ఆటో ఎక్స్‌పో 2014లో మహీంద్రా ఆటోమోటివ్ 'ఫ్లాష్ మాబ్'
'ఫ్లాష్ మాబ్' ఒకప్పుడు విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ ట్రెండ్ ఇప్పుడు మన దేశానికి కూడా పాకింది. ఈ ఫ్లాష్ మాబ్ ఒక గ్రూప్ డ్యాన్స్ లాంటింది. అయితే, చూసే వారికి మాత్రం ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఫ్లాష్ మాబ్‌లో భాగంగా కొందరు సభ్యులు ముందుగానే ప్లాన్ చేసుకొని, బాగా జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశంలో అకస్మాత్తుగా మ్యూజిక్ ప్లే చేసి, ఒకరి తర్వాత మరొకరుగా చేరుతూ అలా పెద్ద గ్రూప్‌లా నాట్యం చేస్తారు.
కొందరు ఈ తరహా ఫ్లాష్ మాబ్‌ను చారిటీ కోసం నిర్వహిస్తుంటే, మరికొందరు సరదా కోసం, ఇంకొందరు మార్కెటింగ్ కోసం నిర్వహిస్తుంటారు. ఇదే కోవలో మహీంద్రా ఆటోమోటివ్ కూడా గడచిన ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో తమ స్టాల్ వద్ద ఫ్లాష్ మాబ్‌ను నిర్వహించిన వీక్షకుల దృష్టిని ఆకట్టుకుంది.
ఆటో ఎక్స్‌పోలో నిర్వహించిన ఈ ఫ్లాష్ మాబ్‌ను చూడటం మీరు మిస్సయి ఉంటే, ఇదిగో ఈ వీడియోలో ఆ విచిత్రాన్ని మీరు కూడా వీక్షించండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/bBwh0Gpwifw?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








