 420 టన్నుల స్వచ్ఛమైన ఇనుమును సేకరించి, అక్కడే విడిభాగాలను తయారుచేసి సముద్రమార్గం ద్వారా మచిలీపట్టణానికి తెప్పించారు.

నల్లమల అడవుల్లో ఉన్న వేలాడే రైలు వంతెన గురించి ఆసక్తికరమైన నిజాలు

ఎత్తైన దిమ్మెల నిర్మాణం

అప్పటికే అక్కడ దిమ్మెల నిర్మాణం పూర్తికావడంతో రైలు ద్వారా వంతెన సామాగ్రిని వంతెన నిర్మాణం చేపట్టిన ప్రదేశానికి చేర్చారు. ఈ రైలు మచిలీపట్నం నుండి ఇక్కడికి రావటానికి మూడు రోజుల సమయం పట్టేదట.

నల్లమల అడవుల్లో ఉన్న వేలాడే రైలు వంతెన గురించి ఆసక్తికరమైన నిజాలు

వంతెన నిర్మాణం

1884 లో నిర్మాణపనులు మొదలుపెట్టి, 1887 నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసి, అదే సంవత్సరంలో మొదటి రైలును వంతెన మీద పరుగులు తీయించారని రైల్వే చరిత్ర చెబుతోంది.

నల్లమల అడవుల్లో ఉన్న వేలాడే రైలు వంతెన గురించి ఆసక్తికరమైన నిజాలు

ఊయలలా ఊగే వంతెన

ఎత్తైన ప్రదేశంలో (250 అడుగులు) వంతెనను నిర్మించారు కనుక స్ప్రింగ్ లను వాడారు. దాంతో ఏ చిన్నపాటి గాలి వీచినా దొరబావి వంతెన ఊయలలాగా ఊగేది. దాంతో జనం ఈ రైలు మార్గంలో ప్రయాణించటానికి ఇష్టపడేవారు.

నల్లమల అడవుల్లో ఉన్న వేలాడే రైలు వంతెన గురించి ఆసక్తికరమైన నిజాలు

110 ఏళ్ల సుధీర్ఘ సేవలు

ఎటువంటి ఆటంకాలు లేకుండా 110 ఏళ్ళు గడిచిన తర్వాత అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు (నంద్యాల నుండి ఎన్నికయ్యారు) గుంటూరు - గుంతకల్ మీటర్ గేజ్‌ను బ్రాడ్ గేజ్‌గా బదలాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

నల్లమల అడవుల్లో ఉన్న వేలాడే రైలు వంతెన గురించి ఆసక్తికరమైన నిజాలు

చారిత్రాత్మక వంతెనను కూల్చేశారు

దాంతో ఈ వంతెనకు సమీపంలోనే మరో నూతన రైలు మార్గాన్ని (బ్రాడ్ గేజ్) నిర్మించారు రైలు అధికారులు. నిరుపయోగంగా ఉన్న ఈ వంతెనను ఎందరు వ్యతిరేకించినా కూల్చేసి, ఉక్కును అమ్మేశారు.

నల్లమల అడవుల్లో ఉన్న వేలాడే రైలు వంతెన గురించి ఆసక్తికరమైన నిజాలు

మీటర్ గేజ్ నుండి బ్రాడ్ గేజ్

బొగద సొరంగం ఇది సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లో అత్యంత పొడవైనది. దీని పొడవు 1565 మీటర్లు. గిద్దలూరు - నంద్యాల రైలు మార్గాన్ని మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ గా మార్పిడి చేస్తున్నప్పుడు బ్రిటీష్ వారు కట్టిన సొరంగానికి బదులుగా ఈ సొరంగాన్ని నిర్మించారు.

నల్లమల అడవుల్లో ఉన్న వేలాడే రైలు వంతెన గురించి ఆసక్తికరమైన నిజాలు

జాతికి అంకితం

సొరంగ నిర్మాణ పనులు 1994 లో మొదలుపెట్టి 1996 లో కేవలం 15 నెలల్లో పూర్తిచేశారు. ఆతరువాత అప్పటి ప్రధాని పివి ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

నల్లమల అడవుల్లో ఉన్న వేలాడే రైలు వంతెన గురించి ఆసక్తికరమైన నిజాలు

ఎలా చేరుకోవాలి ?

నంద్యాల, బొగద, దొనకొండ రైల్వే, గిద్దలూరు రైల్వే స్టేషన్‌ల వద్దకు చేరుకొని దిగువమిట్ట గ్రామం వద్దకు చేరుకుంటే ఈ బ్రిడ్జ్ ను చేరుకోవచ్చు (లేదా) నంద్యాల - గిద్దలూరు రోడ్డు మార్గంలో ప్రయాణించి కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. నంద్యాల నుండి 30 కిలోమీటర్ల దూరంలో దొరబావి వంతెన ఉన్నది.

వేలాడే రైలు వంతెన

1. ఇండియా మీదుగా వెళ్లే పది అంతర్జాతీయ రైలు మార్గాలు

2.స్వతంత్ర భారత దేశంలో, ఇప్పటికీ నడుస్తున్న బ్రిటీష్ సొంత రైల్వే

3.డీజిల్ రైలింజన్లు ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటాయి ఎందుకో తెలుసా...?

4.రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

5.రైలు ప్రయాణం మనకు ఎంతో ఆనందం..... కాని రైలు నడిపే వారికి అదో నరకం...!!

Most Read Articles

Read more on: #rail #రైలు
English summary
Read In Telugu: first hanging railway bridge in Nallamala forest Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X