ఫ్లైట్ అటెండెంట్ నుంచి ఎయిర్‌లైన్స్ సీఈఓగా.. మిత్సుకో సక్సెస్ స్టోరీ ఓ ఇన్సిపిరేషన్..
విమానంలో అటెండెంట్ స్థాయి నుంచి ఏకంగా ఎయిర్‌లైన్స్ సీఈఓ(Flight Attendant CEO)గా ఎదిగారు ఓ మహిళ. ఉన్నత స్థానాల్లో ఎక్కువగా పురుషాధిపత్యం ఉన్న దేశంలో అగ్ర స్థాయిలో ఉన్న మహిళలు చాలా తక్కువ. ఆ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు ఈ అసాధారణ మహిళ. మరి ఆమె కథేంటి.. ఈ సంఘటన ఎక్కడ చోటుచేసుకుంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
ఒక ప్రముఖ కంపెనీకి అధినేతగా ఎదగడమంటే సాధారణ విషయం కాదు. ఉన్నత శిఖరాలను సాధించడానికి ఎంతో కృషి, పట్టుదల ఉండాలి. అలాంటి మహానుభావులు భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ ఉన్నారు. భారత్‌కు చెందిన ఎంతో మంది ఇతర దేశాల్లో కంపెనీలకు సీఈవోలుగా ఏలుతున్నారు. అయితే ఈ కోవలో ఎక్కువగా పురుషుల గురించే మాత్రమే వింటాం. కానీ ఇక్కడ ఓ మహిళ ఫ్లైట్ అటెండెంట్ నుంచి సీఈవో స్థాయికి ఎదిగింది.

ప్రపంచంలో ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదిగిన వారు(Flight Attendant Became CEO).. తమ విజయ గాథలను మనతో పంచుకుంటారు. అందుకు ఇంటర్నెట్ సాక్ష్యం. వారి స్ఫూర్తితో గొప్ప స్థాయికి ఎదిగిన వారు కూడా ఉన్నారు. చాలా మంది తాము లక్ష్యంగా పెట్టుకున్న ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ఫలానా వ్యక్తి ఇన్‌స్పిరేషన్ అని చెబుతుంటారు. ఇది వారికి ఎంతో గర్వకారణంగా ఉంటుంది.
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. మహిళా సాధికారత దిశగా ప్రపంచ దేశాలు పాటుపడుతున్నాయి. వారి ఆలోచనలు, సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇస్తూ కంపెనీలతో పాటు దేశాల ఆర్థిక వ్యవస్థలకూ దోహద పడేలా చేస్తున్నాయి. ఇప్పుడు మహిళలు అడుగుపెట్టని రంగమంటూ లేదు. భూమి, ఆకాశం, నీరు ఇలా అన్నిటిలోనూ వారి పాత్ర ఎంతో కీలకంగా ఉంటోంది.

ఈ క్రమంలో ఎయిర్‌లైన్స్‌లో సాధారణ అటెండెంట్ స్థాయి నుంచి ఆ ఎయిర్‌లైన్స్ సీఈఓ(Chief Executive Officer) స్థాయికి ఎదిగారు జపాన్‌కు చెందిన మిత్సుకో టోటోరి. గత జనవరిలో ఆమె జపాన్ ఎయిర్‌లైన్స్ సీఈఓగా నియమితులయ్యారు. ఈ వార్త కార్పొరేట్ రంగంలో మైలురాయిగా నిలిచింది. క్యాబిన్ క్ర్యూ మెంబర్ నుంచి చాలా ఏళ్ల కృషి, పట్టుదల తర్వాత ఆమె ఇప్పుడు సీఈఓ అవడంతో.. ఆమె కథ చాలా మంది స్ఫూర్తినిస్తోంది.
1985లో, మిత్సుకో టోటోరి జపనీస్ ఎయిర్‌లైన్స్‌లో ఫ్లైట్ అటెండెంట్‌గా తన వృత్తిని ప్రారంభించారు. దాదాపు మూడు దశాబ్దాలు పనిచేసిన తర్వాత, ఆమె.. 2015లో సీనియర్ డైరెక్టర్ ఆఫ్ క్యాబిన్ అటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2024లో, పలు ర్యాంకుల ద్వారా ఆమె జపాన్ ఎయిర్‌లైన్స్‌కి ప్రెసిడెంట్ మరియు CEO అయ్యారు. అంతేకాకుండా ఎయిర్‌లైన్స్‌లో ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా మిత్సుకో రికార్డు సృష్టించడం విశేషం.
కాగా టాప్ కంపెనీలకు మహిళలు నాయకత్వం వహిస్తున్న దేశాల్లో జపాన్ ఒకటి. అందులో జపాన్ 1 శాతం కంటే తక్కువ వాటాతో ఉంది. దీంతో Mitsuko Tottori CEO గా నియామకం కావడం సంచలనంగా మారింది. COVID-19 మహమ్మారి సమయంలో మిత్సుకో అనుభవం మరియు సహకారం.. ఆమెను సీఈఓగా చేయడానికి కీలకంగా నిలిచాయని ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.
కాగా జపాన్ ఎయిర్‌లైన్స్‌లో ఇప్పటివరకు 10 మంది పురుషులు అగ్రస్థానంలో ఉన్నారు. వారిలో ఏడుగురు ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసించినవారే. కానీ మిత్సుకో టోటోరి మాత్రం ఇందుకు మినహాయింపు. ఆమె నేపథ్యం అందరికంటే భిన్నం. మిత్సుకో తన గ్రాడ్యుయేషన్‌ను నాగసాకిలోని క్వాస్సూయ్ ఉమెన్స్ జూనియర్ మహిళా కాలేజ్‌లో పూర్తి చేసింది.
కాగా జపాన్ కార్పొరేట్ సెక్టార్‌లో పురుషులు మరియు మహిళలు సమానంగా ప్రాతినిధ్యం వహించాలని వాదించే న్యాయవాదులలో మిత్సుకో కూడా ఒకరు. ఇక అన్ని రంగాల్లో మహిళా సాధికారత వైపు జపాన్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇక తాజాగా ఎయిర్‌లైన్స్ సీఈఓగా మిత్సుకో నియామకంతో ప్రపంచ దేశాలన్నీ ఆమె వైపు చూస్తున్నాయి.


Click it and Unblock the Notifications








