విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించిన పిల్లి.. ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజమే

విమాన ప్రయాణాలు, ప్రయాణికునికి ఎంత ఆనందాన్ని ఇస్తాయో, ఏదైనా తేడా జరిగితే అంత దుఃఖాన్ని మిగులుస్తాయి. సాధారణంగా విమానం ఒకసారి టేకాఫ్ అయినా తర్వాత దాని గమ్యస్థానలోనే ల్యాండ్ అవుతుంది. కానీ కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతుంది. ఇప్పుడు ఒక పిల్లి చేసిన పని వల్ల విమానం వెంటనే ల్యాండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించిన పిల్లి.. ఆశ్చర్యంగా ఉందా, ఇది నిజమే

నివేదికల ప్రకారం ఈ విచిత్రమైన సంఘటన సుడాన్‌లో జరిగింది. సుడాన్ రాజధాని ఖార్టూమ్ నుండి ఖతార్ రాజధాని దోహాకు వెళ్తున్న విమానం ఒక పిల్లి దాడి కారణంగా ఖార్టూమ్ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎందుకు జరిగిందంటే, విమానం యొక్క కాక్‌పిట్‌లో ఒక పిల్లి చేరింది.

విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించిన పిల్లి.. ఆశ్చర్యంగా ఉందా, ఇది నిజమే

మొదట్లో పిల్లి విమానం కాక్‌పిట్‌లో చేరినట్లు పైలట్ గమనించలేదు. విమానం బయలుదేరిన అరగంట తరువాత, విమానం నడుపుతున్న పైలట్‌పై పిల్లి దాడి చేసింది. పరిస్థితి యొక్క తీవ్రతను గ్రహించిన పైలట్ పిల్లిని అక్కడి నుండి తరిమికొట్టడానికి ప్రయత్నించాడు. కానీ పిల్లి మరింత ఆందోళనకు గురై పైలట్‌పై మళ్లీ దాడి చేసింది. ఈ ఘటనలో విమానం పైలట్ గాయపడ్డాడు.

MOST READ:భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్

విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించిన పిల్లి.. ఆశ్చర్యంగా ఉందా, ఇది నిజమే

ఆ సమయంలో పిల్లి చేసిన ఈ పని వల్ల వెంటనే ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. ఆ పిల్లి కాక్‌పిట్‌లోకి ఎలా ప్రవేశించిందో తెలియదు. ఖార్టూమ్ విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేసి ఈ సంఘటనపై తీవ్రమైన దర్యాప్తు చేస్తున్నారు. నివేదికల ప్రకారం, పిల్లి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది.

విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించిన పిల్లి.. ఆశ్చర్యంగా ఉందా, ఇది నిజమే

కోపంతో ఉన్న పిల్లి పైలట్‌పై దాడి చేసి విమానం టేకాఫ్ అయినా కొద్దీ చేపటికే ల్యాండ్ అయ్యేలా చేసింది. ఈ సంఘటన వల్ల విమానంలో ప్రయాణికులు చాలా భయపడ్డారు.

MOST READ:త్వరపడండి.. అక్కడ ఒక కేజీ కేక్ కొంటె ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ

విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించిన పిల్లి.. ఆశ్చర్యంగా ఉందా, ఇది నిజమే

కొంతమంది నెటిజన్లు ఈ సంఘటనను పిల్లి చేసిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ అని ట్రోల్ చేస్తున్నారు. విమానం ఆపి ఉంచినప్పుడు లేదా శుభ్రపరిచేటప్పుడు పిల్లి విమానంలోకి ప్రవేశించి ఉండవచ్చు అని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించిన పిల్లి.. ఆశ్చర్యంగా ఉందా, ఇది నిజమే

సంఘటనకు ముందు రోజు రాత్రి విమానం విమానాశ్రయంలో నిలిపి ఉంచబడింది. ఆ సమయంలో పిల్లి విమానంలోకి ప్రవేశించి ఉండవచ్చని విమానాశ్రయ అధికారులు తెలిపారు. కానీ ఖచ్చితమైన కారణం తెలియదు. విమానం శుబ్రపరిచేటప్పుడు మరియు ఇంజనీరింగ్ తనికీ చేసినప్పుడు కూడా ఈ పిల్లిని గమనించకపోవడం గమనార్హం.

MOST READ:బుల్లెట్ ప్రూఫ్ కార్లకు రూ. 6.75 కోట్లు మంజూరు చేసిన జగన్ సర్కార్.. ఈ కార్లు వారికి మాత్రమే

విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించిన పిల్లి.. ఆశ్చర్యంగా ఉందా, ఇది నిజమే

ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు తీవ్ర ప్రమాదాలకు గురిచేస్తాయి. సంబంధిత అధికారులు జాగరూకగా ఉండాలి, అప్పుడే ఇలాంటి సంఘటనలు మళ్ళీ తలెత్తకుండా ఉంటాయి.

Most Read Articles

English summary
Flight Makes Emergency Landing After Cat Attacks Pilot. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X