విమానం బోర్డింగ్‌ సమయంలో కాక్‌పిట్‌ డోర్‌ ఎందుకు తెరిచి ఉంటుందో తెలుసా??.. కారణాలివే.!!

ప్రయాణికులు విమానం ఎక్కేటప్పుడు ఇంకా దిగుతున్నప్పుడు పైలట్ కూర్చున్న కాక్‌పిట్(Cockpit Doors) తలుపు తెరిచి ఉండటాన్ని మీరెప్పుడైనా గమనించారా.?? విమాన ప్రయాణ సమయంలో మాత్రమే కాక్‌పిట్ డోర్ మూసి ఉంటుంది. విమానం ల్యాండింగ్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఈ కాక్‌పిట్ డోర్‌ను ఎందుకు తెరిచి ఉంచుతారో తెలుసా.??

ట్రైన్‌ జర్నీ, బస్సు ప్రయాణాలతో పోలిస్తే.. విమాన ప్రయాణం రిస్క్‌తో కూడుకున్నది మాత్రమే కాదు.. చాలా ఆశ్చర్యకరంగా కూడా ఉంటుంది. ఓ వైపు టెక్నికల్‌ కారణంగా ప్రమాదాలు జరుగుతుండగా.. మరో వైపు టెర్రరిస్టులు చేసే హైజాక్‌.. ఇలా చాలా ప్రమాదాలు పొంచి ఉంటాయి. అందుకే విమానాల్లో భద్రత(Why Flight Cockpit Doors Close During Takeoff) అనేది చాలా ముఖ్యం.

Cockpit-Door-Open-During-Boarding

అందుకే ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ సిబ్బంది ద్వారా ప్రయాణికులను, వారి లగేజీని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతనే వారిని ఫ్లైట్‌ లోపలికి అనుమతిస్తారు. అయితే విమానం ఎక్కేటప్పుడు ప్రయాణికుడు కాక్‌పిట్‌ ఉన్న ప్రాంతం గుండా డోర్‌ నుంచి ఎక్కాల్సి ఉంటుంది. దీని ద్వారా కాక్‌పిట్‌(Why Cockpit Doors Open During Boarding) లోపల ప్రయాణికులు సులభంగా చూడగలరు. దిగేటప్పుడు కూడా ఇలాగే కనిపిస్తుంది.

అయితే విమానం ప్రయాణిస్తున్న సమయంలో ప్రయాణికులు కాక్‌పిట్ ఏరియా(Cockpit Doors Open) దగ్గరికి వెళితే డెక్‌ ఏరియా తలుపులు మూసుకుపోతాయి. విమానం నేలపై ఉన్నప్పుడు మాత్రమే కాక్‌పిట్ తెరిచి ఉంటుంది.? ఇలాంటి సమయంలో ఉగ్రవాదాలు అందులోకి ప్రవేశించే అవకాశం లేదా అని మీరు అుకోవచ్చు. దీని వెనుక కొన్ని కారణాలున్నాయి.

Cockpit-Door-Open-During-Boarding

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని విమానయాన సంస్థలు విమానం నేలపై ఉన్నప్పుడు కాక్‌పిట్ తలుపులు ఇలా తెరిచి ఉంచాలనే నియమంతో పనిచేస్తాయి. విమానం టేకాఫ్ అయ్యే ముందు, చాలా తనిఖీలు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఇంధనం నింపుకోవడం, విమానం ట్యాక్సీ లైన్ స్పష్టంగా ఉందా??.. ఇతర స్టాఫ్‌ సిద్ధంగా ఉందా.. ఇలాంటి అన్నిటిని తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది.

వీళ్లంతా నేరుగా ఎయిర్‌లైన్ డెక్‌ పరిధిలోకి వస్తారు. ఫ్లైట్ టేకాఫ్‌ అవ్వడానికి ముందు పైలట్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక చివరగా పైలట్ కాక్‌పిట్ లోపల తన పనిలో నిమగ్నమై ఉంటారు. అతను విమానం బోర్డింగ్‌ను కూడా పర్యవేక్షించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇతర సిబ్బందితో మాట్లాడాల్సి వస్తుంది. అదే సమయంలో, అతను విమానం బోర్డింగ్‌ను పర్యవేక్షించవలసి వస్తే మాత్రమే కాక్‌పిట్ తలుపులు తెరిచి ఉంచాలి.

Cockpit-Door-Open-During-Boarding

ఈ క్రమంలో ఫ్లైట్‌ సిబ్బందితో కమ్యూనికేట్‌ అవ్వడం కోసం కాక్‌పిట్ తలుపు తెరిచి ఉంచుతారు. అందుకే ప్రయాణీకులు ఎక్కేటప్పుడు మరియు దిగేటప్పుడు లోపల ఏమి ఉందో చూసే అవకాశం ఉంటుంది. అయితే కొన్నేళ్ల క్రితం వరకు ప్రయాణీకులు కావాలనుకుంటే విమానం యొక్క డెక్‌ లోపల చూడటానికి అనుమతించేవారు. అయితే దీనికి అనుమతి ఇవ్వడం లేదు. పైలట్‌తో మాట్లాడాలనుకున్నా.. కాక్‌పిట్ డోర్ దగ్గర నిలబడి మాత్రమే మాట్లాడాల్సి ఉంటుంది.

మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కాక్‌పిట్ తలుపులు ఇలా తెరిచి ఉంచాలనే నియమంతో ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో జర్నీ సమయంలో కాక్‌పిట్‌ డోర్లు తెరుస్తారు. పైలట్‌లకు సిబ్బంది వారి ఇన్‌ఫ్లైట్ భోజనాన్ని అందించినప్పుడు కాక్‌పిట్‌ డోర్‌ ఓపెన్‌ చేస్తారు. అయితే వాస్తవానికి, కాక్‌పిట్ నుండి రావడం లేదా వెళ్లడం జరగాలంటే.. క్యాబిన్ సిబ్బందితో సహా కెప్టెన్ లేదా పైలట్-ఇన్-ఛార్జ్ అనుమతి అవసరం.

More from DriveSpark

Article Published On: Friday, January 26, 2024, 9:54 [IST]
English summary
Flight cockpit doors open during boarding here are the reasons
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+