విమాన ప్రయాణం చేయాలనుకుంటున్నారా.. వెనుక సీట్ల బుకింగ్‌పై ఓ పైలెట్‌ చెప్పిన సీక్రెట్‌..!!

మీరు ఎప్పుడైనా విమాన ప్రయాణం చేశారా.. విమానం టికెట్లు బుక్‌ చేసుకుంటున్న సమయంలో ఎవరైనా మీకు ఎటువంటి సలహాలైనా ఇచ్చారా.. వెనుక సీట్లు కాకుండా కేవలం ముందు సీట్లు మాత్రమే బుక్ చేసుకోమని చెప్పారా.. ఎందుకు ఇలాంటి సలహాలు ఇస్తుంటారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. ?

సాధారణంగా ఎక్కువ మంది యువతీయువకులు విమానాల్లో ప్రయాణించే సమయంలో కిటికీల పక్కన కూర్చొని ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తారు. విమానం గాల్లో ఉన్న సమయంలో అంత ఎత్తు నుంచి భూమి, ఇతర ప్రాంతాలు, కొన్ని భవనాలు చూసేందుకు చాలా మంది యువత ఇష్టపడతారు.

Flight pilot suggested to passengers to book front seats

అయితే ఇటీవల ఓ పైలెట్‌.. విమానంలో ముందు వరుస సీట్లను బుక్ చేసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెనుక వైపు వాష్‌రూంలు ఉంటాయని, అందుకే ముందు సీట్లు బుక్ చేసుకోవాలని కొంత మంది చెబుతుంటారు. అది సరైన కారణం కాదు. ఇందుకు మరొక కారణం కూడా ఉంది. సాధారణంగా ప్లైట్‌ అటెండెంట్లు కూడా ఎక్కువగా ముందు వరుస సీట్లనే ఎంచుకోమని చెబుతారు.

ఎయిర్‌లైన్‌ పైలెట్‌ ప్యాట్రిక్‌ స్మిత్‌ ముందు వరుస సీట్లపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. క్యాబిన్‌ వద్ద కంటే విమానం వెనుక వైపు టర్బులెన్స్‌ ఎక్కువగా ఉంటుందని ఆ కారణంగా ప్రయాణికులు ఎక్కువగా అసౌకర్యానికి గురవుతారని ఆయన తెలిపారు. అందువల్ల ముందు వరుసలో సీట్లు బుక్‌ చేసుకొనేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

Flight pilot suggested to passengers to book front seats

మరో విషయాన్ని కూడా పైలెట్‌ ప్యాట్రిక్‌ స్మిత్‌ పంచుకున్నారు. విమానంలో ఒకటి లేదా రెండు గంటల ప్రయాణం అయితే ముందు, వెనుక సీట్లలో ఎక్కడ కూర్చున్న పెద్దగా సమస్యలు ఉత్పన్నం కావని చెప్పారు. అదే సుదూర ప్రయాణాలు చేస్తున్న సమయంలో మాత్రం ముందువైపు సీట్లను కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వాస్తవానికి తరచూ విమాన ప్రయాణాలు చేసేవారు, లేదా ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగులు క్యాబిన్‌ దగ్గరే సీట్లు కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు.

ఫ్లైట్‌ అటెండెంట్‌ రోసీ అవద్‌ కూడా విమాన టికెట్‌ బుకింగ్‌పై కీలక సూచనలు చేశారు. విమానం ముందు భాగంలో వీలైనంత దగ్గరగా కూర్చోవాలని సూచించారు. విమానం ఎక్కేందుకు, దిగేందుకు దగ్గరగా ఉండడమే కాకుండా ఏవైనా సేవలు పొందేందుకు ముందు వరుస సీట్లు సౌకర్యంగా ఉంటాయని చెప్పారు.

Flight pilot suggested to passengers to book front seats

చాలా విమానాల్లో వెనుక సీట్లు కంటే ముందు వరుసలో సీట్ల మధ్య దూరం కాస్త ఎక్కువగా ఉంటుంది. దూరం కేవలం కొన్ని సెంటీమీటర్లలో మాత్రమే ఉంటుంది. ఒకటి, రెండు గంటల దూరానికి పెద్ద తేడా లేకపోయినా, సుదూర ప్రయాణాల సమయంలో ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, June 22, 2023, 18:02 [IST]
English summary
Flight pilot suggested to passengers to book front seats instead of rear seats
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+