Live Video దేశంలోనే పొడవైన సముద్ర వంతెనపై తొలి రోడ్డు ప్రమాదం.. ప్రారంభించిన 10 రోజుల్లోనే..

దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతు (ముంబై ట్రాన్స్‌హార్బర్‌ లింక్‌) ను జనవరి 12న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ వంతెనను రూ.17,840 కోట్లతో నిర్మించారు. ఈ వంతెన మహారాష్ట్రలోని రాయగడ జిల్లాలోని సెవ్రి మరియు నవాషెవా ప్రాంతాలను కలుపుతుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న 2 గంటల ప్రయాణ సమయాన్ని 20 నిమిషాలకు తగ్గించింది.

ఈ అటల్‌ సేతు (Atal Setu) 21.8 కి.మీ పొడవున 6 లేన్లతో నిర్మించారు. సముద్రం పైన 16.50 కి.మీ, మిగిలిన భాగాన్ని భూమిపై నిర్మించారు. భూకంపాలను కూడా తట్టుకొనేలా పూర్తి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నిర్మించారు. ఈ సేతు నిర్మాణం 2018లోనే ప్రారంభం అయింది. అయితే కరోనా కారణాలతో నిర్మాణం ఆల‌స్యం అయింది.

First Road accident on Mumbai trans harbour link

తొలి రోడ్డు ప్రమాదం: తాజాగా ఈ దేశంలోనే అతిపెద్ద సముద్ర వంతెనపై తొలి రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణం చేసిన మారుతి సుజుకి ఇగ్నిస్‌ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనకు సంబంధించిన లైవ్‌ వీడియో వెనుక కారులోని డ్యాష్‌ బోర్డు కెమెరాలో రికార్డు అయింది.

మారుతి సుజుకి ఇగ్నిస్‌ రోడ్డు సైడ్‌ వాల్స్‌ను ఢీకొట్టి.. బోల్తా పడడాన్ని వీడియోలో గమనించవచ్చు. అయితే కారు ఎంత వేగంగా ప్రయాణించిదో తెలియలేదు. మారుతి కారులోని ప్రయాణికుల పరిస్థితిని వీడియోలో క్యాప్చర్‌ కాలేదు. ఆ వంతెనపై ఏర్పాటుచేసిన అత్యాధునిక వ్యవస్థ కారణంగా అత్యవసర సేవల విభాగాలకు వెంటనే సమాచారం అందే అవకాశం ఉంది.

First Road accident on Mumbai atal setu

అటల్‌ సేతుపై కార్లు, ట్యాక్సీలు, తేలికపాటి మోటార్‌ వాహనాలు, మినీ బస్సులు, 2 యాక్సిల్‌ బస్సులు గరిష్ఠంగా 100 కి.మీ వేగంతో ప్రయాణం చేయవచ్చు. వంతెన ప్రారంభం, చివరలో వాహనాల వేగం గంటకు 40 కి.మీగా మాత్రమే ఉండాలి. ఈ వంతెనపై ప్రతిరోజు 70 వేలకు పైగా రాకపోకలు సాగిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ అటల్‌ వంతెనపై ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత కెమెరాలను అమర్చాలని అధికారులు భావిస్తున్నారు. ఈ అటల్‌ సేతు బ్రిడ్జి ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నవీ ముంబైకు వెళ్లేందుకు వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది. ముంబయి నుంచి గోవా సహా ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ బ్రిడ్జి అత్యంత అనుకూలంగా ఉంటుంది.

First Road accident on indias longest sea bridge

ముంబై ట్రాన్స్‌హార్బర్‌ లింక్‌ (Mumbai trans harbour link) సౌండ్‌, వైబ్రేషన్లను తగ్గించేందుకు, సముద్ర జీవులను రక్షించేందుకు రివర్స్‌ సర్క్యులేషన్‌ రిగ్స్‌ టెక్నాలజీని ఉపయోగించారు. శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడనుంది. ఈ అటల్‌ సేతుపై ఎకో ఫ్రెండ్లీ లైటింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటుచేశారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Monday, January 22, 2024, 16:45 [IST]
English summary
First road accident records on indias longest sea bridge atal setu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+