Just In
- 8 hrs ago
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!
- 10 hrs ago
విడుదలకు ముందే యమహా FZ-X స్పెసిఫికేషన్స్ లీక్
- 12 hrs ago
భారత్‌లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్‌బర్డ్; ధర & వివరాలు
- 13 hrs ago
మిస్టర్ మస్క్.. భారత్‌లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ
Don't Miss
- News
వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్‌పై సంచలనం
- Sports
PBKS vs CSK: 'సూపర్' జడేజా! కళ్లుచెదిరే రనౌట్.. స్టన్నింగ్ క్యాచ్!వీడియోలు
- Movies
పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన రాంగోపాల్ వర్మ.. కోవిడ్ 19 హీరో అంటూ..
- Finance
మళ్లీ బంగారం ర్యాలీ ప్రారంభమైందా? 15 రోజుల్లో 6% జంప్
- Lifestyle
Happy Ramadan 2021: ఈద్-ముబారక్ ప్రత్యేక సందేశాలను మీకిష్టమైన వారితో పంచుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
2030 నాటికి 25 వేల ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించనున్న ఫ్లిప్‌కార్ట్
ఇండియన్ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ అంటే దాదాపు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇటీవల ప్రపంచమే అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న తరుణంలో మనకు ఏమి కావాలన్నా మన ఇంటికే వచ్చే వెసులుబాటు ఉంది. దీనికి కారణం ఈ కామర్స్ సర్వీసులు. ఇప్పడు ఈ కామర్స్ సర్వీస్ లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ 2030 నాటికి డెలివరీ కోసం దాదాపు 25 వేలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించనున్నట్లు తెలిపింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

వాల్మార్ట్ యాజమాన్యంలోని ఇ-కామర్స్ సంస్థ రాబోయే పదేళ్లలో ఎలక్ట్రిక్ మొబిలిటీ కోసం 100% ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలనే యోచనలో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ప్రధాన కార్యాలయం కర్ణాటకలోని బెంగళూరులో ఉంది. దేశవ్యాప్తంగా తన మొదటి మరియు చివరి మైలు డెలివరీ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి హీరో ఎలక్ట్రిక్, మహీంద్రా ఎలక్ట్రిక్, పియాజియో వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది.

నివేదికల ప్రకారం ఫ్లిప్‌కార్ట్ యొక్క ప్రత్యర్థి అమెజాన్ మహీంద్రా ఎలక్ట్రిక్‌తో పాటు భారతదేశంలో సుమారు 100 ఎలక్ట్రిక్ త్రీ వీలర్లను అభివృద్ధి చేసే ప్రణాళికలో పనిచేస్తున్నట్లు ఒక రోజు ముందే ప్రకటించినట్లు తెలిసింది.
MOST READ:మీ వాహనంపై ఈ స్టిక్కర్ ఉందా.. ఉంటే వెంటనే తీసెయ్యండి.. లేకుంటే ?

అమెరికా ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గత ఏడాది 2025 నాటికి దేశంలో 10,000 ఎలక్ట్రిక్ వాహనాలను మోహరిస్తామని కూడా హామీ ఇచ్చింది. అదే సమయంలో, ఫ్లిప్‌కార్ట్ తన డెలివరీల కోసం ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్ మరియు ఫోర్ వీలర్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది.

ఈ వాహనాలన్నీ భారతదేశంలో తయారుచేయబడతాయి. ఢిల్లీ, బెంగళూరు, పూణే, హైదరాబాద్, కోల్‌కతా, గౌహతిలతో సహా భారతదేశంలోని పలు చోట్ల ద్విచక్ర వాహనాలను మరియు త్రీ వీలర్స్ డ్రైవింగ్ చేయడం ప్రారంభించినట్లు కంపెనీ ఇప్పటికే తెలిపింది.
MOST READ:కారులో ఆహారపదార్థాలు నిల్వచేస్తే వచ్చే సమస్యలేంటో మీకు తెలుసా.. అయితే ఇది చూడండి

ఇటీవలి దేశ రాజధాని నగరం న్యూ ఢిల్లీలో గ్యాసోలిన్ మరియు డీజిల్ వాహనాలకు బదులుగా భారతదేశంలో పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించింది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలు అందుబాటులోకి తెస్తోంది.

2019 నివేదిక ప్రకారం, ఓలా మరియు ఉబర్ వంటి ప్యాసింజర్-హిల్లింగ్ సంస్థలలో కూడా 2026 ఏప్రిల్ నాటికి 40% వరకు ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని భారత ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపింది. సంస్థ యొక్క ప్రణాళికలను వివరిస్తూ, ఫ్లిప్‌కార్ట్‌లోని ఇకార్ట్ మరియు మార్కెట్‌ప్లేస్ యొక్క ఎస్‌విపి అమితేష్ జా మాట్లాడుతూ, ఫ్లిప్‌కార్ట్ సంస్థలో ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చడానికి మేము చాలా నిబద్దతతో ఉన్నామన్నారు.
MOST READ:డ్రైవింగ్ లైసెన్స్‌లోని ఈ చిత్రం భలే విచిత్రం..చూసారా..!

2030 నాటికి మా లాజిస్టిక్స్ ఫ్లీట్స్ పూర్తిగా ఎలక్ట్రిక్ గా మార్చడానికి ఈ ప్రయాణంలో, ప్రముఖ స్థానిక సంస్థలతో కలిసి ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి మరియు అమలు చేయడానికి, అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడతాము అని కూడా ఆయన స్పష్టం చేశారు.