భారత్‌లో 'మెక్‌లారెన్ 750ఎస్' ఫస్ట్ డెలివరీ.. మైండ్ బ్లోయింగ్ చేస్తున్న వీడియో
ఆధునిక భారతదేశంలో సాధారణ కార్లకు మాత్రమే కాకుండా సూపర్ కార్లకు కూడా డిమాండ్ భారీగా పెరిగింది. చాలామంది ప్రముఖులు కోట్ల రూపాయలు వెచ్చించి.. సూపర్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి 'మెక్‌లారెన్ 750ఎస్' (McLaren 750S) కారును కొన్నారు.
లవ్ కటారియా తన యూట్యూబ్ ఛానెల్‌లో వైరల్ అవుతున్న వీడియోలో.. బ్రిటీష్ బ్రాండ్ అయిన 'మెక్‌లారెన్ 750ఎస్' సూపర్ కారు డెలివరీ చూడవచ్చు. నిజానికి ఈ కారు భారతదేశపు మొదటి మెక్‌లారెన్ 750ఎస్ అని తెలుస్తోంది. అయితే కారు లవ్ కటారియాకి చెందినదని కాదని తెలుస్తోంది. అయితే అతడు ఈ కారును డెలివరీ చేయడానికి ముందే.. మెక్‌లారెన్ 750ఎస్ లోపల కూర్చున్నాడు.

వీడియోలో చూసినట్లయితే.. ఇది ఎల్‌హెచ్‌డి వెర్షన్ అని తెలుస్తోంది. దీనిని ఎవరు కొనుగోలు చేశారనేది ఖచ్చితంగా తెలియడం లేదు. అంతే కాకుండా కారు రిజిస్ట్రేషన్ ప్లేట్ కూడా కనిపించడం లేదు. కానీ డెలివరీ సమయంలో క్రాకర్స్ కాల్చడం వంటివి చూడవచ్చు. ఈ కారును ప్రైవేట్ ప్రదేశంలో డెలివరీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ కారు చూడగానే.. ఆకర్షించే డిజైన్ కలిగి చాలా అద్భుతంగా ఉంది.
మెక్‌లారెన్ 750ఎస్ (McLaren 750S)
భారతదేశంలో మెక్‌లారెన్ కార్లు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ధర ఎక్కువ కావడం వల్ల వీటిని సెలబ్రిటీలు, క్రికెటర్లు, ఇతర ప్రముఖులు కొనుగోలు చేస్తుంటారు. కంపెనీ భారతదేశంలో బ్రాండ్ యొక్క అన్ని మోడల్స్ విక్రయిస్తోంది. సంస్థకు ముంబైలో ఒక డీలర్‌షిప్ కూడా ఉంది. ఇక్కడ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో సరికొత్త 750ఎస్ సూపర్ కారును విడుదల చేసింది.

మెక్‌లారెన్ 750ఎస్ సూపర్ కారు చూడటానికి మంచి డిజైన్ కలిగి ఉంటుంది. కొత్త ఫ్రంట్ బంపర్ ఉంటుంది. ఇందులో పెద్ద స్ప్లిటర్, శీతలీకరణను (కూలింగ్) మెరుగుపరచడానికి పెద్ద ఇన్‌టేక్‌లు ఉన్నాయి. సన్నగా కనిపించే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, పెద్ద యాక్టివ్ రియర్ వింగ్ కూడా ఇందులో ఉన్నాయి. ఇది 720ఎస్ మోడల్ కంటే 20 శాతం పెద్దదిగా ఉంది.
వీడియోలో క్యాబిన్ కూడా చూడవచ్చు. ఎరుపు రంగులో ఉన్న మెక్‌లారెన్ 750ఎస్ బ్లాక్ క్యాబిన్‌తో పాటు రెడ్ ఇన్సర్ట్‌లతో చాలా స్పోర్టీగా ఉంటుంది. సీతాకోక చిలుక మాదిరిగా ఉండే డోర్స్ ఇక్కడ చూడవచ్చు. ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ కూడా ఇందులో ఉంది. ఇవన్నీ వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.
మెక్‌లారెన్ 750ఎస్ సూపర్ కారులో 4.0 లీటర్ ట్విన్ టర్బో ప్లాట్ ప్లేన్ వీ8 ఇంజిన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 750 పీఎస్ పవర్ మరియు 800 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 720ఎస్ మోడల్ కంటే తేలికగా ఉంటుంది. పనితీరు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సూపర్ కారు టాప్ స్పీడ్ గంటకు 331 కిమీ కావడం గమనార్హం.
మెక్‌లారెన్ 750ఎస్ సూపర్ కారు 720ఎస్ మోడల్ కంటే కూడా 10 శాతం వేగవంతమైనది. ఇది కేవలం 2.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కేవలం 4.4 సెకన్లలో గంటకు 220 కిమీ వాకు వేగవంతం అవుతుంది. దీని ధర భారతీయ మార్కెట్లో సుమారు రూ. 5.91 కోట్లు (ఎక్స్ షోరూమ్).
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








