మొట్టమొదటి ఫ్లయింగ్ కారును కొనుగోలు చేసిన ఎన్ఆర్ఐ

బ్రిటన్‌లో రెండు లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన యూరాక్ కన్సల్టెన్సీ కంపెనీలో మెజారిటీ వాటాదారుడైన షిహోరా అమెరికాలోని బోస్టన్‌కు చెందిన "టెర్రాఫుజియా ట్రాన్సిషన్" అనే కంపెనీ రూపొందించిన మొట్టమొదటి ఎగిరే కారు "ట్రాన్సిషన్"ను కొనుగోలు చేశారు. అహ్మదాబాద్‌లో ఉన్న తమ ఫామ్‌హౌస్‌లో షిహోరా ఈ ఎగిరే కారును పార్క్ చేయనున్నారు. మరి ఈ కారును నడపాలంటే ఆషామాషీ కాదు. దీని డ్రైవింగ్ స్టైలే వేరు. ఒక్క బటన్ నొక్కితే రోడ్డుపై వెల్లే కారు కాస్తా.. రయ్.. మంటూ గాల్లోకి లేస్తుంది. ఇందుకోసం షిహోరా ప్రత్యేకంగా డ్రైవింగ్ క్లాసులు తీసుకుంటున్నారు.
మరి కారును రోడ్లపై నడపాలంటే కేవలం ఆర్టీవీ పరిమితులే కాకుండా.. ఏవియేషన్ (విమానయాన శాఖ) ఏజెన్సీల అనుమతులతో పాటు భద్రతా సంస్థల అనుమతులు కూడా పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం షిహోరా అదే పనిలో ఉన్నారు. అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. 2009లో షిహోరా ఈ కారును బుకింగ్ చేశారు, 2012లో ఈ కారు డెలివరీ కానుంది. 1998 నుంచీ యూకేలో ఉంటున్న సుభాష్ షిహోరా ఈ కారును బుక్ చేసుకునేందుకు ఒక కోటి రూపాయలు చెల్లించారు, మరో కోటి రూపాయలను డెలివరీ సమయంలో చెల్లిస్తారు. మొత్తం డ్యూటీలతో కలిపి అహ్మదాబాద్ వచ్చేసరికి ఈ ఫ్లయింగ్ కారు ధర దాదాపు రూ. 6 కోట్లు అవుతుందని ఆయన తెలిపారు.
'ట్రాన్సిషన్ రోడబుల్ లైట్ స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్'గా పిలిచే ఈ ఎగిరే కారు కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే తన రూపాన్ని మార్చుకోగలదు. అప్పటివరకూ రోడ్డుపై రయ్.. మంటూ దూసుకెళ్లే కారు.. ఒక్కసారిగా రెక్కలు విప్పి పక్షిలాగా గాల్లోకి రివ్వున ఎగిరిపోగలదు. రోడ్డుపై గంటకు 65 మైళ్ల వేగంతోనూ, గాల్లో 115 మైళ్ల వేగంతోనూ ప్రయాణించగలిగే సామర్థ్యం ఈ కారు ప్రత్యేకత. దీనిని ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేయిస్తే 400 నుంచి 450 మైళ్ల దూరం ప్రయాణించ వచ్చు.


Click it and Unblock the Notifications








