Just In
- 11 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 13 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 14 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 14 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చేతులు లేని ఈమె డ్రైవింగ్ లైసెన్స్ పొందగలదా.. !
సాధారణంగా ఈ ప్రపంచంలో చాలా మందికి రోజువారీ జీవితం సులభతరం కాదు. ఎందుకంటే అంగవైకల్యం కారణంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వారిలో ఒకరు 28 ఏళ్ల జిల్లుమోల్ మారియట్ థామస్. పుట్టుకతోనే ఆమెకు రెండు చేతులు లేవు.

మారియట్ థామస్ జిల్లుమోల్ థాలిడోమైడ్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ కారణంగా తనకి చేతులు లేవు. కానీ ఇప్పుడు జిల్లుమోల్ కొత్త మరియు విభిన్నమైన గుర్తింపుతో తన కొత్త విశ్వాసాన్ని సాధించింది.

న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదికల ప్రకారం, జిల్లుమోల్ చేతులు లేకపోయినా తన కారును నడపగలదు. తాను తన కాళ్ళతో కారును నడపగలదు. జిల్లుమోల్ కేరళలోని తోడుపుళ సమీపంలోని కరీంనూర్ గ్రామానికి చెందింది.

జిల్లుమోల్ చిన్నప్పటి నుంచీ కారు నడుపుతోంది. తాను కారును సులభంగా నియంత్రించగలదు. జిల్లుమోల్ 2014 లో ఆర్టీఓలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది.
సాధారణంగా భారతదేశంలో కఠినమైన రోడ్డు నిబంధనల కారణంగా మామూలు వ్యక్తులకే కొంతమంది లైసెన్స్ పొందటం కష్టం. కానీ రెండు చేతులు లేని జిల్లుమోల్ కి డ్రైవింగ్ లైసెన్సు తిరస్కరించబడింది.
జిల్లుమోల్ ఈ కారణంగా 2018 లో హైకోర్టులో దరఖాస్తు చేసుకుంది. తరువాత వారికి కేంద్ర ప్రభుత్వం ట్రైనింగ్ లైసెన్స్ మాత్రం ఇచ్చింది. ఇప్పుడు జిల్లుమోల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందాలా వద్దా అని రాష్ట్ర ప్రభుత్వం అలోచిస్తోంది.

రాష్ట్రప్రభుత్వం నివేదికల ప్రకారం తాను వికలాంగురాలు అని, అంతే కాకుండా తాను కొంత బలహీనంగా కూడా ఉందని తెలిపింది. కానీ కొంతమంది వారి బలహీనతలు ఉన్నప్పటికీ విజయం సాధించడానికి ప్రయత్నిస్తారు. జిల్లుమోల్ వికలాంగురాలు అయినప్పటికీ పట్టుదలతో విజయం సాధిస్తుంది.
Source: newindianexpress