ప్రపంచంలోని 5 వింత ట్రాఫిక్ రూల్స్.. తెలిస్తే అస్సలు నమ్మరు అలాగే నవ్వు కూడా ఆపుకోలేరు!
రోడ్డుపై ప్రయాణించే సమయంలో ఇతరులకు ఆటంకం కలిగించకుండా ఉండేందుకు, సరైన మార్గంలో ప్రయాణించేందుకు ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఎందుకంటే రహదారి భద్రత అనేది ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యమైన అంశంగా ఉంది. ఈ నియమ నిబంధనలను రూపొందించడమే కాకుండా అమలు చేయడం కూడా పలు దేశాలకు సవాలుతో కూడుకున్న విషయం. ఈ రూల్స్ దేశం నుంచి దేశానికి, ప్రాంతం నుంచి ప్రాంతానికి తగినట్లుగా మారుతుంటాయి.
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణలో ముఖ్యంగా అతివేగం, రాంగ్ రూట్, ఆల్కహాల్ మత్తులో డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్ వంటి ముఖ్యమైనవి ఉన్నాయి. అయితే ప్రపంచంలోని కొన్ని నియమాలు మాత్రం మిమ్మల్నీ ఆశ్చర్యానికి గురిచేయవచ్చు. అవి వినడానికి సిల్లీగా ఉన్నా కానీ.. కొన్ని దేశాల్లో అలాంటి రూల్స్ అమల్లో ఉన్నాయి. ఆ రూల్స్ వివరాలు మీ కోసం..

జంతువులను కాల్చవద్దు: అవును, మీరు విన్నది నిజమే. ప్రపంచంలోని చాలా దేశాల్లో బహిరంగా వేట అనేది నిషేదం. మీరు అమెరికాలోని కాలిఫోర్నియా మరియు టెన్నెస్సీలో ఉంటే కారులో ఉండి జంతువులను వేటాడటం కానీ.. పైరింగ్ చేయండ చట్ట విరుద్ధం. ఇది అక్కడి ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకం. దీనిని ఉల్లంఘిస్తే చట్టపరంగా శిక్షిస్తారు. జంతువుల వేటను అక్కడ చాలా సీరియస్ క్రైమ్‌గా భావిస్తారు. అందువల్ల ఈ రూల్ అమల్లో ఉంది.
తాగిన మైకంలో ఉన్న డ్రైవర్‌తో కారులో కూర్చోవద్దు: మద్యం సేవించి వాహనాలు నడపడం అనేది ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో చట్టవిరుద్ధం. కానీ జపాన్‌లో మాత్రం మద్యం సేవించి వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు కూర్చున్న వ్యక్తిపై కూడా కేసులు నమోదు చేస్తారు. అతను లేదా ఆమె తాగడానికి ఒక చుక్క ఆల్కహాల్ కూడా తీసుకోకపోయినా అతడిపై కేసు నమోదు చేస్తారు.

మీ కుక్కను కారు పైకప్పుపై ఉంచవద్దు: చాలా కుక్కలు కదులుతున్న కారు కిటికీల నుంచి బయటకు తల పెట్టి ప్రకృతిని ఆస్వాదించడానికి ఇష్టపడతాయి. అయితే అలాస్కాలో ఢిఫరెంట్ రూల్ ఉంది. ఈ నియమం ప్రకారం మీ పెట్ డాగ్‌ని కారు పైకి ఎక్కించి డ్రైవ్ చేస్తే దానిని ట్రాఫింక్ ఉల్లంఘనగా పరిగణిస్తారు. దీనికి భారీ జరిమానా కూడా విధిస్తారు.
కారులో తినడం లేదా త్రాగటం చేయవద్దు: బ్యాగ్‌లో మీరు చిప్స్ లేదా ఏమైనా తినడం లేదా త్రాగటం చేస్తే అది నేరం కింద ప్రకటించబడుతుంది. నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ కూడా తీసుకెళ్లకూడందు. ఈ ట్రాఫిక్ రూల్ సిప్రస్(Cyprus) దేశంలోలో ఉంది. ఇందుకు 85 యూరోల జరిమానా కూడా విధించబడుతుంది. కాబట్టి ఆ దేశ ప్రజలకు కారులో ఈ పదార్థాలను తీసుకెళ్లరు.

మురికి కారుతో రోడ్లపైకి రావద్దు: మీ కారుపై ఎక్కువ మురికి ఎక్కువ మురికితో (Dust) ఉంటే రోడ్లపైకి తీసుకురావద్దు. ఈ రూల్ రష్యాలో ఉంది. దీనిని ఉల్లంఘిస్తే ట్రాఫిక్ పోలీసులు భారీ మొత్తంలో ఫైన్ వేస్తారు. ఈ జరిమానా 2,000 రూబుల్స్ (Rubles) లేదా సుమారు రూ.1,900 వరకు భారీ సొమ్ముని చెల్లించాల్సి ఉంటుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








