ఒకే రన్‌వే పై రెండు విమానాలు.. జస్ట్‌లో మిస్‌.. భయపెడుతున్న వైరల్‌ వీడియో!!

ముంబయి ఎయిర్ పోర్టులో ఒకే రన్‌వే పై రెండు విమానాలు ఒకేసారి టేకాఫ్‌, ల్యాండిగ్‌ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌ని షేక్‌ చేస్తుంది. శనివారం (08-జూన్‌-2024)న ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఈ సంఘటన హాలీవుడ్‌ యాక్షన్ సీక్వెన్స్‌ని తలపించింది. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అధికారుల ఆదేశాలతో ఏకకాలంలో అనుమతి ఇచ్చారా? లేక ఇది మానవ తప్పిదమా? అసలు ఈ సంఘటన ఎలా జరిగింది? ఇది ప్రమాదకరమా? దీని వెనుక ఉన్న అసలు వాస్తవాలు మీ కోసం..

ప్రస్తుతం విమాన ప్రయాణం సర్వసాధారణం ఐపోయింది. అందుబాటులో ఉన్న సాంకేతికతో వందల సంఖ్యలో విమానాలు గగనతలంలో విహరిస్తున్నాయి. ముఖ్యంగా భారత దేశంలో నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులను గమ్యాలకు చేర్చుతున్నాయి. విమాన ప్రయాణాలు పెరగడంతో విమానయాన సంస్థలు, ఏవియేషన్ మానిటరింగ్ ఏజెన్సీలు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నాయి. ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీతో విమానాలను ప్రతీ క్షణం మానిటరింగ్ చేస్తున్నాయి.

Mumbai-Airport-Two-Planes-In-Single-Runway

సాధారణంగా విమానం ఎయిర్ పోర్టు నుంచి విమానం టేకాఫ్ అయిన తర్వాత తర్వాత నెక్ట్స్‌ విమానాన్ని అనుమతిస్తారు. ఇందుకోసం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అనేది ఏవియేషన్ మానిటరింగ్ మరియు రెగ్యులేటరీ బాడీ రన్‌వే పై విమానాలు ప్రయాణించాల్సిన వేగం ఇతర మొత్తం సమాచారాన్ని అందిస్తుంది. ఇలా ప్రతి దేశానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉంటుంది. అదేవిధంగా ప్రతి విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌ ఉంటుంది.

ఒక విమానం నిర్దేశించిన విమానాశ్రయంలో ల్యాండ్ కావాలంటే లేదా విమానం టేకాఫ్ తీసుకోవడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి అవసరం. ప్రస్తుతం ముంబయి ఎయిర్‌పోర్టులో క్రాసింగ్‌ రన్‌వేస్‌ 9/27, 14/32 పై రోజుకు 850 విమానాలను టేకాఫ్, ల్యాండ్ చేయడానికి ఈ రన్‌వేలను ఉపయోగిస్తారు. ఒక్క రన్‌వే నెంబర్ 9/27పై గంటకు 46 విమానాలను ల్యాండింగ్‌ జరుగుతాయి.

Mumbai-Airport-Two-Planes-Landing-And-Take-Off

శనివారం భారత కాలమానం ప్రకారం 00:45:05 గంటలకు ఎయిరిండియా విమానం 657 టేకాఫ్‌కి సిద్ధంగా ఉంది. అయితే అదే సమయంలో ఇండోర్‌ నుంచి ముంబయికి చేరుకున్న ఇండిగో 6E 6053 విమానం 00:45:27 గంటలకు రన్‌వే పైకి వచ్చింది. ఎయిరిండియా ఇంకా నేలపైనే ఉండి టేకాఫ్‌ తీసుకుంటుండగా ఇండిగో ఇంకా గగనతలంలోనే ఉందని ఫ్లైట్ ట్రాకర్ తెలిపింది.

రన్ వే నిబంధనల ప్రకారం ఒకసారి ఒక విమానాన్ని ల్యాండ్ చేయడానికి ముందు మరో విమానం టేకాఫ్ పూర్తిగా కంప్లీట్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ల్యాండిగ్‌ అయ్యే విమానానికి టాక్సీవే పూర్తిగా సిద్ధంగా ఉండాలి. కానీ దానికి విరుద్ధంగా ఈ సంఘటన జరిగింది. ఈ ఘటన రన్ వేపై అమర్చిన కెమెరాలో రికార్డయింది. విమానం 1,200 అడుగుల దూరంలో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.

45 సెకన్లలో వ్యవధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం 45 సెకన్లు ఆలస్యమై ఉంటే పెద్ద ప్రమాదం జరిగేది. ఈ ప్రమాదంలో దాదాపు 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయేవారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ముంబయి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందిని డీజీసీఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, June 11, 2024, 10:38 [IST]
English summary
Flights take off and landing in same runway in mumbai airport video surfaces
Read more on: #off beat #planes #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+