Free Flight Ticket పైసా ఖర్చు లేకుండా విమాన ప్రయాణం.. ఈ ట్రిక్స్ ఫాలో అయితే చాలు!!
విమాన ప్రయాణం అంటే సౌకర్యవంతమైన ప్రయాణం.. తక్కువ సమయంలో గమ్యస్థానం చేరడమే కాదు. ఖరీదైన ప్రయాణం కూడా. అయితే ఇప్పుడు విమాన టికెట్ ధరలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. సదరు ఎయిర్ లైన్ సంస్థలు అందించే ఆఫర్ల ద్వారా తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం చేయవచ్చు. కానీ కొంతమంది పైసా ఖర్చు లేకుండా సింపుల్ ట్రిక్స్ ద్వారా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు.
చదవడానికి మీకు ఇది నమ్మశక్యంగా లేకపోయినా ఈ వార్త 100 శాతం నిజం. అయితే ఉచిత ప్రయాణం కోసం ప్రయాణికులు కొన్ని ప్రధాన దశలు అనుసరించాల్సి ఉంటుంది. ముందుగా ఈ ఉచిత ప్రయాణం అందరికీ అందుబాటులో ఉండదని మీరు ఇక్కడ గమనించాలి. మీరు విమానంలో తరచుగా ప్రయాణించే వారైతేనే కొన్ని ట్రిక్స్ ద్వారా ఉచితంగా పొందే అవకాశాన్ని పొందవచ్చు.

ఆ ట్రిక్స్ మీ కోసం. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదైనా ప్రొడక్ట్ కొనాలంటే మొదట వెతికేది ఆన్‌లైన్‌లోనే. మనం ఆన్‌లైన్‌లో ఏదైనా కొనుగోలు చేస్తే కొన్ని బ్రాండ్‌లు మనకు రివార్డ్ పాయింట్లను ఇస్తాయి. ఈ విషయంపై చాలా మందికి అవగాహన ఉంది. అదే విధంగా ఎయిర్‌లైన్స్ మీకు రివార్డ్ పాయింట్‌లను కూడా అందిస్తాయి. ఆ రివార్డ్ పాయింట్లను మనం చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు.
ఒక నిర్దిష్ట ఎయిర్‌లైన్ విమానానికి ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసినప్పుడు వారు ప్రయాణికులకు రివార్డ్ పాయింట్‌లను ఇస్తారు. ఈ రివార్డ్ పాయింట్లను భారత్‌లో ఎయిర్ మైల్స్ అంటారు. ఈ పాయింట్లను అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. ఉచిత విమాన టిక్కెట్ల కోసం ఈ పాయింట్లను కూడా రీడీమ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రీగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు.

ఈ పాయింట్లకు కరెన్సీ విలువ కూడా ఇవ్వబడుతుంది. ప్రతి విమానయాన సంస్థ వేర్వేరు విలువలను అందిస్తుంది. ఉదాహరణకు 'స్పైస్‌జెట్'(Spicejet) ఒక్కో రివార్డ్ పాయింట్‌కు 50 పైసల విలువను అందిస్తుంది. మీకు రెండు స్పైస్‌జెట్ పాయింట్లు ఉంటే దాని విలువ ఒక రూపాయి అవుతుంది. అలాగే 10 పాయింట్లు ఉంటే 5 రూ. విలువ ఇస్తుంది. వీటిని మనం రీడీమ్ చేసుకోవచ్చు.
ఈ పాయింట్లను అలాగే ఉంచి మనం అవసరమైనప్పుడు వినియోగించుకోవచ్చు. మీరు ఎక్కడికైనా విమానంలో వెళ్లాలి అనుకున్నప్పుడు.. సదరు విమాన టిక్కెట్ ధర రూ. 5 వేలు ఉంది అనుకుందాం. ఇప్పుడు మీరు 10,000 స్పైస్ జెట్ రివార్డ్ పాయింట్లను కలిగి ఉంటే.. మీరు ఉచితంగా ప్రయాణించడానికి తగినన్ని పాయింట్‌లను రీడీమ్ చేసుకోవచ్చు. ఈ ట్రిక్స్‌ని ఉపయోగించి ఇప్పటికే చాలా మంది ఉచితంగా ప్రయాణించారు. ఇక ఇప్పుడు మీ వంతు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








