Driving Tips డీజిల్‌ కారును ఎలా నడపకూడదో తెలుసా...?

ఎక్కువ కాలుష్యానికి కారణం అవుతున్న గానీ భారత్‌లో డిజిల్‌ కార్లు ఇప్పటికీ అధికంగానే వినియోగిస్తున్నారు. చిన్న హ్యాచ్‌బ్యాక్‌ కార్లు, కంపాక్ట్‌ సెడాన్‌ లేదా కంపాక్ట్‌ ఎస్‌యూవీల బదులుగా పెద్ద కార్లను కొనుగోలు చేయాలని భావించినప్పుడు భారతీయులు అధికంగా డీజిల్‌ కార్లవైపు మొగ్గుచూపుతున్నారు.

కఠినమైన కాలుష్య నియంత్రణ చర్యలు, నిర్వహణ ఖర్చు అధికంగా ఉన్న కారణంగా కార్ల తయారీ సంస్థలో చాలా వరకు డీజీల్‌ కార్ల తయారీ నిలిపివేశాయి. రానున్న రోజుల్లో డీజిల్‌ కారును కొనుగోలు చేసేందుకు మీరు ప్లాన్‌ చేస్తుంటే మాత్రం ఈ క్రింది తెలిపిన టిప్స్ పాటిస్తే మేలు జరుగుతుంది. అసలు డీజిల్‌ కారు ఎలా నడపకూడదంటే...!

Diesel car driving tips

పెట్రోల్‌ లేదా డీజిల్‌ కారు అయినా సరే తక్కువ ఇంధనం ఉన్నప్పుడు నడపకూడదు. ఎందుకంటే ఇంజిన్‌లోని చాలా భాగాలకు డీజిల్‌ లూబ్రికెంట్‌గా పనిచేస్తుంది. ట్యాంక్‌లో ఇంధనం తక్కువుగా ఉంటే, డీజిల్‌కు బదులుగా గాలిని కంబస్టన్‌ ఛాంబర్‌లోకి సరఫరా చేసే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఇది ఫ్రిక్షన్‌ని పెంచి, పవర్‌ట్రైన్‌ అంతర్గత భాగాలను దెబ్బతీసే అవకాశం ఉంటుంది.

ట్యాంక్‌లో ఇంధనం తక్కువుగా ఉన్న సమయాల్లో డ్రైవింగ్‌ చేస్తే.. ఇంజిన్‌ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఫ్యూయల్‌ పంపుపైనా కూడా అధిక ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. అందువల్ల సరిపడా ఇంధనం ఉంటేనే డ్రైవింగ్‌ చేయడం మంచిది.

కారును స్టార్ట్‌ చేసినప్పుడు, ఇంజిన్‌ వెడెక్కేందుకు కొంత సమయం ఇవ్వండి. దీని వల్ల పవర్‌ట్రైన్‌ చాలాకాలం పాటు మెరుగైన పనితీరు కనబరుస్తుంది. ఎక్కువ సమయంపాటు స్టాటిక్‌ మోడ్‌లో ఉన్నప్పుడు కారు స్టార్ట్‌ చేసిన తర్వాత వెంటనే యాక్సెలరేషన్‌ను అధికంగా ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ సమయంలో లూబ్రికేషన్‌ తక్కువగా ఉంటుంది. అలాంటి సమయాల్లో పిస్టన్‌, పిస్టన్‌ రింగ్‌, వాల్వ్‌, సిలిండర్లు డ్యామేజ్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది.

Diesel car driving tips

తక్కువ rpmలో మరియు అధిక గేర్‌లో డ్రైవింగ్‌ చేయకూడదు. ఇలా చేయడాన్ని లగ్గింగ్‌ అంటారు. దీని వల్ల కారు ఇంజిన్‌పై అధికంగా ఒత్తిడి పడుతుంది. ఫలితంగా ఇంజిన్‌, ట్రాన్సిమిషన్‌ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. తరచూ ఇలా చేయడం వల్ల కారు పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఎప్పుడు OEM సిఫార్సు చేసిన rpm రేంజ్‌లోనే డ్రైవింగ్‌ చేయండి.

డీజిల్‌ వాహనాల్లో ఉండే.. డీజిల్‌ పార్టిక్యులేట్‌ ఫిల్టర్‌ (DPF) ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఈ డీపీఎఫ్‌.. వాహనం నుంచి ప్రమాదకర ఉద్గారాలను వాతావరణంలోకి వెళ్లకుండా చూస్తుంది. డీపీఎఫ్‌.. మసి సహా కొన్ని వ్యర్థాలతో మూసుకుపోతుంది. ఫలితంగా కారు ఇంజిన్‌ పనితీరుపై ప్రభావాన్ని చూపుతుంది. క్రమం తప్పకుండా ఈ ఫిల్టర్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి.

Diesel car driving tips

సాధారణంగా కార్ల నుంచి నల్లని పొగ వస్తుంది. చాలా మంది డ్రైవర్లు దీనిని సరిగా పట్టించుకోరు. ఇంజిన్‌లో ఏదైనా సమస్య ఉంటేనే ఇలా నల్లని పొగ వస్తుంది. దీనిని విస్మరిస్తే కొంతకాలం తర్వాత కారు ఇంజిన్‌ పనితీరుపై ప్రభావం పడుతుంది. శీతాకాలంలో కారు నుంచి నల్లని పొగ రావడం సాధారణం. కానీ వాతావరణం అంతా బాగానే ఉన్న సమయాల్లోను పొగ వస్తుందంటే.. ఇంజిన్‌లో కొన్ని సమస్యలు ఉన్నాయని అర్థం.

More from DriveSpark

Article Published On: Wednesday, May 24, 2023, 19:22 [IST]
English summary
Five important tips to how not to drive diesel cars and maintenance
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+