2030 నాటికి 25 వేల ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించనున్న ఫ్లిప్‌కార్ట్

ఇండియన్ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ అంటే దాదాపు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇటీవల ప్రపంచమే అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న తరుణంలో మనకు ఏమి కావాలన్నా మన ఇంటికే వచ్చే వెసులుబాటు ఉంది. దీనికి కారణం ఈ కామర్స్ సర్వీసులు. ఇప్పడు ఈ కామర్స్ సర్వీస్ లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ 2030 నాటికి డెలివరీ కోసం దాదాపు 25 వేలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించనున్నట్లు తెలిపింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి సిద్దమవుతున్న ఫ్లిప్‌కార్ట్

వాల్మార్ట్ యాజమాన్యంలోని ఇ-కామర్స్ సంస్థ రాబోయే పదేళ్లలో ఎలక్ట్రిక్ మొబిలిటీ కోసం 100% ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలనే యోచనలో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ప్రధాన కార్యాలయం కర్ణాటకలోని బెంగళూరులో ఉంది. దేశవ్యాప్తంగా తన మొదటి మరియు చివరి మైలు డెలివరీ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి హీరో ఎలక్ట్రిక్, మహీంద్రా ఎలక్ట్రిక్, పియాజియో వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది.

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి సిద్దమవుతున్న ఫ్లిప్‌కార్ట్

నివేదికల ప్రకారం ఫ్లిప్‌కార్ట్ యొక్క ప్రత్యర్థి అమెజాన్ మహీంద్రా ఎలక్ట్రిక్‌తో పాటు భారతదేశంలో సుమారు 100 ఎలక్ట్రిక్ త్రీ వీలర్లను అభివృద్ధి చేసే ప్రణాళికలో పనిచేస్తున్నట్లు ఒక రోజు ముందే ప్రకటించినట్లు తెలిసింది.

MOST READ:మీ వాహనంపై ఈ స్టిక్కర్ ఉందా.. ఉంటే వెంటనే తీసెయ్యండి.. లేకుంటే ?

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి సిద్దమవుతున్న ఫ్లిప్‌కార్ట్

అమెరికా ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గత ఏడాది 2025 నాటికి దేశంలో 10,000 ఎలక్ట్రిక్ వాహనాలను మోహరిస్తామని కూడా హామీ ఇచ్చింది. అదే సమయంలో, ఫ్లిప్‌కార్ట్ తన డెలివరీల కోసం ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్ మరియు ఫోర్ వీలర్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది.

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి సిద్దమవుతున్న ఫ్లిప్‌కార్ట్

ఈ వాహనాలన్నీ భారతదేశంలో తయారుచేయబడతాయి. ఢిల్లీ, బెంగళూరు, పూణే, హైదరాబాద్, కోల్‌కతా, గౌహతిలతో సహా భారతదేశంలోని పలు చోట్ల ద్విచక్ర వాహనాలను మరియు త్రీ వీలర్స్ డ్రైవింగ్ చేయడం ప్రారంభించినట్లు కంపెనీ ఇప్పటికే తెలిపింది.

MOST READ:కారులో ఆహారపదార్థాలు నిల్వచేస్తే వచ్చే సమస్యలేంటో మీకు తెలుసా.. అయితే ఇది చూడండి

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి సిద్దమవుతున్న ఫ్లిప్‌కార్ట్

ఇటీవలి దేశ రాజధాని నగరం న్యూ ఢిల్లీలో గ్యాసోలిన్ మరియు డీజిల్ వాహనాలకు బదులుగా భారతదేశంలో పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించింది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలు అందుబాటులోకి తెస్తోంది.

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి సిద్దమవుతున్న ఫ్లిప్‌కార్ట్

2019 నివేదిక ప్రకారం, ఓలా మరియు ఉబర్ వంటి ప్యాసింజర్-హిల్లింగ్ సంస్థలలో కూడా 2026 ఏప్రిల్ నాటికి 40% వరకు ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని భారత ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపింది. సంస్థ యొక్క ప్రణాళికలను వివరిస్తూ, ఫ్లిప్‌కార్ట్‌లోని ఇకార్ట్ మరియు మార్కెట్‌ప్లేస్ యొక్క ఎస్‌విపి అమితేష్ జా మాట్లాడుతూ, ఫ్లిప్‌కార్ట్ సంస్థలో ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చడానికి మేము చాలా నిబద్దతతో ఉన్నామన్నారు.

MOST READ:డ్రైవింగ్ లైసెన్స్‌లోని ఈ చిత్రం భలే విచిత్రం..చూసారా..!

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి సిద్దమవుతున్న ఫ్లిప్‌కార్ట్

2030 నాటికి మా లాజిస్టిక్స్ ఫ్లీట్స్ పూర్తిగా ఎలక్ట్రిక్ గా మార్చడానికి ఈ ప్రయాణంలో, ప్రముఖ స్థానిక సంస్థలతో కలిసి ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి మరియు అమలు చేయడానికి, అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడతాము అని కూడా ఆయన స్పష్టం చేశారు.

Most Read Articles

English summary
Flipkart To Deploy 25,000 Electric Vehicles In Its Fleet By Year 2030 Details. Read in Telugu.
Story first published: Wednesday, February 24, 2021, 19:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X