Just In
- 15 min ago
హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్
- 41 min ago
టెస్టింగ్ దశలో మరోసారి కనిపించిన జీప్ కంపాస్ 7 సీటర్.. లాంచ్ ఎప్పుడంటే?
- 1 hr ago
సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్
- 2 hrs ago
భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు
Don't Miss
- Movies
Vivek no more: సమాజానికి ఎనలేని సేవ.. తీవ్ర దిగ్బ్రాంతికి గురైన ప్రధాని మోదీ..
- News
లాలూకు భారీ ఊరట- గడ్డి స్కాంలో నాలుగో కేసులో ఎట్టకేలకు బెయిల్..
- Sports
మరో అద్దిరిపోయే రికార్డ్‌కు చేరువలో రోహిత్: ఆ మైల్ స్టోన్‌కు దగ్గరగా: జాయింట్‌గా జాయిన్
- Lifestyle
ఆరోగ్య చిట్కాలు: దంతాల సంరక్షణ కోసం 'కొబ్బరి నూనె' ఇలా వాడండి!
- Finance
బిట్ కాయిన్ కంటే... బంగారంపై 15% పెట్టుబడి మంచిది!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించిన పిల్లి.. ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజమే
విమాన ప్రయాణాలు, ప్రయాణికునికి ఎంత ఆనందాన్ని ఇస్తాయో, ఏదైనా తేడా జరిగితే అంత దుఃఖాన్ని మిగులుస్తాయి. సాధారణంగా విమానం ఒకసారి టేకాఫ్ అయినా తర్వాత దాని గమ్యస్థానలోనే ల్యాండ్ అవుతుంది. కానీ కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతుంది. ఇప్పుడు ఒక పిల్లి చేసిన పని వల్ల విమానం వెంటనే ల్యాండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నివేదికల ప్రకారం ఈ విచిత్రమైన సంఘటన సుడాన్‌లో జరిగింది. సుడాన్ రాజధాని ఖార్టూమ్ నుండి ఖతార్ రాజధాని దోహాకు వెళ్తున్న విమానం ఒక పిల్లి దాడి కారణంగా ఖార్టూమ్ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎందుకు జరిగిందంటే, విమానం యొక్క కాక్‌పిట్‌లో ఒక పిల్లి చేరింది.

మొదట్లో పిల్లి విమానం కాక్‌పిట్‌లో చేరినట్లు పైలట్ గమనించలేదు. విమానం బయలుదేరిన అరగంట తరువాత, విమానం నడుపుతున్న పైలట్‌పై పిల్లి దాడి చేసింది. పరిస్థితి యొక్క తీవ్రతను గ్రహించిన పైలట్ పిల్లిని అక్కడి నుండి తరిమికొట్టడానికి ప్రయత్నించాడు. కానీ పిల్లి మరింత ఆందోళనకు గురై పైలట్‌పై మళ్లీ దాడి చేసింది. ఈ ఘటనలో విమానం పైలట్ గాయపడ్డాడు.
MOST READ:భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్

ఆ సమయంలో పిల్లి చేసిన ఈ పని వల్ల వెంటనే ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. ఆ పిల్లి కాక్‌పిట్‌లోకి ఎలా ప్రవేశించిందో తెలియదు. ఖార్టూమ్ విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేసి ఈ సంఘటనపై తీవ్రమైన దర్యాప్తు చేస్తున్నారు. నివేదికల ప్రకారం, పిల్లి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది.

కోపంతో ఉన్న పిల్లి పైలట్‌పై దాడి చేసి విమానం టేకాఫ్ అయినా కొద్దీ చేపటికే ల్యాండ్ అయ్యేలా చేసింది. ఈ సంఘటన వల్ల విమానంలో ప్రయాణికులు చాలా భయపడ్డారు.
MOST READ:త్వరపడండి.. అక్కడ ఒక కేజీ కేక్ కొంటె ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ

కొంతమంది నెటిజన్లు ఈ సంఘటనను పిల్లి చేసిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ అని ట్రోల్ చేస్తున్నారు. విమానం ఆపి ఉంచినప్పుడు లేదా శుభ్రపరిచేటప్పుడు పిల్లి విమానంలోకి ప్రవేశించి ఉండవచ్చు అని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

సంఘటనకు ముందు రోజు రాత్రి విమానం విమానాశ్రయంలో నిలిపి ఉంచబడింది. ఆ సమయంలో పిల్లి విమానంలోకి ప్రవేశించి ఉండవచ్చని విమానాశ్రయ అధికారులు తెలిపారు. కానీ ఖచ్చితమైన కారణం తెలియదు. విమానం శుబ్రపరిచేటప్పుడు మరియు ఇంజనీరింగ్ తనికీ చేసినప్పుడు కూడా ఈ పిల్లిని గమనించకపోవడం గమనార్హం.

ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు తీవ్ర ప్రమాదాలకు గురిచేస్తాయి. సంబంధిత అధికారులు జాగరూకగా ఉండాలి, అప్పుడే ఇలాంటి సంఘటనలు మళ్ళీ తలెత్తకుండా ఉంటాయి.